అంతా ఒక ప్లాన్ ప్రకారం నడిచిపోతుంటుంది… గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీ పాత్ర మీద సందర్భం లేకుండా BBC ఓ డాక్యుమెంటరీని రెండు పార్టులుగా ప్రసారం చేస్తుంది… వెంటనే ఓ పాకిస్థానీ రూట్స్ ఉన్న ముస్లిం ఎంపీ బ్రిటన్ పార్లమెంటులో ప్రస్తావించి, చర్చ స్టార్ట్ చేస్తాడు… బీబీసీ కథనాల ఆధారంగా ఇండియాలో మీడియా మరింత మసాలా వేసి కథనాలు రాసుకుంటుంది… మొత్తానికి ప్రధానిని బజారుకు ఈడ్వడం దాని ప్రథమ ఉద్దేశం… యాంటీ హిందూ సెక్షన్స్, యాంటీ మోడీ సెక్షన్స్ హఠాత్తుగా యాక్టివేట్ అయిపోయి, ఇండియన్ మీడియాలో మొత్తుకోళ్లు, శోకాలు స్టార్ట్ చేస్తారు…
ఈ దేశపు సుప్రీంకోర్టే క్లీన్‌చిట్ ఇచ్చిన కేసు కదా… అదే సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది తాజాగా… ఏమనీ అంటే..? బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడం అన్యాయం, ఆ డాక్యుమెంటరీలను పరీక్షించి, వెంటనే గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలి… ఇదీ ఆ పిల్ సారాంశం… అంటే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు తప్పు, బీబీసీ డాక్యుమెంటరీ ఆధారంగా రివ్యూ చేసుకుని, చర్యలు తీసుకోవాలని పరోక్షంగా సుప్రీంకోర్టు తీర్పును ఆక్షేపించడం ఇది… ఇండియా కదా, ఏదైనా చెల్లుతుంది ఇక్కడ…
‘‘కేంద్రం తీసుకున్న చర్య రాజ్యాంగపరమైన ప్రశ్నలకు తావిస్తోంది… గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వార్తలు చూడటం, వాస్తవాలు, రిపోర్టులను తెలుసుకునే హక్కు ఆర్టికల్ 19 (1) (2) కింద పౌరులకు ఉందా లేదా అనేది అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాలి… బీబీసీ డాక్యుమెంటరీని చట్టవిరుద్ధం, దుష్ప్రచారం, కుట్రపూరితం, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ 2023 జనవరి 21న కేంద్ర సమాచార, ప్రసార శాఖ జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేయాలి… ప్రాథమిక హక్కు అయిన పత్రికా స్వేచ్ఛకు కేంద్రం కళ్లెం వేయవచ్చా..?’’ అని పిల్ వేసిన న్యాయవాది వాదన…
Ads
అసలు బేస్‌లెస్ పిటిషన్లను సుప్రీం ఎందుకు అంగీకరించాలనేది ప్రథమ ప్రశ్న… తన గత తీర్పును ఆక్షేపిస్తున్నట్టుగా ఉన్న పిల్ ఇది… లోకస్ స్టాండి లేదు… పైగా పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కాదు… అది భావప్రకటన స్వేచ్ఛ ప్రకారం సంక్రమించే ఓ అనుబంధ, అంతర్లీన హక్కు… ఈ నేపథ్యంలో ఒక వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… బీబీసీ ఎప్పుడూ ఇండియాకు వ్యతిరేకమే… చాలాసార్లు అదే ప్రూవ్ చేసుకుంది… ఈరోజుకూ అది యాంటీ ఇండియా కుట్రల్లో భాగస్వామిగా ఉంటోంది… అయితే రెండేళ్లపాటు ఇందిరాగాంధీ బీబీసీ దేశం నుంచి బహిష్కరించింది... అంత ధైర్యం మోడీకి ఉండే సీన్ లేదు… అయితే ఇందిర నిర్ణయం కథ ఏమిటి..?
ఇది 1970 నాటి కథ… బీబీసీ అప్పటి కలకత్తాలోని దారిద్య్రపు కడగండ్లను చిత్రీకరించి ప్రసారం చేసింది… అది ఫ్రెంచ్ డైరెక్టర్ లూయిస్ మల్లె తీశాడు… కానీ బీబీసీ కథనాలపై ఇందిరాగాంధీ సంతృప్తిగా లేదు… కావాలని తన పాలనను, ఇండియాను విమర్శిస్తూ ఉన్నట్టు ఫీలయింది…
ఇదంతా ఓ దురుద్దేశంలో సాగిస్తున్న ప్రచారమని, వెంటనే ఈ కథనాల షెడ్యూల్ రద్దు చేసుకోవాలని బీబీసీని ఇండియా పభుత్వం అడిగింది… బ్రిటిష్ పౌరుల్లో ఇండియా పట్ల ఓ దురవగాహనకు దారితీస్తుందని వాదించింది… బ్రిటన్ ఫారిన్ ఆఫీసుకు కూడా కంప్లయింట్ చేసింది… ఓ రీసెర్చ్ పేపర్ ప్రకారం… 1970 ఆగస్టులో బీబీసీని నిషేధించింది ఇండియా ప్రభుత్వం…
1971 యుద్ధసమయంలో బీబీసీ మళ్లీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది… 1975లో కూడా 41 మంది కాంగ్రెస్ ఎంపీలు బీబీసీ ‘ఉద్దేశపూర్వకంగా ఇండియా వ్యతిరేక కథనాలకు పాల్పడుతోందని, ఈ నేల మీద, ఈ నేలకు సంబంధించిన ఏ కథనాన్ని కూడా బీబీసీ ప్రసారం చేయకుండా ఇండియా తన సార్వభౌమాధికారాన్ని వినియోగించాలనీ కోరారు…
ఇప్పుడు అదే బీబీసీ, అదే కాంగ్రెస్… ఇప్పుడు బీబీసీ భారత వ్యతిరేక కథనాలు కాంగ్రెస్‌కు సమ్మగా ఉన్నాయి… అదే కాలమహిమ..!! (ఈ కథనంలోని అంశాల్ని ‘ముచ్చట’ యథాతథంగా ఎండార్స్ చేయడం లేదు… ఇప్పుడు చర్చ బీబీసీ మీద సాగుతోంది కాబట్టి, దాన్ని ఈ దేశం కొన్నాళ్లు నిషేధించిందనే వార్తల నడుమ వాటిని తెలుగీకరించి, తెలుగు పాఠకులకు పరిచయం చేయడమే ఈ స్టోరీ ఉద్దేశం…)
Share this Article