1991… పహ్లాజ్ నిహలానీ ఓ సినిమా తీశాడు… ఫస్ట్ లవ్ లెటర్ దాని పేరు… దానికి బప్పీలహిరి సంగీత దర్శకుడు… తనకున్న సాన్నిహిత్యంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనే అన్ని పాటలూ పాడించాడు బప్పీ… లతా మంగేష్కర్, ఆశా భోస్లే, కవితా కృష్ణమూర్తి ఇతర ఫిమేల్ గాయకులు… నిహలానీ పాటల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడు… బప్పీ కూడా తన అభిరుచికి అనుగుణంగా ట్యూన్స్ కట్టాడు… అందులో ఒక పాట తోతా తోతా… మనీషా కొయిరాలాకు ఫస్ట్ సినిమా… హీరో వివేక్ ముష్రాన్… చుంకీపాండే కూడా ఉన్నాడు అందులో…
ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్‌లో ఈ తోతా తోతా పాట రికార్డింగ్ అయిపోయింది… ఇంకా అక్కడే ఉన్నారు లత, బాలు… నిహలానీకి ఆ పాట వింటుంటే ఏదో వెలితి అనిపించింది… రావల్సినంత ఫీల్, ఎమోషన్ లత గొంతు నుంచి పలకలేదనీ, కాజువల్‌గా పాడేసిందనీ అనుకున్నాడు… బప్పీని పిలిచి, మళ్లీ పాడించి రికార్డ్ చేయాల్సిందిగా కోరాడు… బప్పీ షాక్…
ఒకసారి పాడిన పాట బాగా లేదని చెప్పి, మళ్లీ పాడమని కోరాలా..? నెవ్వర్, నావల్ల కాదు, కావాలంటే మీరు వెళ్లి లతను అడగండి, రీరికార్డింగ్‌కు నేను రెడీగా ఉంటాను అన్నాడు బప్పీ… నువ్వు నా సంగీత దర్శకుడివి, నాకు కావల్సినట్టుగా పాట ఇవ్వాలి కదా అంటాడు నిహలానీ… మీరెన్ని చెప్పినా అది నావల్లకాదు, నాకంత ధైర్యం లేదంటాడు బప్పీ… చివరకు నిహలానీయే లత దగ్గరకు వెళ్లాడు…
‘‘లతాజీ, మీరు పాట బాగా పాడారు… కానీ పాటలో మరింత ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ పలికితే ఇంకా బాగా వస్తుంది’’ అన్నాడు… ఆమెకు చిర్రెత్తింది… కాస్త ఇగోయిస్ట్ కదా… తను పాడిన దాంట్లో తప్పేం ఉందో అర్థం కాలేదు… ‘‘పోనీ, ఎలా పాడితే బాగుంటుందో పాడి చూపించండి’’ అనడిగింది నిర్మాతను… లతకు పాడి చూపించడం, అదీ 1991 ప్రాంతంలో… నిహలానీ సరే అన్నాడు… ఏ పదాల దగ్గర తనకు ఎలా కావాలో పాడి చూపించాడు…
Ads
లత ఇక మారుమాట్లాడలేదు, మళ్లీ పాడింది… నిహలానీ ఖుష్… ఆ పాట సూపర్ హిట్… బప్పీలహిరి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ వంటి లెజెండ్స్‌తో పనిచేయడం నా అదృష్టం అంటాడు నిహలానీ… గత ఏడాది బాలును కోల్పోయాం… పది రోజుల వ్యవధిలో ఈమధ్యే లతను, బప్పీని పోగొట్టుకున్నాం… సంగీత పరిశ్రమ ఏమీ ఆగదు, నడుస్తూనే ఉంటుంది… కానీ అప్పటిలాగా మాత్రం కాదు…
ఇదీ టైమ్స్‌లో వచ్చిన స్టోరీ… దాని లింక్ ఇదుగో… https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/the-untold-bappi-lahiri-lata-mangeshkar-story-when-bappi-da-couldnt-tell-lata-ji-to-sing-his-song-again-exclusive/articleshow/89644783.cms?from=mdr
Share this Article