మాజీ గవర్నర్ నరసింహన్ వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా కావచ్చుగాక….. ఒక విషయంలో మాత్రం తనను చూసినప్పుడల్లా ఓరకమైన చీదర..! ప్రతి గుడికీ వెళ్లడం, ప్రొటోకాల్ పేరిట మర్యాదలు, ప్రాధాన్యతలు, సామాన్య భక్తులకు అవస్థలు… గంటలకొద్దీ… ఒక్కొక్క భక్తుడూ క్యూలో నిలబడి బూతులు తిట్టుకున్నాడు… దేవుడి దర్శనంతో ఆయన ఏం పుణ్యం సంపాదించుకున్నాడో గానీ భక్తుల తిట్లు శాపనార్థాలతో అదనపు పాపాన్ని మూటగట్టుకున్నాడు… తన ఇంటికి దగ్గరలోని ఆంజనేయుడి గుడి దగ్గర నుంచి తిరుమల వరకూ అదే పైత్యం ప్రదర్శించాడు ఆయన… ఎప్పుడోఓసారి కాదు… పదే పదే… ఓసారి స్థానిక అర్చకులు చేసే పనిని కూడా తనే చేస్తూ, అదిలిస్తూ, బెదిరిస్తూ… మరోసారి తనకు సరైన వేదాశీర్వచనం దక్కలేదంటూ ఆగ్రహప్రకటన…. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? దేవుడి దగ్గర ఓవరాక్షన్ చేస్తూ, స్థానిక గుడి మర్యాదలు పాటించకపోతే నాయకుడు, అధికారి, సెలబ్రిటీ ఎవడైనా సరే… సగటుజనం ఈసడించుకుంటారు… వాళ్లకు ఏదైనా జరిగితే లోలోపల ‘తగిన శాస్తి జరిగిందిలే’ అని తిట్టుకుంటారు… ప్రత్యేకించి దేవుడి దగ్గర అణకువను, విధేయతను, భక్తిని ఎవరైతే చూపించరో…. తమ అట్టహాసాల్ని, అహాల్ని, ఆడంబరాల్ని, సుప్రిమసీని వదిలేయరో… వాళ్లు ఆ గుడి భక్తులకు శత్రువులు…
ఈ విషయంలో పూరీ జగన్నాథుడి గుడి స్ట్రిక్ట్… ఓ దశలో గుడి మర్యాదల్ని తలవంచుకుని ఆమోదించాల్సిన పరిస్థితి ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీలకు కూడా తప్పలేదు… ఆ గుడి మర్యాదల్ని ఉల్లంఘించడం అంటే అక్కడ దేవుడిని, ఆ దేవుడి భక్తుల్ని అవమానించడమే… మొన్నామధ్య త్రిష అనే ఓ వృద్ధ నటి శివాలంయలో చెప్పులు వేసుకుని షూటింగ్ చేసింది తమిళనాడులో… నన్ను ఎవడేం చేయగలడు అనేది త్రిష ధీమా… కేరళలో ఓ నిమిష జిబో అని ఓ టీవీ నటి కమ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉంది… తను దోస్త్ ఉన్ని… వీళ్లు పతనంతిట్ట జిల్లా, అరణ్మూల గుడికి వెళ్లారు… అక్కడ ఓ పడవ కనిపించగానే ఎక్కి ఫోటోలు దిగారు… ఇన్‌స్టాలో పెట్టుకున్నారు… తరువాత సోషల్ మీడియా వాళ్లపై విరుచుకుపడింది… ఎందుకు..? అవి కృష్ణపడవలు… సర్పాకృతిలో ఉంటాయి… పల్లియోదం అంటారు…
Ads
పంపానదిలో తెప్పోత్సవాలు, పోటీలకు మాత్రమే వాడతారు… 64 వరకూ పొడుగ్గా, సన్నగా ఉండి, పాములా కనిపిస్తుంటయ్… ఆడవాళ్లు వాటిల్లో కాలుమోపడానికి లేదు… మగవాళ్లు కూడా చెప్పులు లేకుండా కేవలం అంగవస్త్రంతో మాత్రమే ఎక్కాలి… అదీ అనుమతించినవాళ్లు మాత్రమే… పెద్ద ఎత్తున రచ్చ జరగడంతో Puthukulangara Palliyoda Seva Samithi కేసు పెట్టింది… పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… అయ్యో, నాకు ఈ పద్ధతులు తెలియవు అంటూ ఆమె లబోదిబోమంటోంది… ఒకచోటకు వెళ్లినప్పుడు, ఫోటోషూట్లకు ఎగబడినప్పుడు అక్కడి పద్ధతులు తెలుసుకోకపోతే ఎలా..? వాటికి ఓ చరిత్ర ఉంది… పనస చెట్ల కలపతో ప్రత్యేకంగా చేసిన పడవలు అవి…
ప్రస్తుతం మరో వివాదం… మోహన్‌లాల్ తెలుసు కదా… పాపులర్ వెటరన్ హీరో… సౌతిండియాలో స్టార్లు అంటే తమకుతామే డెమీ గాడ్స్ అనుకునే బలుపు కదా… తాము వస్తామంటే గుళ్లలోని దేవుళ్లు కూడా మెట్ల దగ్గర నిలబడి స్వాగతం పలకాలని కోరుకునేంత మూర్ఖత్వం నరనరాన వ్యాపించి ఉంటుంది… మరి వాళ్ల అభిమానగణం వాళ్లను అలా తయారు చేస్తుంది… మొన్నీమధ్య ఈ తెరదేవుడు గురువాయూర్ కృష్ణుడి గుడికి వెళ్లాడు… అది చాలా ఫేమస్… పైగా కొన్ని పద్ధతులు స్ట్రిక్టుగా పాటిస్తుంటారు.. (ఇంకా దీనిపై హక్కుల సంఘాలు, సుప్రీం కోర్టు కన్నుపడలేదు.., లేకపోతే శనిశింగాపూర్, శబరిమలలాగే వేళ్లు, కాళ్లు పెట్టి కంపుచేసేవాళ్లు కదా…) గర్భగుడిలోకి చొక్కా నిషిద్ధం, మోడరన్ డ్రెస్సులు అనుమతించరు, మహిళలైతే కొంగు కప్పుకోవాలి, గుడి ప్రాంగణం దాకా వాహనాల్ని అనుమతించరు… అప్పట్లో అంతటి ఆడనియంత జయలలిత కూడా నడుస్తూ వెళ్లింది గుడిలోకి… ఈ మోహన్‌లాల్ వాహనానికి మాత్రం గుడి అధికారులు గుడి ఎంట్రీ దాకా అనుమతించారు… స్పెషల్ ట్రీట్‌మెంట్…
అధికారులు, అర్చకుల్లో కొందరు డబ్బుకు దాసోహం కదా… దేవుడిని అలా అర్థంతరంగా వదిలేసి ఈ సెలబ్రిటీల భజన, సేవలో నిమగ్నం అవుతుంటారు… అసలు హిందూ గుళ్ల విషాదమే అది కదా, ఎండోమెంట్ అధికారులకు ఆకుపోక తేడా తెలియదు, వాళ్లు అర్చక విధానాల్ని మార్చేస్తుంటారు… అథారిటీ చెలాయిస్తుంటారు, పాపం, దేవుళ్లు కూడా కిక్కుమనరు… వాళ్లు కాకపోతే కోర్టులు… ఏ మంత్రాలు పఠించాలో, ఏ పూలు వాడాలో, పూజలు ఎలా చేయాలో కూడా మన జడ్జిలే నిర్దేశిస్తుంటారు… ఫలానాఫలానా వాడు దేవుడిని దర్శించాడు అంటూ పత్రికలు ఫోటోలు వేసి, తమ దరిద్రాన్ని రంగుల ఫోటోల్లో చాలుకుంటాయి, అది మరో దరిద్రం… కాదు, ఒక జాతి దౌర్భాగ్యం… మోహన్‌లాల్ ఆఫ్టరాల్ ఓ నటుడు… తనకు ఆ గుడిలో ఎందుకు రాచమర్యాదలు చేయాల్సి వచ్చింది..? (మన తిరుమల కాదు కదా ఆ గుడి… కేవలం సెలబ్రిటీల సేవలో తరించడానికి..!)… మోహన్‌లాల్ ఎపిసోడ్ మీద కేరళలో రచ్చ… మోహన్‌లాల్ అనేవాడికి కాస్త శరమో, మానమో ఉండాలి కదా, మాట్లాడలేదు… చివరకు అధికారులకే సిగ్గేసి, థూమాబతుకులుచెడ అనుకుని తామే తిట్టేసుకుని, ఆ వాహనాన్ని అనుమతించిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు… (పర్లేదు, మూడు రోజుల్లో మళ్లీ అక్కడే చేరతారు, ఇంకెవడో దరిద్రుడు వస్తే ఇలాగే అనుమతిస్తారు) ఇప్పుడు హైకోర్టుకు చేరింది కేసు… ఇలాంటి దరిద్రాలకు తెరవేయాలని పిటిషన్… హహహ… కోర్టుల్లో దేవుళ్లకు న్యాయమట…!!
Share this Article