Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చేయి విదల్చని పాకిస్థానీలు..! ఔదార్యంలో ‘స్థాయి’ చాటిన ఇండియన్స్…!!

September 25, 2021 by M S R

మన జీవితాలు ఎంత బుద్భుదమో కరోనా స్పష్టంగానే చెప్పింది… ఒక టైం వస్తే ఆస్తులు, అంతస్థులు, సంపద, హోదా, తెలివి, పాపులారిటీ, ఏవీ పనిచేయవని తేల్చేసింది… మరీ కొందరిది దిక్కులేని చావు, మున్సిపాలిటీ దహనాలు… అంతులేని వైరాగ్యాన్ని నింపింది కొన్నాళ్లు… ఇప్పుడిక కరోనా భయం తగ్గిందిగా… మళ్లీ మామూలే… మనిషి మారడు……….. అయితే ఈ సంక్షోభంలో కనీసం ఒక మనిషి తోటి మనిషికి అండగా నిలబడ్డాడా..? సాయం చేశాడా..? ఇలాంటి విపత్తుల్లో కాకపోతే ఇక సమాజం ఔదార్యం స్థాయి ఏమిటో ఇంకెప్పుడు తెలుస్తుంది..? సాటి మనిషికి భరోసా ఇవ్వడంలో ఏ సమాజాలు మెరుగ్గా వ్యవహరించాయి..? ఇంట్రస్టింగు కదా…! సీఏఎఫ్ అనే సంస్థ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ విడుదల చేసింది… అంటే దేశాలకు ఔదార్యంలో ర్యాంకుల్ని ఇచ్చింది…

giving index

ఆర్థికసాయం చేయడం, కొత్తవారైనా అండగా ఉండటం, ఆపన్నుల కోసం టైం కేటాయించడం… ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు… ఈ సర్వే విశ్వసనీయత, మార్కుల కూర్పు లోతుల్లోకి వెళ్లడం లేదు గానీ… కొన్ని ఇంట్రస్టింగు పాయింట్లున్నయ్…

Ads

  • ఇలాంటి ఔదార్యంలో ఇండియా గతంలో 82వ స్థానంలో ఉండేది… కరోనా పిరియడ్‌లో భారతీయులు ఒకరికొకరు అండగా నిలబడ్డారు… ఎంత అంటే..? 82వ స్థానం నుంచి ఎకాఎకిన 14వ ర్యాంకు ఎగబాకింది… తమకు తెలియనివాళ్లయినా సరే 61 శాతం మందికి సాయం చేశారు… 34 శాతం మంది తమ డబ్బును వెచ్చించారు… 36 శాతం మంది స్వచ్చందంగా సేవలందించారు… ఫస్ట్ వేవ్ సందర్భంగా ఏ పత్రికల్లో చూసినా ఇవే ఫోటోలు, ఇవే వార్తలు కనిపించేవి… అయితే ఇక్కడ ఓ ప్రశ్న… కరోనాకు ముందు మరీ భారతీయ సమాజం 82వ ర్యాంకుతో ఉందా..?
  • పాకిస్థాన్ ప్రస్తుతం ఔదార్యం ర్యాంకుల్లో 107వ ప్లేసుకు దిగజారిపోయింది… నిజంగా ఒకరికొకరు సాయంగా నిలబడాల్సిన విపత్తులో ఎవడి బతుకు వాడే చూసుకున్నాడు అనడానికి ఇదొక సూచిక…
  • విచిత్రం ఏమిటంటే..? కరోనా సమయంలో కలిసికట్టుగా విపత్తును ఎదుర్కోవడానికి ప్రయత్నించిన దేశాలు, ఔదార్యం ర్యాంకుల్లో టాప్‌లో ఉన్నది ఇండొనేసియా… దాంతోపాటు నైజీరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొసావో, కెన్యా, మయన్మార్, ఘనా, ఉగాండా, థాయ్‌లాండ్… వీటిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీసేస్తే మిగతావన్నీ చిన్న దేశాలు, పేద దేశాలు, చాలా అంశాల్లో మిగతా ప్రపంచం తేలికగా తీసుకునే దేశాలు… కానీ మాలోనే ఇంకా మానవత్వం ఉందని నిరూపించుకుంటున్న దేశాలు ఇవి…
  • ఇదేసమయంలో ఔదార్యం ర్యాంకుల్లో బాగా దిగజారిపోయిన దేశాలేమిటో తెలుసా..? లాస్ట్, జపాన్… 114వ ర్యాంకు… అంటే అక్కడ ఎవడి బతుకు వాడిదే… విపత్తు వచ్చినా ఆ సమాజంలో ఒకరికొకరు సాయం చేసుకునే వాతావరణమే లేదన్నమాట… దిగువన జపాన్‌తోపాటు బెల్జియం, దక్షిణ కొరియా, లెబనాన్, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇటలీ, మొరాకో, పాకిస్థాన్, లాటివా… కొరియా, ఫ్రాన్స్, జపాన్ పేరుకు పెద్ద దేశాలు, సంపన్నదేశాలు… ఐతేనేం..? అవసరమొస్తే ఆ సమాజాల్లో ఎవడికీ ఎవడు ఉపయోగపడడు… అదీ చేదు వాస్తవం..!! మనవాళ్లే చాలా చాలా బెటర్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions