Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మొద్దుబారిన ఖాకీలు..! తమిళ ఐపీఎస్‌లపై నెటిజనం భగ్గు…!

May 25, 2026 by M S R

.

పక్కా అమానవీయత… ఏమాత్రం సున్నితత్వం లేని వ్యవహార ధోరణి… అత్యంత దళసరిగా చర్మం… ఇలా ఎన్నిరకాలుగానైనా చెప్పుకోవచ్చు… విషయం ఏమిటంటే..? తమిళనాడు, కోయంబత్తూరులో ఓ పదేళ్ల అమ్మాయి హత్యాచారానికి గురైంది… మామూలుగా ఇలాంటి వార్తలు చదువుతుంటే, చూస్తుంటేనే బాధ కలుగుతుంది కదా సగటు మనిషికి…

కానీ ఆ కేసు ఛేదించాల్సిన పోలీసు అధికారులు ఓ ప్రెస్ మీట్ పెట్టారు… ముగ్గురు పోలీసు అధికారులు మీడియా కెమెరాల ముందే జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు… ప్రత్యేకించి ఐజీ రమ్య భారతి గోళ్లు గిల్లుకుంటూ, పకపకా నవ్వుతూ కనిపించడం నెటిజనానికి చిర్రెక్కించింది… న్యాయం జరగడమే కాదు, న్యాయం జరుగుతున్నట్టు కూడా కనిపించాలి కదా… ఇది దానికి పూర్తి భిన్నమైన ధోరణి…

Ads

24 గంటల్లోనే కేసు ఛేదించామని, ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పడానికి ఈ ప్రెస్‌మీట్ పెట్టారు… అప్పటికి ప్రెస్ బ్రీఫింగ్ స్టార్ట్ కాలేదు, ఈ ముగ్గురూ కెమెరాల ముందే పగలబడి నవ్వడం మొదలెట్టారు ఏవో జోకులు వేసుకుంటూ..! నేరాలు చూసీ చూసీ, దర్యాప్తులు చేసీ చేసీ చర్మం, మనసు, తత్వం అన్నీ మొద్దుబారిపోయి ఉంటాయేమో… మనుషులుగా మరణించి, ఖాకీ యంత్రాలుగా, ఏ సున్నితత్వమూ లేని రాళ్లుగా మారిపోయారేమో అనే విమర్శలు జోరుగా వచ్చాయి…

సమాజం అన్నాక హత్యలుండవా, అత్యాచారాలుండవా, ఇవన్నీ కామన్ అన్నట్టుగా వ్యవహరించారు ఆ పోలీసు అధికారులు, అదీ మీడియా కెమెరాల ముందు..! అంతకుముందు మంత్రి కీర్తన స్పందన కూడా సరిగ్గా లేదు… కొత్త ఎమ్మెల్యే, కొత్త మంత్రి, తన డిజిటల్ వ్యూహాలతో విజయ్‌ను సీఎంను చేశానని చెప్పుకునే ఆమెకు కూడా జనానికి ఎలా కనిపించాలనే సోయి లేకపోవడం విస్మయకరమే… ఇక ఖాకీ రమ్య భారతి సరేసరి…

నిజానికి సీఎం విజయ్ ఈ అమ్మాయి హత్యాచారం దుర్ఘటనపై వెంటనే స్పందించి, వేగంగా దర్యాప్తు జరగాలని, నేరగాళ్లను పట్టుకోవాలని ఆదేశించాడు… ఆ ఏరియా ఎమ్మెల్యే బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లి పరామర్శించాడు… ఆ తరువాత పోలీసుల్లో కాస్త చలనం వచ్చింది…

*నువ్వు కూడా ఒక మహిళవే కదా… నీక్కూడా పెళ్లయి ఉంటుంది కదా… నీకూ పిల్లలు ఉండి ఉంటారు కదా… ఒకవేళ జరిగిన ఘటనలో చనిపోయింది నీ కూతురైతే నువ్వు ఇలానే వ్యవహరిస్తావా’’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి…

ఈ విమర్శలు కూడా విజయ్ దృష్టికి వెళ్లాయనీ, తను వెంటనే ఆ పోలీసు అధికారులను సస్పెండ్ చేశాడని సోషల్ మీడియాలో అక్కడక్కడా కనిపిస్తోంది… ఇలాంటి సున్నితమైన కేసులకు సంబంధించి దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడనీ అంటున్నారు…. కానీ ఇది మాత్రం ధ్రువీకరణ లేదు… అలాంటి ట్వీట్లు గానీ, సీఎం రియాక్షన్ గానీ ఏమీ కనిపించలేదు…


 


https://www.indiatoday.in/india/tamil-nadu/story/coimbatore-child-murder-bjp-slams-tamil-nadu-minister-s-keerthana-response-2916667-2026-05-25


 


https://timesofindia.indiatimes.com/city/chennai/coimbatore-girl-rape-murder-cop-caught-grinning-during-media-briefing-video-sparks-fury-online/articleshow/131304797.cms


 




View this post on Instagram

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions