Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్ద ప్రక్రియ ద్వారా విధుల నుంచి తప్పిస్తే సరి… అంతేనా శిక్ష..?!

July 27, 2025 by M S R

.

జస్టిస్ యశ్వంత్ వర్మ… హైకోర్టు మాజీ జడ్జి… అలహాబాద్‌కు బదిలీ చేస్తే అక్కడి బార్ గగ్గోలు పెట్టింది… దాంతో బదిలీ సరే గానీ, న్యాయపరమైన విధులు నిర్వహించకుండా నిషేధం పెట్టింది… తన నివాస ప్రాంగణంలో సంచుల్లో కుక్కిన వందల కోట్ల నోట్ల కట్టలు తగులబడిపోయి కనిపిస్తే, దొరికితే… నాకూ వాటికీ సంబంధం లేదన్నాడు మొదట్లో…

తరువాత సుప్రీంకోర్టు ఓ అంతర్గత విచారణ కమిటీ వేసి విచారించి, తనను అభిశంసించాలని సిఫారసు చేసింది పార్లమెంటుకు… అంటే కొలీజియం నియామకాలు చేయగలదు, బదిలీలు చేయగలదు కానీ దింపేయలేదు… అంటే, సర్వీస్‌ను టర్మినేట్ చేయలేదు… అదెలా..?

Ads

ఎవరిని న్యాయమూర్తుల్ని చేయాలో కొలీజియం ఇష్టం… నేషనల్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడానికీ మోకాలడ్డు పెడుతుంది… కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తే పార్లమెంటు పూనుకుని అభిశంసించాలట… అదికాదు, అసలు తనను అభిశంసించాలనే నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడుంది అంటున్నాడు ఇప్పుడు..? నోట్లకట్లలు దొరికితే అవినీతి అని ముద్రెలా వేస్తారు అంటాడు..?

దీన్ని విచారణకు తీసుకుంది సుప్రీంకోర్టు.., కానీ సాక్షాత్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అది విచారించే ధర్మాసనం నుంచి తను తప్పుకున్నాడు… అభిశంసనకు సిఫారసు చేసింది నేనేే కాబట్టి, ఆ ధర్మాసనంలో తను ఉండటం భావ్యం కాదనేది తన భావన…

ఈ అభిశంసన తీర్మానం దెబ్బకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ కొలువు ఎగిరిపోయింది… ఏకంగా తనపైనే అవిశ్వాస తీర్మానానికి బీజేపీయే సిద్ధమైంది… కారణం, ప్రతిపక్షాల అభిశంసన తీర్మానాన్ని తను టేకప్ చేయడం, మనకు దక్కాల్సిన క్రెడిట్‌ను ప్రతిపక్షాలకు ఇస్తున్నావేమిటీ అనేది బీజేపీ అభ్యంతరం, ఆగ్రహం… వెరసి గుడ్ బై… చాలా సీరియస్ నిర్ణయం…

సో, తను టేకప్ చేసిన రాజ్యసభ తీర్మానం వ్యవహారాన్ని పక్కన పెట్టి… లోక్‌సభ ద్వారా అభిశంసించాలని నిర్ణయం అట తాజాగా… ఇలా జస్టిస్ వర్మ చుట్టూ రకరకాల విశేష పరిణామాలు తిరుగుతున్నాయి… అన్నీ రాజ్యాంగ వ్యవస్థల చుట్టూరా… దేశవ్యాప్తంగా ఈ జస్టిస్ వర్మ వ్యవహారం ఇలా చర్చనీయాంశం అయింది కదా…

సగటు మనిషిలో ఓ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు… లోక్‌సభ అభిశంసిస్తే తన కొలువు పోతుంది… లేదా గతంలో ఒకరిద్దరిలాగే ముందే రాజీనామా చేస్తే అభిశంసన అవసరం పడకపోవచ్చు… కానీ తరువాత..? కొలువు తీసేయడమే శిక్ష అవుతుందా..?

అసలు ఆ నోట్ల కట్టలు ఎక్కడివో ఏదైనా దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చాల్సిన అవసరం లేదా..? అవినీతికి శిక్ష కేవలం ఆ కొలువు నుంచి తప్పించడం మాత్రమేనా..? ఈ సంగతి తేల్చాల్సింది ఎవరు..? ఒకసారి తను పదవి నుంచి దిగిపోయాక కూడా దర్యాప్తుల నుంచి రక్షణ ఉంటుందా…? అన్నీ భేతాళప్రశ్నలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యూట్యూబు డైట్ ఫ్లాన్లతో బీకేర్‌ఫుల్… ఓ యువకుడు కన్నుమూశాడు…
  • సీఎం రమేష్ స్విచ్ నొక్కితే… బండి సంజయ్ లైటు వెలిగింది…!!
  • పెద్ద ప్రక్రియ ద్వారా విధుల నుంచి తప్పిస్తే సరి… అంతేనా శిక్ష..?!
  • ఆ ఓటీటీలో రిలయెన్స్‌కూ వాటా… ఐనాసరే, కేంద్రం బ్యాన్..!
  • ఆ మోనిత మళ్లీ వస్తోంది… ఈసారి అంతకు మించిన నెగెటివ్ షేడ్స్‌తో..!!
  • ఏడాదిలో తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్‌లో మార్పులు ఇవీ..!
  • షాకింగ్ కలెక్షన్లు… పొరుగు భాషల్లో పోయినట్టే… మరి తెలుగులో..?
  • పది అవతారాలు సరే… ఒకటీరెండు అవతారాలపై అదే సందిగ్ధత…
  • జొమాటో, స్విగ్గీ… ఏదైనా అంతే… ఫుడ్డు తక్కువ, రేట్లు ఎక్కువ…
  • హరిహరా..! ఇవేం కలెక్షన్లు నాయకా..? థియేటర్లు నిర్మానుష్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions