Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆర్ఆర్ఆర్ రాజమౌళికి అవమానం… ఆఫ్టరాల్ ఓ కంటితుడుపు అవార్డుతో సరి…

February 21, 2023 by M S R

ఐనా ఇదేమిటండీ విజయేంద్రప్రసాద్ గారూ… ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలా..? కొడుకు, ఇతరులంతా అక్కడ శాన్‌ఫ్రాన్సిస్‌కోలో తిష్ట వేసి… అనేకానేక అవార్డుల గురించి లాబీయింగు నడిపిస్తుంటే… మీరు ఇక్కడే ఉండి, కనీసం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డుల సంగతైనా చూడకపోతే ఎలా..? మీ రాజ్యసభ సభ్యత్వం ఇక దేనికి పనికొస్తున్నట్టు..?

ఆర్ఆర్ఆర్ సినిమా ఇక ప్రపంచ సినిమా చరిత్రలోనే రాదు అన్నంతగా… ఆ అద్భుత చిత్రరాజాన్ని ప్రపంచమంతా పలుపలురకాలుగా ప్రశంసిస్తుంటే… పది కేటగిరీల్లో అవార్డులు కొట్టాలని రాజమౌళి ఆశపడితే… ఆల్‌రెడీ కీరవాణికి గోల్డెన్ గ్లోబ్ దక్కి, ఇక ఆస్కార్ ఆస్కారం పెరిగిపోతే… ఇక్కడ ఈ చిన్నస్థాయి అవార్డులను నిజానికి క్లీన్ స్వీప్ చేయాలి… కానీ ఏం జరిగింది..? ఏదో కంటితుడుపుగా ఫిలిమ్ ఆఫ్ ది ఇయర్ అని ప్రకటించారు… అంతే… ఎంతటి అవమానం..?

అసలు ఈ ఫెస్టివల్ అవార్డుల జ్యూరీ సభ్యులను, ఆ ఫెస్టివల్ నిర్వాహకులను ఏం చేసినా పాపం లేదు… ఆర్ఆర్ఆర్ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని వాళ్లు ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించడానికే అనర్హులు… ఒకవైపు జేమ్స్ కామెరూన్ వంటి దిగ్దర్శకులే అసలు ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్ని జీవితంలో తీయగలమా అని ఏడుస్తుంటే… ఆఫ్టరాల్ ఒకటే పిచ్చి అవార్డు తప్ప, ఇంకేం దక్కింది ఇక్కడ..? జాతీయ అవార్డుల్లో నా లాబీయింగు ప్రభావం చూపిస్తానులే అంటారా..? అయితే వాకే…

అరె, కంగనా రనౌత్ ఏదో అంటుందని భయపడి ఏవేవో అవార్ఢులు ఎవరెవరికో ప్రకటించారేమో కదా… ఐనా ఊరుకుందా..? ఆలియాభట్, రణబీర్ కపూర్‌లకు అవార్డుల వస్తే ఏడుస్తూనే ఉందిగా… దీనికి కూడా నెపో మాఫియా ప్రభావం అని తిట్టేస్తూనే ఉందిగా… లెక్కేలేనంత తిక్కదనం… ఐనా ఆర్ఆర్ఆర్ మీద మస్తు లవ్వు కదా ఆమెకు, ఆ సినిమాకు మరో నాలుగు అవార్డులు ప్రకటించినా ఆమె సంతోషించి, మెచ్చుకునేదేమో…. ధాకడ్ సినిమాకు ఉత్తమ సినిమాగా, ఉత్తమ నటిగా కంగనాకు అవార్డులు ఇస్తే కూడా ఆనందపడేది…  ఒక్కసారి ఈ అవార్డుల మొత్తం జాబితా చూడండి…


Best Film: The Kashmir Files

Ads

Best Director: R Balki for Chup: Revenge of The Artist

Best Actor: Ranbir Kapoor for Brahmastra: Part 1

Best Actress: Alia Bhatt for Gangubai Kathiawadi

Most Promising Actor: Rishab Shetty for Kantara

Best Actor In A Supporting Role: Manish Paul for Jugjugg Jeeyo

Outstanding Contribution In The Film Industry: Rekha

Best Web Series: Rudra: The Edge of Darkness

Critics Best Actor: Varun Dhawan for Bhediya

Film of The Year: RRR

Television Series of The Year: Anupamaa

Most Versatile Actor Of The Year: Anupam Kher for The Kashmir Files

Best Actor In A Television Series: Zain Imam for Fanaa- Ishq Mein Marjawaan

Best Actress In A Television Series: Tejasswi Prakash for Naagin

Best Male Singer: Sachet Tandon for Maiyya Mainu

Best Female Singer: Neeti Mohan for Meri Jaan

Best Cinematographer: PS Vinod for Vikram Vedha

Outstanding Contribution In The Music Industry: Hariharan


అసలు మా ప్రకాష్ రాజ్‌కు చిర్రెత్తుకొస్తోంది… ఆ కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రం ఏమిటండీ… పైగా మోస్ట్ వైవిధ్య నటుడని అనుపమ్ ఖేర్‌కు ఒక అవార్డు… తనకు వీటో అధికారం లేదు గానీ లేకపోతే కశ్మీర్ ఫైల్స్ సినిమానే నిషేధించేవాడు… ఆ డైరెక్టర్, నిర్మాతలకు దేశబహిష్కరణ శిక్ష విధించేవాడు… హమ్మా… ఇదేం పక్షపాతమండీ…

కానీ ఏమాటకామాట… ఈ అవార్డుల ఫంక్షన్‌లో కాంతార దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు తీసుకున్నాక… ఈ అవార్డును దివంగతులు పునీత్ రాజకుమార్‌కు, దర్శకుడు ఎస్‌.కె.భగవాన్‌లకు అంకితం ఇచ్చిన తీరు భలే నచ్చేసింది… అవునూ, రేఖ ఎన్నేళ్లయింది తెర మీదకు రాక… ఫిలిమ్ ఇండస్ట్రీకి ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ అంటూ జీవితకాల పురస్కారం స్థాయిలో ఓ అవార్డు ఇచ్చారెందుకో మరి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions