Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతి పేద ఇంటికీ సర్కారీ భరోసా – రేవంత్ రెడ్డి గుర్తుండిపోతాడు

November 18, 2026 by M S R

.

మిగతా సంక్షేమ పథకాలన్నీ ఒకెత్తు- రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ బీమా పథకం మరో ఎత్తు..! నిజానికి ప్రతి పేద కుటుంబానికి ఓ భరోసా ఇది… దీనిపై కూడా ఏడ్చే ప్రతిపక్ష నేతలు ఉంటే ఉంటారు, కానీ తెలంగాణలోని ప్రతి కుటుంబమూ స్వాగతించాల్సిన ప్రజాపథకం ఇది… నిస్సందేహంగా…

వాస్తవంగా గత రాష్ట్ర అవతరణ దినం నుంచే ప్రారంభించి ఉండాల్సింది… కొద్దిగా ఆలస్యం… సిద్దిపేటలో 19న రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ఆరంభిస్తాడు, అంటే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది… ఎందుకు ఇది విశిష్ట పథకం అంటే..?

Ads

ఖజానాను కర్పూరం చేసే సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి… కానీ ప్రతి పేద కుటుంబాన్ని బీమా పరిధిలోకి తీసుకురావడం ఈ ఇందిరమ్మ బీమా పథకం విశిష్టత… నిజానికి ఈ ప్రభుత్వం దీనిపై సరిగ్గా పాజిటివ్ ప్రచారం చేసుకోవడం లేదేమో అనిపిస్తుంది…

గతంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబం వీథిన పడేది… అప్పుల భారం ప్లస్ భవిష్యత్తు భయాలు ఆ కుటుంబాలను కుంగదీసేవి… పరిహారాలకు కూడా కమీషన్లు, ప్రయాస, బ్రోకర్లు, అలవాటైన అవినీతి సరేసరి… కేసీయార్ రైతు బీమా ప్రవేశపెట్టాడు గానీ, కొంత నయమే గానీ… నిజంగా విపరీతమైన అనిశ్చితిలో బతికేది కౌలు రైతు ప్లస్ వ్యవసాయం చుట్టూ కేంద్రీకృతమయ్యే పల్లె వ‌ృత్తులు, ఇతర కుటుంబాలు…

వాళ్ల గురించి తన పదేళ్ల కాలంలో క్షణం కూడా ఆలోచించలేకపోయాడు కేసీయార్… ప్రత్యేకించి ఆత్మహత్యలు కౌలు రైతుల్లోనే అధికం… వాళ్లను గాలికి వదిలేశాడు… గుర్తించేదే లేదుపొమ్మన్నాడు… ఇప్పుడు ఇందిరమ్మ బీమా పథకంలోకి వ్యవసాయం చేసేవాడే కాదు, అనుబంధ వృత్తులు, ప్రతి పేద కుటుంబమూ వస్తుంది… అదీ ఈ పథకం విశిష్టత…

indiramma bima

ఇప్పుడు ఏదో ఓ బీమా పథకంలో ఉన్నవాళ్లందరినీ ఈ గొడుగు కిందకు తీసుకొస్తారు… కుటుంబంలో సంపాదించేవాడు మరణిస్తే 5 లక్షల బీమా పరిహారం అందుతుంది… అదొక భరోసా… భవిష్యత్తుకు కాస్త ధీమా… ఎస్, దీన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తే రేవంత్ రెడ్డి చిరకాలం తెలంగాణ ప్రజలకు గుర్తుండిపోతాడు… చీరెలు, సన్నబియ్యం, పింఛన్లు, ఇళ్లు, విద్య, వైద్యం, ఇతర ఫ్రీ పథకాలకన్నా ఈ జీవిత బీమా పథకం విశిష్టమైంది అని చెప్పడానికి కారణం ఇదే…

ఎటొచ్చీ, అధికారగణం మొరాయిస్తూ ఉంటుంది… ఏదీ సరిగ్గా చేయరు… కొరడా పట్టుకుని మరీ పథకాన్ని విజయవంతం చేయించడానికి ప్రభుత్వం, పార్టీ రెండూ ప్రయత్నించాలి… పాత ప్రభుత్వాల తరహాలో ఎంతసేపూ ఉద్యోగులు, వ్యాపారులు, ధనికుల గురించే ఆలోచించకుండా… సగటు పేద, మధ్య తెలంగాణవాసికీ బతికే హక్కు, ఆ కుటుంబాలకు ప్రభుత్వాల నుంచి భరోసా ఆశించే హక్కు ఉందని గుర్తించి, ఆ దిశలో అడుగులు వేస్తున్న ఈ బీమా పథకానికి స్వాగతం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రతి పేద ఇంటికీ సర్కారీ భరోసా – రేవంత్ రెడ్డి గుర్తుండిపోతాడు
  • ఎవరి కోసం… ఈ హఠాత్ వరుస టెక్ ఇక్కట్లు !!
  • ‘‘సాక్షి బురద రాతలు- రోత రాతలు- నీచపు రాతలు- తప్పుడు కూతలు’’
  • మరో బాబా బయోపిక్ రుద్రయోగి! కానీ నిజచరిత్ర తెలియని మర్మయోగి!!
  • తెలుగు సీఎస్‌లు ఏం చేయగలరు పాపం..? శబరిమలలో బట్టల పంచాయితీ!
  • సాయి పల్లవిని టార్గెట్ చేసేందుకే ‘మాండవి’ని పైకి లేపారు !!
  • 007 కథ ముగిసిపోలేదు – అదుగో కొత్త జేమ్స్ బాండ్ వస్తున్నాడు…
  • మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక భేటీలు!- సుప్రియా సూలేకు పగ్గాలు?
  • రామోజీ స్మరణ సరే… కానీ ఎవరి జయంతి రాష్ట్ర ఉత్సవం కావాలి..? కొలమానాలేమిటి..?
  • బన్నీ రికార్డు బద్దలు… ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ సంచలనం!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions