Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?

July 10, 2026 by M S R

.

అబ్బే, మీరు డబ్బులు కట్టి నా ఇన్‌స్టా ఖాతాను సబ్‌స్క్రయిబ్ చేసుకున్నా సరే, బోల్డ్ కంటెంటు ఉండదు, జస్ట్, నా పర్సనల్, పాత ముచ్చట్లు ఉంటాయి, అంతే అంటోంది ఆర్ఎక్స్100 వంటి బోల్డ్ కేరక్టర్లు చేసిన పాయల్ రాజ్‌పుత్…

ఇప్పుడు ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ కొత్త ట్రెండ్ కదా, మనీ మంత్రం… ఒకటి కాకపోతే మరొకటి… సినిమా చాన్సులే రావాలనీ, టీవీ- వెబ్ సీరీస్‌లే రావాలనీ ఏమీ లేదు… మొన్నమొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్‌తో దండుకున్న సెలబ్రిటీలు ఇప్పుడు ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ల మార్గం పట్టారు… పాయల్ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించడం, ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది…

Ads

కొంతకాలంగా టాలీవుడ్‌లో విష్ణుప్రియ, అషురెడ్డి, డింపుల్ హయతి, నేహా శెట్టి వంటి వారు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లను యాక్టివేట్ చేశారు… తాజా పరిణామం పాయల్ రాజ్‌పుత్… అయితే, సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించిన ప్రతిసారీ ఒక ఆసక్తికరమైన ‘క్లారిటీ’ కూడా వినిపిస్తోంది…

పాయల్ రాజ్‌పుత్‌తో పాటు, ఈ జాబితాలో ముందున్న అనన్య నాగళ్ల సైతం తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చింది… “నేను కేవలం ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత కంటెంట్ కోసమే ఈ ఫీచర్‌ను వాడుతున్నాను తప్ప, మీరు ఆశించే బోల్డ్ కంటెంట్ కోసం కాదు” అంటోంది… ఆ కంటెంట్ కోసం జనం డబ్బు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారా అనేది పే-ద్ద ప్రశ్న… దీనికి జవాబు కూడా అందరికీ తెలుసు… అసలే బాడీ కౌంట్ వెల్లడి చేసుకునే రోజులు ఇవి…

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే లోపలేస్తాం అని పోలీసులు స్ట్రిక్టుగా చెప్పేసరికి, కొందరిపై నిజంగానే కేసులు పెట్టేసరికి (సరే, ఆ కేసులు ఎటూ తేలవు, అవి అందరికీ తెలుసు, కానీ లీగల్ చిక్కులు, ఖర్చులు, చికాకులు, తలనొప్పి అని అందరూ మానేశారు…)

మధ్యవర్తులు, కమీషన్లు లేకుండా నేరుగా ఫ్యాన్ బేస్‌తో కనెక్ట్ అవ్వడం, వారి నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు ద్వారా రెగ్యులర్ ఆదాయం పొందడం సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు ఇప్పుడు… కాకపోతే కాస్త మసాలా ఫోటోలు, వీడియోలు, కంటెంటు తప్పదు… లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు కొనసాగవు… ఆశించిన సరుకు ఉంటేనే అమ్మకాలు!

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు… బాలీవుడ్ స్టార్స్, మలయాళం, కన్నడ సినీ తారలు కూడా ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాడుతున్నారు… అయితే, హాలీవుడ్ లేదా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్లతో పోలిస్తే, మన భారతీయ సెలబ్రిటీల సబ్‌స్క్రిప్షన్లు కేవలం ‘పర్సనల్ టచ్’ లేదా ‘ఫ్యాన్ ఇంటరాక్షన్’కే పరిమితమవుతున్నాయి…

సాధారణంగా సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండి, ఫ్యాన్ వార్‌లను ఎక్కువగా ఎదుర్కొనే వారికే సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది… అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన సంఖ్యలను ఇన్‌స్టాగ్రామ్ పబ్లిక్ చేయదు కాబట్టి, ఇది వారి ప్రైవేట్ ఆదాయంగానే మిగిలిపోతోంది…

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను చూడాలనే కుతూహలం ఫ్యాన్స్‌కు ఉండటం సహజం. అయితే, ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్ అనేది కేవలం అభిమానులను మరింత దగ్గర చేసే సాధనమా, లేక కనుమరుగవుతున్న అవకాశాలకు ప్రత్యామ్నాయంగా వెతుక్కున్న సులభ, సుస్థిర ఆర్థిక మార్గమా అనేది కాలమే నిర్ణయించాలి…



చాలామందిలో ఓ సందేహం… ఫాలోయర్ల సంఖ్యకూ, సబ్‌స్క్రిప్షన్ల సంఖ్యకూ లంకె ఉందా అని! లేదు… అత్యధిక ఫాలోయర్లున్న సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోషన్, యాడ్స్ ద్వారా విపరీతంగా సంపాదిస్తారు… 276 మలియన్ల ఫాలోయర్లతో విరాట్ కోహ్లీ టాప్… తన దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు… రాజకీయాలు, క్రికెట్, ఫ్యాషన్, సినిమాలు… ఏ రంగం తీసుకున్నా సరే..!!



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!
  • కన్నడనాట హిట్టే- తెలుగు వెర్షన్ సో సో… కారణాలు అనేకం…
  • ఓ సైనికుడు- చావుబతుకుల్లో ఓ తండ్రి- ఒక టచింగ్ స్టోరీ
  • ఒకే ఒక చిన్న ఇన్‌స్టా పోస్ట్… ఓ దివాలా జీవితాన్నే మార్చేసింది…
  • “పాపా… ఒక్కసారి నాకు ఫోన్ చేయండి… ప్లీజ్…”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions