Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీ ఇంట్ల పీనుగెల్ల…! ఇవేం డిబేట్లు, వీళ్లేం ప్యానలిస్టులు… చంపేస్తున్నారు కదరా…!!

June 11, 2021 by M S R

కరోనా… లక్షల మంది ప్రాణాల్ని బలిగొంటూ… ప్రపంచాన్ని వణికిస్తూ… కోట్ల మందిని హాస్పిటళ్లపాలు చేస్తున్నది కరోనా వైరస్… అలియాస్ చైనా వైరస్…. ఎవడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది నిజం… వుహాన్ ల్యాబులో పరిశోధనలకు అమెరికా వాడూ సాయం చేశాడు అనేది మరో థియరీ… మొత్తానికి ప్రపంచాధిపత్యం కోసం అగ్రదేశాలు మానవాళి మనుగడతోనే ఆటలాడుతున్నాయి అనేది నిజం… చైనాను కల్ట్ రీతిలో ప్రేమించే ఎడ్డి మేధావులు అంగీకరించకపోవచ్చుగాక… నిజం నిజమే… చైనావాడు ఇంకా చాలా చేస్తాడు, వాడి చరిత్రే అది… అమెరికా, చైనా దొందూ దొందే… అవసరమైతే రెండూ కలిసి నూడుల్స్‌లాగా జుర్రుకుని తినే బ్యాచులు… మధ్యలో బకరాలు అయ్యేది మిగతా దేశాలు… పుతిన్ గాడి అసమర్థత పుణ్యం… అయితే..?

వైరసులు కొత్త కాదు ప్రపంచానికి, అవి మ్యుటేట్ అవుతూనే ఉంటయ్… కొత్త కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటయ్… కొన్ని ప్రమాదకరం, కొన్ని ప్రాణాంతకం… సార్స్, స్పానిష్ ఫ్లూ వంటి లక్షలాది మందిని బలిగొన్న వైరస్ రకాల నుంచే ఈ భూగోళం బతికి బట్టకట్టింది, ఈ కరోనా ఎంత..? కాకపోతే ఇప్పుడు సమాచార విస్తృతి ఎక్కువ కాబట్టి, మన తెలుగు టీవీ న్యూస్ చానెళ్ల పైత్యం ఎక్కువ కాబట్టి సమస్యను మనం భూతద్దంలో చూస్తున్నాం…సారు వారు ఎవరో గానీ… అచ్చం అరచేతిలో వెంట్రుకలు మొలిపించిన టీవీ5 వాడి మందులాగే… పేరు చెరుకూరి అట… థర్డ్ వేవ్‌లో ఇంటికి ఒక పీనుగు లేవడం ఖాయం అంటున్నాడు… (డబుల్ మ్యూటెంట్ అంటే అదేదో డబుల్ సత్తా సంపాదించింది అన్నట్టు చెబుతున్నాడు…)

corona

అసలు ఈ టీవీ డిబేట్లే తెలుగు జాతికే ఇష్యూ… ఒక్కటంటే ఒక్క డిబేటూ ఓ రీతిలో ఉండదు, నికృష్టమైన డిబేట్లు… ఓ డిబేట్‌లో పరుచూరి అనే ఓ కెమికల్ ఇంజనీర్… (కోవిడ్ చికిత్సలు కూడా చేస్తున్నాడట, ఎలాగో తెలియదు…)… ఇంటింటికీ ఓ పీనుగు లేవడం ఖాయం థర్డ్ వేవ్‌లో అంటున్నాడు… ఒరేయ్, ఈ వేక్సిన్లు కాదురా, ఊరికో ఆక్సిజన్ ప్లాంటు పెట్టుకొండిరా అంటున్నాడు… టీవీ వాడి విజ్ఞత తగలెయ్య… ఆ వీడియో చూశాక తెలుగు సోషల్ మీడియాలో బోలెడు మంది డాక్టర్లు, నిపుణులు ఆ పరుచూరిని కౌంటర్ చేస్తూ బోలెడు వీడియోలు పెడుతున్నారు, తిట్టిపోస్తున్నారు… అవన్నీ పట్టించుకునే స్థితిలో ఉంటే దాన్ని తెలుగు టీవీ అనరు… అవి కరోనాను మించిన ఉపద్రవాలు…

వైరస్ నిజం… దాని ప్రమాద తీవ్రత నిజం… కానీ ఏ వైరస్ వ్యాప్తికైనా మందు, విరుగుడు వేక్సిన్లే… రోగనిరోధక శక్తి ముఖ్యం… వైరసుకు మందు లేదు కాబట్టి… భారత్ భయోటెక్ వంటి నికృష్ట ప్రైవేటు కార్పొరేటు కంపెనీలు, హాస్పిటళ్లు, డ్రగ్ ఫ్యాక్టరీలు గట్రా వందలు, వేలు, లక్షల కోట్లను దండుకోవడానికి ఈ కరోనా waves ఉపయుక్తం… శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచులు ఇవన్నీ… దీనికితోడు తన దరిద్రమైన పాలసీలతో సహకరించే మోడీ సర్కారు… (నిజం బ్లాక్ ఫంగస్‌ లాగా నిష్ఠురంగానే ఉంటుంది…) నిజానికి ప్రజల్ని బెంబేలెత్తించే అబద్ధాల్ని ప్రచారం చేస్తే పాండెమిక్ యాక్ట్ ప్రకారం సదరు డిబేట్ ప్రజెంటర్, టీవీ చానెల్ ఓనర్, ఎడిటర్, గెస్టులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు… అబ్బే, తెలంగాణ ప్రభుత్వానికి అంత ఘనం తెలిసి ఉంటే బాగానే ఉండేది… అసలు వీళ్ల లెక్కలే పెద్ద మోసం కదా…

ఒకడు పిల్లలే టార్గెట్ అంటాడు, వేలమంది చస్తారు అంటాడు, ఒకడు ఇంటికి ఓ పీనుగు గ్యారంటీ అంటాడు… రకరకాల వేరియంట్లన్నీ కలిసి బలం పుంజుకున్నాయీ అంటాడు… ఊరికో ఆక్సిజన్ ప్లాంటు పెట్టాలీ అంటాడు… వేక్సిన్లు దేనికిరా అని గద్దిస్తాడు… తీరా చూస్తే తను ఓ కెమికల్ ఇంజనీర్… పైగా కరోనా చికిత్సలు కూడా చేస్తున్నాడట… నిన్నాఈరోజు తనకు డాక్టర్లు, ఇతర మేధావులు కౌంటర్లు ఇస్తూ రెచ్చిపోతున్నారు… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే చర్చ… ఒక అతి తెలివి చానెల్ డిబేట్, ఒక అత్యంత తెలివైన ప్యానెలిస్టు… కోట్ల మందిలో భయం భయం… ఈ భయంతోనే బోలెడు మంది చనిపోయేట్టు ఉన్నారు… అసలు ప్రభుత్వంలో ఉన్నవాడికి ఏమైనా తెలిస్తే కదా ఇలాంటోళ్లను కంట్రోల్ చేయడానికి..! కార్పొరేట్ హాస్పిటళ్ల కోట్లకుకోట్ల దోపిడీకన్నా ఇది ప్రమాదకరమైన పోకడ… అరికట్టేవాడు లేడు… అంత ఆలోచన ఉన్నవాడు లేడు… అదీ అసలు దరిద్రం..!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మందుపాట ఘంటసాల పాడితేనే కిక్కు… వైరాగ్యపు మత్తు…
  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions