Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ… నేటికీ జ్వలించే పాటే అది…

October 11, 2024 by M S R

.

ఏడు రంగుల ఇంద్రధనసు ఈడు వచ్చిన నా సొగసు , నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి . ఇంద్రధనస్సు సినిమా అనగానే ఈ రెండు పాటలే ముందుగా గుర్తుకొచ్చేవి . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఆత్రేయ వ్రాసిన పాటలు అద్భుతంగా పండాయి . మిగిలిన పాటలు ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా , తడిసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే , మూసుకో మూసుకో తలుపులన్నీ మూసుకో , ప్రేమకు మరణం లేదు కూడా బాగుంటాయి .

కె బాపయ్య దర్శకత్వంలో 1978 లో వచ్చిన ఈ ఇంద్రధనస్సు సినిమా ఎబౌ ఏవరేజిగా ఆడినట్లు గుర్తు . మహిళలకు బాగానే నచ్చింది . మొత్తం మీద వంద రోజులు ఆడింది . ఆ రోజుల్లో వచ్చిన అప్పలాచార్య ప్రత్యేక హాస్యరచనలు చాలా వరకు అపహాస్యమే అయ్యాయి . అయితే ఈ సినిమాలో మెయిన్ కధలో కలిపాడు . అది కాస్త సంతోషం . చాలా వాటిల్లో కామెడీ ట్రాక్ మెయిన్ ట్రాక్కుకు సంబంధం లేకుండా నేసేవారు . ఈ సినిమాలో కామెడీ ట్రాకులో జయమాలినికి కాసేపు నటించేందుకు అవకాశం ఇచ్చారు .

Ads

సాధారణంగా ఏ సినిమాలో అయినా లేడీ ఆర్టిస్టులను అందంగా చూపించేందుకు మేకప్ టీం , దర్శకుడు ప్రయత్నిస్తారు . మరి ఈ సినిమాలో ఆ మేకప్ టీం ఎవరో కాని శారదను , కాంచనను , జయమాలినిలను అందంగా చూపలేకపోయారు . కృష్ణ చాలా అందంగా కనిపిస్తారు . నటన కూడా బాగుంటుంది .

ఈ సినిమా ప్రత్యేకత పోలో . బహుశా తెలుగు సినిమాలలో పోలోని చూపిన మొదటి సినిమా ఇదే అనుకుంటాను . సినిమాను కూడా రిచ్ గా తీసారు . ఔట్ డోర్ షూటింగ్ అంతా ఊటీ అనుకుంటా . లొకేషన్స్ అన్నీ అందంగా కనిపిస్తాయి .

చాలా మంది నటీనటులు నటించారు . ఇద్దరు శారదలు ఉంటారు . ఒకరి తర్వాత మరొకరు వస్తారు . కృష్ణ , గిరిబాబు , గుమ్మడి , శరత్ బాబు , ప్రసాద్ బాబు , సారధి , నగేష్ , పద్మనాభం , పి జె శర్మ , ప్రభాకరరెడ్డి , కాకరాల , శ్రీధర్ , కాంచన , పుష్పకుమారి , జయమాలిని , ఫణి , బేబి వరలక్ష్మి నటించారు .

నాకీ సినిమా నచ్చింది . రెండు సార్లు చూసా . టివిలో వచ్చినట్లు గుర్తు లేదు . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . కృష్ణ , శారద అభిమానులు అయితే , ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘డిజిటల్ అరెస్టు… 32 కోట్ల భారీ దోపిడీ..! నాగార్జున కుటుంబం ఓ లెక్కా..!?
  • నిర్మాతలు, హీరోల దోపిడీతో పోలిస్తే… ఐబొమ్మ నేర తీవ్రత ఎంత..?!
  • ఎన్నికల సంఘంపై కాషాయ ముద్ర అర్థరహితం… లెక్కలు చెబుతున్నదిదే…
  • మంత్రి పదవికి 2009లో రేవంత్ రెడ్డి పైరవీ..! అదీ రామోజీరావు ద్వారా..!!
  • వారణాసి ఈవెంట్‌లో అది రాజమౌళి గ్లిచ్… నింద వేసింది హనుమంతుడిపై..!!
  • అదే వన్ ప్లస్ టూ..! అదే త్యాగం..! అప్పట్లో ఇదే సగటు ఫార్ములా…!!
  • ఏమంటవ్ గంభీర్..? మనం పన్నిన ‘పిచ్చు’పై మనమే బోల్తా అన్నమాట..!!
  • అగ్నితుఫాన్లన్నీ చల్లగా, చప్పగా ‘ఇల్లు’ వదిలి నిష్క్రమించాయి..!!
  • మరో పొలిటికల్ బిడ్డ కుటుంబానికి దూరం… ఎవరు ఈ బీహారీ కవిత..?!
  • జై వారణాసి శ్రీరామ్..! ఉన్నారో లేదో తెలియని దేవుళ్లూ దిగిరావల్సిందే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions