………. By…. Jagannadh Goud………….. సాధారణ మహిళ అసాధారణ మహిళగా ఎదగటం వెనక ఉన్న ఒకే ఒక కారణం ” తనకి నచ్చిన పని మరియూ తనకి సంతోషానిచ్చే పని తాను చేయటం”… హ్యారీ పొట్టర్ పుస్తకాలు, హ్యారీ పొట్టర్ సినెమాలు, ఆ హ్యారీ పొట్టర్ పుస్తక రచయిత J K రౌలింగ్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే ఆమె బయోగ్రఫీ మీద వచ్చిన సినెమా “Magic beyond words” నిన్న చూశాకే ఆమె గురించి నాకు పూర్తిగా తెలిసింది. ఇంగ్లాండ్ లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జే కే రౌలింగ్ కి చిన్నప్పట్నుంచి పుస్తకాల మీద ఆసక్తి. తాను చిన్నగా ఉన్నప్పుడు తన తల్లి పుస్తకాలు చదివి వినిపించేది. తనకంటే 2 సంవత్సరాలు చిన్న అయిన తన చెల్లికి మాత్రం జే కే రౌలింగ్ ఏవేవో చిన్న చిన్న చిన్న కథలు రాసి, చదివి వినిపించేది.
వేరే సబ్జెక్ట్స్ తనకి పెద్దగా అబ్బేవి కావు. నేను కానీ నా ప్రవర్తన కానీ ఏమైనా వింతగా ఉందా అమ్మా అని అడిగితే వాళ్ళ అమ్మ.. “ఒకొకరు ఒకోలా ఉంటారు, నీకు నచ్చిన పని చెయ్యి, అందరిలా మ్యాథ్స్, సైన్స్ మాత్రమే చదవాల్సిన అవసరం లేదు. నీకు ఏది కరక్ట్ అనిపిస్తే , నీకు ఏది చదివితే సంతోషం అనిపిస్తే అది చదువు” అని చెప్పింది. తల్లి చిన్నప్పట్నుంచి ఏమి చేసినా ఇచ్చిన ప్రోత్సాహం మాత్రం చాలా గ్రేట్. ఫ్రెంచ్ లిటరేచర్ లో డిగ్రీ చేసాక జే కే రౌలింగ్ 8 వరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది కానీ ప్రతి చోటా ఆమెని తీసివేయటమో లేదా ఆమే మానేయటమో జరిగింది.
Ads
తనకి 25 సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లి ఒక వ్యాధితో చనిపోయింది. ఆమె తండ్రి వెంటనే ఇంకో పెండ్లి చేసుకోవటంతో ఇంగ్లాండ్ లో ఉండటం ఇష్టం లేక పోర్చుగల్ వెళ్ళి, స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పే ప్రాధమిక స్కూల్ టీచర్ గా జాయిన్ అవ్వటం జరుగుతుంది. అక్కడ పరిచయం అయిన ఒక వ్యక్తిని పెండ్లి చేసుకోవటం, ఆ తర్వాత ఒక పాపకి జన్మనివ్వటం.. ఉద్యోగం పోయిన భర్త తాగి అబ్యూస్ చేయటంతో పెండ్లి అయిన 13 నెలల ఒక్క రోజుకే విడాకులు తీసుకోవటం జరుగుతుంది.
పోర్చుగల్ నుంచి స్కాట్లాండ్ తిరిగి వచ్చిన జే కే రౌలింగ్ కి ఉద్యోగం లేదు, చేతిలో డబ్బులు లేవు, జీవితం మీద ఆశ లేదు. కానీ చేతిలో సంవత్సరం కూడా నిండని ఆడపిల్ల ఉంది. దిక్కు లేని స్థితిలో ప్రభుత్వ పథకానికి అప్లికేషన్ పెట్టుకుంది. వారానికి 69 యూరోలు, కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించి స్కూలు పిల్లలకి ఇంగ్లీష్ చెప్పే టీచర్ గా జాయిన్ అవుతుంది స్కాట్లాండ్ లో… పెండ్లి కాకముందు నుంచే ఒక కథ అనుకొని రాయటం ప్రారంభించింది. ఖాళీ దొరికిన సమయంలో తనకిష్టమైన రైటింగ్ ని మాత్రం వదలలేదు. హ్యారీ పొట్టర్ పుస్తకం రాయటం అయ్యాక కొన్ని పబ్లికేషన్స్ కి పంపితే చిన్న పిల్లల కథల్లా ఉంది, ఒక 100 పుస్తకాలు అమ్ముడుపోవటమే గగనం, ఎవరూ కొనరు అని 12 మంది పబ్లికేషన్స్ సంస్థలు రిజెక్ట్ చేస్తాయి. చివరికి ఒక పబ్లికేషన్ సంస్థ తాను రాసిన పుస్తకానికి 1275 యూరోలు ఇస్తారు (ప్రస్తుతం మన డబ్బుల్లో లక్షా 8 వేల 300 రూపాయలు మాత్రమే). అయితే ఎక్కువ పుస్తకాలు కనుక అమ్ముడుపోతే రాయల్టీ ఇవ్వటం ఆ ప్రచురణ సంస్థ స్టాండర్డ్ ఒప్పందాల్లో ఒకటి.
మొదటి హ్యారీ పొట్టర్ పుస్తకం విడుదల అయ్యాక జరిగింది అందరికీ తెలిసిందే, 7 పుస్తకాల హ్యారీ పొట్టర్ పుస్తకాల సీరీస్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయాయి. పుస్తకాలు రాసి బిలియనీర్ అయిన మొదటి రచయిత కూడా జే కే రౌలింగ్ నే… ఇంకో 1000 సంవత్సరాల తర్వాత కూడా జే కే రౌలింగ్ రాచిన హ్యారీ పొట్టర్ పుస్తకాల గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం బ్రిటన్ లో అత్యంత సంపన్నుల్లో J K రౌలింగ్ ఒకరు. అత్యంత సాధారణ మహిళ అసాధారణ మహిళగా ఏదగటానికి కారణం ఒక్కటే “తనకి నచ్చిన పని మరియూ తనకి సంతోషానిచ్చే పని తాను చేయటం”. ఆమె జీవితంలో నాకు బాగా నచ్చిన ఇంకో అంశం, జే కే రౌలింగ్ తల్లి ఇచ్చిన ప్రోత్సాహం; అమ్మా, నాకు ఈ ఉద్యోగం నచ్చలేదు అంటే నచ్చని పని ఏ మాత్రం చేయనవసరం లేదు, ఇంటికి వచ్చెయ్. నీ మనస్సుకు ఏది నచ్చితే అది చెయ్యి, నీకు ఏది సంతోషం అనిపిస్తే అది చెయ్యి అని సపోర్ట్ చేయటం. ఇంకా జే కే రౌలింగ్ చెల్లెలు ఇచ్చిన ప్రోత్సాహం, పోర్చుగల్ లో రూంమేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం. హార్వర్డ్ యూనివర్శిటీలో ఆమె మాట్లాడుతుంటే, జీవితంలో సక్సెస్ ని గురించి మాట్లాడుతుంటే ఆనందం అనిపిస్తది, కానీ మన అపజయాలు, ఫెయిల్యూర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి అని ఆమె చెప్తుంటే నిజంగా సంతోషం అనిపించింది. ఈ భూమి మీద పుస్తకాలు రాసి బిలియనీర్ ఒకే ఒక వ్యక్తి జే కే రౌలింగ్. ఆమె పుస్తకాల కంటే ఆమె జీవితం ఉన్నతమైనది. బతకటానికి కష్టం అయ్యి వారానికి 70 యూరోల ప్రభుత్వ సహాయం పొందిన ఒక మహిళ తర్వాత బిలియనీర్ అయ్యిన క్రమం మాత్రం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం…
Share this Article