పార్ధసారధి పోట్లూరి ……. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ?
కాంగ్రెస్ గెలిచింది అని సంబరాలు చేసుకుంటున్న వారికి ఇది అంకితం !
కర్ణాటక కాంగ్రెస్ లో రెండు బలమయిన గ్రూపులు ఉన్నాయని మనకి తెలిసిందే !
Ads
D.shivakumar [DSHIK] మరియు సిద్ధ రామయ్య!
కానీ ఎన్నికలలో తమ విభేదాలని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడారు DSHIK మరియు సిద్ధ రామయ్య !
వీళ్ళిద్దరి లక్ష్యం ఒకటే.ఎలాగయినా అధికారాన్ని చేజిక్కించుకొని తరువాత మనిద్దరి బలాబలాలు చూసుకోవచ్చు అని !
********************
ఎన్నికలకి ముందు నుండే DSHIK బహిరంగంగానే చెప్తూ వచ్చాడు కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటూ ! కానీ సిద్ధరామయ్య మాత్రం మౌనంగా ఉంటూ వచ్చాడు.
ఫలితాలు వచ్చాక ఇటు DSHIK ఇంటి ముందు మరియు సిద్ధ రామయ్య ఇంటి ముందు వాళ్ళ వాళ్ళ అనుచరులు మా నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అంటూ నినాదాలు చేశారు,. ఇక ఫ్లెక్సీ ల మాట చెప్పేదేముంది ?
****************
అయితే కర్ణాటక లో కేవలం రెండు వర్గ పొరులే ఉన్నాయనుకుంటే పొరపాటు ! ఇంకొ గ్రూపు ఉంది, అది AICC ఢిల్లీ మరియు కర్ణాటక CLP లు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించేది సహజంగా సోనియా కుటుంబం మాత్రమే ! అయితే సోనియా కుటుంబం ఎవరిని నిర్ణయిస్తే వారిని ముఖ్యమంత్రిగా ఒప్పుకోదు కర్ణాటక CLP.
DSHIK కి AICC లో మరియు సోనియా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ కర్ణాటక CLP లో సిద్ధరామయ్య మాటే చెల్లుబాటు అవుతుంది కానీ DSHIK మాటకి విలువ లేదు.
సోనియా మాటతో AICC కనుక DSHIK ని ముఖ్యమంత్రి గా ప్రకటిస్తే దానికి కర్ణాటక CLP ఒప్పుకోదు ! దాంతో పార్టీలో అంతర్యుద్ధం రహస్యంగానె మొదలవుతుంది !
ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతున్నది ఇదే ! రాజస్థాన్ లో CLP మీద పట్టు ఉన్నది ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి కానీ అదే సమయంలో సచిన్ పైలట్ కి AICC లో పట్టు ఉంది. అక్కడ గత మూడేళ్లుగా అశోక్ గెహ్లాట్ కి సచిన్ పైలట్ కి యుద్ధం నడుస్తున్నది అన్న సంగతి మనకి తెలిసిందే ! ఒక దశలో సచిన్ పైలట్ తన వర్గం ఎంఎల్ఏ లతో బిజేపి లో చెరిపోతాడు అనే టాక్ వచ్చింది కానీ ఢిల్లీ AICC జోక్యంతో అది జరగలేదు. రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుపుకి కారణం సచిన్ పైలట్ మాత్రమే కానీ అధికారం చెలాయిస్తున్నది అశోక్ గెహ్లాట్!
ఇప్పుడు కర్ణాటకలో కూడా రాజస్థాన్ తరహా నాటకం మొదలవబోతున్నది. రాజస్థాన్ లో సచిన్ పైలట్ పోషిస్తున్న పాత్రని కర్ణాటకలో DKSHI పోషిస్తాడు ! కానీ సచిన్ పైలట్ అంత సున్నిత మనస్తత్వం కలవాడు కాదు DSHIK. అవసరం అయితే పార్టీని చీల్చగల శక్తి ఉన్నవాడు,. ఒక్క మాటలో చెప్పాలంటే గూండాయిజం చేయగల సమర్ధుడు. గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూరుస్తున్నది DSHIK మాత్రమే ! ఒకప్పుడు అహ్మద్ పటేల్ కాంగ్రెస్ లో పోషించిన పాత్రని పటేల్ చనిపోగానే DSHIK నిర్వహిస్తున్నాడు. అఫ్కోర్స్ అందుకే ఆక్రమాస్తుల కేసుల విషయం లో సిబిఐ,ED విచారణని ఎదుర్కుంటున్నాడు DSHIK. పైగా ఇటీవలే హై కోర్టు విచారణ చేయడం సబబే అంటూ తీర్పు ఇచ్చింది DSHIK కి వ్యతిరేకంగా ! రేపో మాపో మళ్ళీ సిబిఐ మరియు ED లు నోటీసులు ఇవ్వవచ్చు తమ ముందు హాజరు కమ్మని !ఒక వేళ సోనియా కనుక DSHIK కనుక ముఖ్యమంత్రిని చేస్తే ఇన్కమ్ టాక్స్ ,సిబిఐ,ED విచారణలో నేర నిరూపణ జరిగితే రాజీనామ చేయాల్సి వస్తుంది. ఇదే అంశం AICC లో సిద్ధరామయ్య లేవనెత్తాడు తనకి అనుకూలంగా ఉండే విధంగా !
(*******************
ఒకవేళ సిద్ధ రామయ్యని కనుక ముఖ్యమంత్రిని చేస్తే DSHIK చూస్తూ ఊరుకొడు !
DSHIK ఇప్పటికే ఘాటుగా వార్నింగ్ ఇచ్చేశాడు AICC కి. నన్ను కాకుండా ఇంకెవరిని అయినా ముఖ్యమంత్రిని చేస్తే నాతో పాటు నా ఎంఎల్ఏ లు ఎవరూ కూడా మంత్రి వర్గంలో చేరరు అంటూ !
నిన్న 14-05-2023 శాంగ్రిల హోటల్ [Shangrilla Hotel ] లో CLP మీటింగ్ జరిగింది ! కర్ణాటక కాంగ్రెస్ ఎంఎల్ఏ లు అందరూ హాజరు అయ్యారు. ఆ సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ 90% మంది ఎంఎల్ఏ లు నా వల్లనే గెలిచారు అన్నాడు. కాబట్టి నన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి అంటూ డిమాండ్ చేశాడు.
సిద్ధరామయ్య అన్న మాటలని ఖండిస్తూ DSHIK మాట్లాడుతూ ఒక్కళిగ వోటర్లు అందరూ నేను ముఖ్యమంత్రిని అవుతాననే వోట్లు వేసి పార్టీని గెలిపించారు అన్నాడు. ఓల్డ్ మైసూరు ప్రాంతంలో JDS కి పడాల్సిన వోట్లు అన్నీ నా వర్గానికి చెందిన ఎంఎల్ఏ లకె పడ్డాయి. ఓల్డ్ మైసూర్ లో ఉన్న లింగాయత్, ముస్లిం, ఇతర కులాల వాళ్ళు నా వెంటే ఉన్నారు కాబట్టి నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి అని డిమాండ్ చేశాడు!
********************
శాంగ్రిల హోటల్ లో జరిగిన CLP సమావేశానికి ఢిల్లీ లోని AICC పరిశీలకుడిగా సూర్జెవాలా,మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. DSHI మాటలతో అక్కడి వాతావరణం వేడెక్కడంతో సిద్ధరామయ్య చాలా తెలివిగా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో అక్కడ ఉన్న ఎంఎల్ఏ లని చేతులు ఎత్తమని ఆడగాల్సిందిగా ఖర్గే, సూర్జెవాలాలని కోరాడు. కానీ ముఖ్యమంత్రి గా ఎవరు ఉండాలో రహస్య ఓటింగ్ చేయించాడు సూర్జెవాలా. ఫలితాలని సీల్డ్ కవర్ లో ఢిల్లీకి పంపించాడు సూర్జేవాలా !
దాంతో ఆగ్రహోదగ్రుడు అయిన DSHIK విసురుగా హోటల్ నుండి బయటికి వచ్చి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు 1
DSHIK సమావేశంలో ఆవేశంగా ఇలా మాట్లాడాడు : నేను పార్టీ కోసం పనిచేస్తూ ఇన్కమ్ టాక్స్ కేసులో జైలుకి వెళ్ళాను. ఇన్కమ్ టాక్స్, సిబిఐ, ED విచారణ పేరుతో చాలా బాధలు పడ్డాను కనుక సోనియా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ పెద్దగా అరిచాడు!
సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళాడు సోనియా ని కలవడానికి కానీ DSHIK మాత్రం ఢిల్లీ వెళ్లలేదు ఉపయోగం ఉండదు అని.
*****************************
అయితే ఇప్పటికే AICC ఒక ప్రతిపాదన చేసింది DSHIK కి. మొదటి రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండేట్లు మరియు మిగిలిన రెండున్న సంవత్సరాలు DSHIK ముఖ్యమంత్రిగా ఉండేట్లుగా !
కానీ ఈ ప్రతిపాదనని DSHIK తిరస్కరించాడు ! 2021 లో తన వర్గం ఎంఎల్ఏలతో పాటు JDS ఎంఎల్ఏ లని కూడా కలిపి కావాలనే బిజేపితో చేరేటట్లు మంతనాలు చేసి చివరికి బిజేపికి అధికారం కట్టబెట్టాడు సిద్ధరామయ్య అని తెలుసు !
ఇక ఇప్పుడు సిద్ధరామయ్య కనుక మొదట ముఖ్యమంత్రి అయితే ఇన్కమ్ టాక్స్, సిబిఐ, ED ల కి కావాల్సిన సమాచారం మొత్తం ఇచ్చేస్తాడు సిద్ధరామయ్య DSHIK కి వ్యతిరేకంగా అని తెలుసు కాబట్టి తాను ముఖ్యమంత్రిని కాకుండా వేరే ఎలాంటి ప్రతిపాదనని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు DSHIK.
********************************
సిబిఐ కొత్త డైరెక్టర్ గా కర్ణాటక DGP ప్రవీణ్ సూద్ నియామకం జరిగిపోయింది. గతంలో DSHIK ఇదే DGP ని పనికిమాలిన వాడు అంటూ బహిరంగంగా అన్నాడు ! So! ఎలా చూసినా DSHIK కి ఇబ్బందులు తప్పవు!
అందుకే సోనియా DSHIK ని ముఖ్యమంత్రిగా చేయడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది ! గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే జైలు శిక్ష పడడంతో రాజీనామా చేసి జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే !
పొరబడకండి : ప్రస్తుత కర్ణాటక DGP ని సిబిఐ డైరెక్టర్ గా నియమించడానికి గత ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం అయ్యింది ఎంపిక ప్రక్రియ! సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్షం నుండి మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన మంత్రి శ్రీ మోడీజీ లు కలిసి ప్రవీణ్ సూద్ ని ఎంపిక చేయడం జరిగింది ! ప్రవీణ్ సూద్ ని DSHIK పనికిమాలిన వాడు అని తిట్టినట్లు ఖర్గే కి తెలిసీ ఎందుకు ఒప్పుకున్నాడు ? So! DSHIK మీద గత ఫిబ్రవరి నుండి చాలా తెలివిగా వల వేసింది కాంగ్రెస్ పార్టీ !
రేపు అసలు సంగతి తెలిసిపోతుంది కానీ కుమ్ములాటలు మాత్రం ఆగవు కర్ణాటక కాంగ్రెస్ లో !
ఇంతా చేస్తే సంవత్సరానికి 50 వేల కోట్లు కావాలి కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత వాగ్దానాలని నెరవేర్చాలి అంటే ! ఎక్కడి నుండి తెస్తారు ?
Share this Article