…. అది అమితాబ్ నటించిన సినిమా… ఓ బయోపిక్… అది విడుదల కావడం లేదు… పైగా అది ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి జస్టిస్ బాబ్డే దగ్గర ఉంది… నిన్న జరిగిన విచారణలో ఈ సినిమా విడుదలపై ఉన్న స్టే ఎత్తివేయడానికి తిరస్కరించాడు… రెండు విశేషాలున్నయ్ ఈ కేసులో… ఒకటి దీని విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడం, దాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం… ముఖ్య విశేషం ఏమిటంటే..? అసలు కాపీరైట్ ఎవరికి వర్తిస్తుంది అనే ఓ కీలక ప్రశ్నను కోర్టు ముందుకొచ్చింది… అదీ అసలు ఇంట్రస్టింగు…
ఏదైనా ఉదాహరణతో చెప్పుకుందాం ఓసారి… ఉదాహరణకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ… వాళ్ల నడుమ స్పర్థ మీడియాకు ఎక్కింది… అది జట్టు జయాపజయాల్ని ప్రభావితం చేస్తోంది అనుకుందాం… ఒక నిర్మాత కోహ్లీ కథను సినిమాగా తీయాలని అనుకుని, కోహ్లీ అనుమతి తీసుకున్నాడు… కానీ రోహిత్ ప్రస్తావన, పాత్ర లేకపోతే ఆ కథే లేదు… అలాంటప్పుడు తన అనుమతి లేకుండా తన ప్రస్తావనతో తన కథ ఎలా తీస్తారని రోహిత్ అడిగితే..? అడ్డుపడితే..? అది కాపీరైట్ కిందకు వస్తుందా..?
Ads
అసలు నిజజీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు పబ్లిక్ డొమైన్లో బాగా చర్చల్లోకి వచ్చాక… అది ‘‘ప్రజలందరి ఆస్తి’’ అవుతుంది కదా… వాటికీ కాపీ రైట్స్ వర్తిస్తాయా..? ఇదీ ఇప్పుడు సుప్రీంకోర్టు విచారించాలి…
ఎందుకంటే..? టీ-సీరిస్ నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ విజయ్ బార్సే అనే ఓ ఫుట్‌బాల్ కోచ్ పాత్రను పోషించాడు… స్లమ్స్‌లో ఉండే పిల్లల్లో ప్రతిభను గమనించి, ఓ టీం ఏర్పాటు చేసి, మంచి విజయాలు సాధిస్తాడు విజయ్ బార్సే… తన బయోపిక్ ఇది… అయితే తను మెరుగుదిద్దిన వారిలో అఖిలేష్ పాల్ ఒకడు… తను ఆ టీం కెప్టెన్… సో, ఆ కోచ్ కథ చెబుతున్నప్పుడు అఖిలేష్ పాల్ కథ, పాత్ర కూడా ఉంటుంది కదా… ఇక్కడ ట్విస్టు ఏమిటంటే..?
సదరు పాల్ కథను సినిమాగా తీయడానికి నేను రైట్స్ తీసుకున్నాను, అలాంటప్పుడు ఆ పాత్ర ఉండేలా మీరు సినిమా ఎలా తీస్తారు అంటూ నంది చిన్నికుమార్ అనే నిర్మాత సివిల్ కోర్టులో కేసు వేశాడు… అసలు ఆ పాత్ర లేకుండా కోచ్ కథ, కోచ్ సక్సెస్ ఎలా చెప్పగలం అంటారు టీసీరిస్ వాళ్లు… మరి మీరే సదరు టీం కెప్టెన్ గురించి కూడా చెప్పి, ఆ సినిమా తీసేస్తే, మరి నేను రైట్స్ తీసుకుని ఏం లాభం అంటాడు ఈ చిన్నికుమార్… సివిలో కోర్టు కేసు తేలేదాకా సినిమా విడుదల ఆపండి అని స్టే ఇచ్చింది…
తెలంగాణ హైకోర్టు కూడా సివిల్ కోర్టు ఇచ్చిన స్టేను సమర్థించింది… చివరకు కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది… ఈ విచారణ సందర్భంగానే ఈ రైట్స్ ఇష్యూ వచ్చింది… నిజజీవితంలో మనకు తారసపడి, పబ్లిక్ డొమైన్లో విస్తృతప్రచారం పొందిన వ్యక్తుల జీవితాలో, సంఘటనలో కాపీ రైట్స్ పరిధిలోకి వస్తాయా అనేది ప్రశ్న… కేసు ముగిసేదాకా స్టే కొనసాగుతుంది అని చీఫ్ జస్టిస్ చెప్పాడు… ఆరు నెలల్లో కేసు క్లోజ్ చేద్దాం అన్నాడు… అప్పటిదాకా ఆగితే మేం నష్టపోతాం, ఈ సినిమాకు అడ్డుపడవద్దని కోరుతూ, సదరు చిన్నికుమార్కు ఆల్రెడీ 1.30 కోట్లు ఇచ్చాం, ఐనా ఆ ఒప్పందానికి కట్టుబడటం లేదు అని టీసీరిస్ లాయర్ వాదించాడు… దాన్ని కొట్టేసిన సీజే వాయిదా వేశాడు…
సినిమా పేరు ఝుండ్… అంటే ప్రేక్షకుల గుంపు…
Share this Article