కామారెడ్డిలో బీజేపీ కార్యకర్త ఓ ఇంట్రస్టింగ్ ఈక్వేషన్ చెప్పుకొచ్చాడు… సరే, అందరూ దానితో ఏకీభవిస్తారని కాదు… కాకపోతే వేరే ఏ నియోజకవర్గంలో లేనన్ని సమీకరణాలు ఉన్నయ్ అక్కడ వోటర్ల ఎదుట… చాయిస్ అనేది కష్టమైపోతోంది… పర్టిక్యులర్‌గా లోకల్, నాన్-లోకల్ ప్రధానమైన ఎన్నికల అంశం అయిపోయింది… తన మాటల్లో చెప్పుకుందాం ఓసారి…
‘‘కేసీయార్, రేవంత్ నాన్ -లోకల్, మా బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి లోకల్… ఆ ఇద్దరూ పాసింగ్ క్లౌడ్స్, వచ్చీపోయే అతిథులు… కానీ మా రెడ్డి సాబ్ ఎటూ పోడు… ఇక్కడే ఉంటాడు, జనంలో ఉంటాడు, ఎవరు ఫోన్ చేసినా అవసరానికి వాలిపోతాడు… ముందుగా కేసీయార్ విషయానికి వద్దాం…
తనకు గజ్వెల్‌లో ఏదో డౌట్ కొట్టింది కాబట్టి కామారెడ్డికి వచ్చాడు… అంతేతప్ప ఈ స్థానంపై తనకేమీ ప్రేమ లేదు… సపోజ్, తను గెలిచి, తన పార్టీ రాష్ట్రంలో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడనుకుందా… గజ్వెల్‌లో గెలిస్తే కామారెడ్డిని వదులుకుంటాడు… ఎవరో డమ్మీ ఉపఎన్నికలో నిలబడతాడు… సో, కేసీయార్‌కు వోటు ఎందుకు వేయాలి..? పైగా తను గెలిచినా సరే అందుబాటులో ఉండడు, ముఖ్యమంత్రి కుర్చీలోనే సరిగ్గా కూర్చోడు, రోజుల తరబడీ ఫామ్ హౌజుకే పరిమితం, సచివాలయానికే పోడు… సగటు వోటరుకు తను గెలిచినా దక్కేదేముంది..?
Ads
పోనీ, ముఖ్యమంత్రి కదా, గజ్వెల్ స్థాయిలో డెవలప్‌మెంట్ చేస్తాడు అనుకుందామా..? లేదు… ఇది తన ఒరిజినల్ సీటు కాదుగా… తనకెందుకు ప్రేమ ఉంటుంది..? పోనీ, గజ్వెల్‌లో ఓడిపోయి, కేవలం కామారెడ్డిలో గెలిచినా సరే, తను ఎలాగూ కొడుక్కి పట్టం కడతాడు… ఆయన సీటేమో సిరిసిల్ల… కామారెడ్డికి ప్రయారిటీ ఎందుకు ఉంటుంది..? పోనీ, కామారెడ్డిలో ఓడిపోయి, గజ్వెల్‌లో గెలిచాడు అనుకుందాం… మొత్తానికే తను కామారెడ్డి వైపు మళ్లీ రాడు… ఈ ఫీలింగ్ జనంలో ఉంది కాబట్టే ఎదురీదుతున్నాడు…
ఇక రేవంత్… తను కూడా అంతే కదా… ఇక్కడ జనంలో ఉండే షబ్బీర్‌ను నిజామాబాద్ సీటు వైపు తరిమారు… రేవంత్ కోసం పనిచేసే లోకల్ కేడర్ ఎవరూ లేరు… అందరూ నిజామాబాద్‌లో వర్క్ చేస్తున్నారు… ఎన్నిక అయిపోయాక మళ్లీ ఒక్కరు ఈ ప్రాంతంలో కనిపించరు… తను ఇక్కడ గెలిచి, ముఖ్యమంత్రి అయినా సరే తనేమీ అందుబాటులో ఉండడు… ముఖ్యమంత్రి చుట్టూ జనాన్ని అడ్డుకునే అనేక గీతలు, ఆంక్షలు… పోనీ, కొడంగల్, కామారెడ్డి రెండూ గెలిచాడు అనుకుందాం… కొడంగల్ ఉంచుకుని ఇక్కడ ఇంకెవరినో ఉపఎన్నికలో నిలబెడతారు… లేక నిజామాబాద్‌లో షబ్బీర్ ఓడిపోతే తనే ఇక్కడ ఉపఎన్నికలో నిలబడతాడు…
సపోజ్, కొడంగల్ ఓడిపోయి, కామారెడ్డిలో గెలిచి, ముఖ్యమంత్రి కూడా కాలేదు అనుకుందాం… పార్టీకి మెజారిటీ రాలేదనుకుందాం… అప్పుడైనా తను ఈ ప్రాంతానికి మళ్లీ మొహం చూపించడు… ఇప్పుడు పోటీలుపడి కేసీయార్, రేవంత్ ఇద్దరూ మస్తు ఖర్చు చేస్తున్నారు… కానీ ఉపఎన్నికలో ఈ సీన్ మళ్లీ ఉండదు… సో, ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా కామారెడ్డి జనానికి నయాపైసా ఉపయోగం లేదు… మా వెంకట రమణారెడ్డి గెలిచినా, ఓడినా ఎటూ పోయేది లేదు… ఇంతకు ముందు బోలెడు ఖర్చు పెట్టుకున్నాడు… జనంలో ఉన్నాడు, ఇప్పుడూ ఖర్చు చేస్తాడు, అది పార్టీకి, ఎన్నికలకు సంబంధం లేదు… ఆయన ఔదార్యం… ఇవీ మాకు అనుకూలించే ఈక్వేషన్లు’’ అని చెప్పుకొచ్చాడు…
అఫ్‌కోర్స్, ఇది బీజేపీ కోణంలో సాగిన వివరణ… అందరూ ఇలాగే ఆలోచించాలని ఏమీ లేదు… కానీ లోకల్- నాన్ లోకల్ అనే చర్చ మాత్రం బాగా నడుస్తోంది… ఆ ఇద్దరు అతిరథులు గెలిచినా ఓడినా అందుబాటులో ఉండరు, ఆపతికీ, సంపతికీ అక్కరకు వచ్చేవాళ్లు ఉండరు అనే ఫీల్ జనంలోకి బాగానే ఎక్కుతోంది… ఐతే ఇది బీజేపీ అభ్యర్థిని గట్టెక్కించే స్థాయిలో ఉందా..? ఏమో డిసెంబరు 3న కదా తేలేది…!! మొత్తానికి ఇక్కడ జరిగేది పార్టీల సమరం కాదు… ముగ్గురు వ్యక్తుల మధ్య సమరం..!!
Share this Article