.
Ashok Kumar Vemulapalli ……. ఇండిగో… రాజ్యం… వేగంగా మన విమానయానంలో మోనోపలీ వచ్చేస్తోంది…
ఇండియాలో ప్రస్తుతం బతికి ఉన్న ఎయిర్ లైన్ సర్వీసులు నాలుగు మాత్రమే .. ఇండిగో, ఎయిర్ ఇండియా , స్పైస్ జెట్ , ఆకాష్ ఎయిర్ లైన్స్ .. ఇందులో స్పైస్ జెట్ పరిస్థితి ఐసీయూలో ఉంది .. ఇక ఇండియన్ ఎయిర్ లైన్స్ .. టాటాల చేతికి వచ్చాక కూడా పెద్దగా ఏమీ మారలేదు .. ఆకాశ్ ఎయిర్ లైన్స్ కొన్ని రూట్లలో మాత్రమే నడుస్తోంది .. టాటా విస్తారా .. ఇటీవలే ఎయిర్ ఇండియాలో విలీనమై పోయింది ..
Ads
డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లో కేవలం ఈ నాలుగు సంస్థల ఎయిర్ లైన్స్ దే హవా .. ఇందులో కూడా ఇండిగోది ఏకఛత్రాధిపత్యం .. ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో మాత్రం విదేశాలకు సంబంధించిన విమాన సర్వీసులే ఎక్కువ ..
మీరు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినపుడు సరిగా గమనిస్తే ఫ్లైట్స్ డిస్ ప్లే బోర్డులో .. మొత్తం బ్లూకలర్ లో కనిపిస్తుంది .. అంటే దాదాపు సర్వీసులన్నీ ఇండిగోకు చెందినవే .. ఇదే పరిస్థితి కొనసాగితే .. భవిష్యత్తులో ఎయిర్ సర్వీసులో మోనోపోలి వచ్చేస్తుంది. తద్వారా వాళ్లు ఎంత రేటు చెబితే అంత మనం భరించాల్సిందే ..
అదే ఎయిర్ లైన్స్ సంస్థలు ఎక్కువగా ఉంటే కాంపిటీషన్ కారణంగా .. టికెట్ రేట్లు తక్కువలో దొరుకుతాయి.
ఇలా రేట్లు తగ్గాయి కాబట్టే గత పదేళ్ల కాలంలో మధ్యతరగతి ప్రజలు కూడా కొన్నిసార్లు , అత్యవసర పరిస్థితుల్లో , దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినపుడు విమాన సర్వీసుల్ని వినియోగించుకోగల్గుతున్నారు ..
కానీ భవిష్యత్తులో విమాన సర్వీస్ అనేది మళ్లీ కొన్నేళ్ల క్రితం మాదిరి .. మధ్యతరగతి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది .. అంటే ఉన్నత వర్గాలు మాత్రమే ఎయిర్ ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది ..
ఎందుకు ఎయిర్ లైన్స్ సంస్థలన్నీ మూతపడుతున్నాయంటే సవాలక్ష కారణాలున్నాయి .. అందులో ఎయిర్ పోర్టుల దోపిడీ మొట్టమొదటి కారణం ..
ఫ్లైట్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యేటపుడు .. దాని టైర్లు రన్ వే మీద టచ్ అయినపుడు పడే లోడ్- బరువుని బట్టి కూడా ఎయిర్ పోర్ట్ నిర్వహణా సంస్థ ఛార్జ్ వసూలు చేస్తుందట .. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినపుడు స్పైస్ జెట్ సిబ్బంది ఒకామె ఈ విషయం చెప్పింది ..
ఇక విమానం నిలిపి ఉంచినందుకు చెల్లించే హ్యాంగర్ చార్జెస్ , ప్రయాణికుల్ని విమానం దగ్గరకు తీసుకెళ్లే బస్సులకి , మన లగేజ్ తెచ్చే బెల్టులు.. ఇలా ప్రతి దానికి భారీగా చెల్లించాల్సిందే .. అందువల్ల విమాన సర్వీసులో వచ్చే ఆదాయం కంటే ఇలా ఎయిర్ పోర్టుకి చెల్లించే ఆదాయమే ఎక్కువట ..
చెన్నై వెళ్లేముందు శంషాబాద్ ఎయిర్ పోర్టులో .. బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసుకుందామని స్పైస్ జెట్ కియోస్కి దగ్గరకు వెళ్తే అక్కడ అవి పని చేయడం లేదు .. ఎందుకు పని చేయడం లేదని అడిగితే .. బడ్జెట్ ప్రాబ్లం సార్ .. అని స్పైస్ జెట్ సిబ్బంది చెబుతున్నారు ..
ఇండిగో అన్ని కౌంటర్ల దగ్గర యమా క్లాస్ గా , లగ్జరీగా కనిపిస్తుంటుంది .. కానీ స్పైస్ జెట్ దగ్గర చాలా డల్ గా కనిపిస్తుంది.. ఎందుకని అడిగితే బడ్జెట్ ప్రాబ్లమ్ సార్ అంటున్నారు .. స్పైస్ జెట్ లో కొన్నినెలల క్రితం వరకు అయితే కనీసం ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేదు .. ఆ మధ్య కొన్నేళ్ళు సన్ నెట్వర్క్ కూడా స్పైస్ జెట్ ని నడిపి భరించలేక వదిలించుకుంది.. మళ్లీ సంస్థ బాధ్యతలు మాజీ యజమాని అజయ్ సింగ్ చేపట్టారు ..
కాస్త భారత విమానయాన మంత్రిత్వ శాఖ దీనిమీద దృష్టి పెడితే బాగుంటుంది .. ఇప్పుడు దూర ప్రాణాల ప్రయాణాలకు ఎక్కువమంది ఫ్లైట్ సర్వీస్ మీదే ఆసక్తి చూపుతున్నారు .. రోజుల తరబడి ట్రైన్లు , బస్సుల్లో జర్నీ చేయలేక విమాన సర్వీసుల్ని ఆశ్రయిస్తున్నారు .. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ లైన్స్ సర్వీసులో మోనోపలి వస్తే . .. బాగా డబ్బున్నవాళ్లు తప్ప మిగిలిన జనం ఎయిర్ పోర్ట్ వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి రావొచ్చు ..
(మధ్యతరగతి వాళ్ళు ఫ్లయిట్లు ఎక్కుతారా ? సామాన్యులకి ఫ్లైట్లు ఎందుకు ? అసలు మనకి బస్సులు , రైళ్లు ఉండగా విమానాలు ఎందుకు ? విమానాలు కేవలం లగ్జరీ … విమానం కేవలం బాగా డబ్బున్నోళ్ళకే కదా.. అని వితండవాదం చేస్తే అది మీ ఖర్మ )
Share this Article