డప్పు పత్రికలు నమస్తే, సాక్షి… ఇతర చిన్న పత్రికల్ని వదిలేస్తే…… ఈరోజుకూ కాస్త ప్రొఫెషనల్ టెంపర్‌మెంట్ చూపిస్తున్నది ఆంధ్రజ్యోతి మాత్రమే… సరే, అది పచ్చ అంగీ తొడుక్కున్న టీడీపీ పత్రిక అని అందులోని పొలిటికల్ చెత్తను కాసేపు వదిలేద్దాం… కానీ మిగతా అంశాల్లో మాత్రం బాగుంటుంది… కొన్ని ఇంట్రస్టింగు వార్తల్ని ఎక్కడో ఓచోట అకామిడేట్ చేస్తోంది… మిగతా పత్రికలు సిగ్గుపడాలా లేదానేది వాటికే వదిలేస్తే… మన తాజా వార్తాంశం… గుళ్లల్లో వీవీఐపీల చెత్తదనం…
నిలువెల్లా వైసీపీదనం ఒంటపట్టించుకున్న ఒక టీటీడీ సుబ్బారెడ్డి నుంచి పెద్దగా మనం ఆశించలేం… తనదీ రాజకీయ బుర్రే కదా… తనదీ రాజకీయ పునరావాసమే కదా… కానీ మన తిరుమలలో కూడా ఇలా జరిగితే ఎంత బాగుండు అనుకోవడానికి ఈ వార్త ఉపకరిస్తుంది… అఫ్‌కోర్స్, ఇందులో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నయ్… కానీ ఆసక్తికరంగా ఉంది కేస్, సుబ్రహ్మణ్యస్వామి వంటి లిటిగెంట్లకు కాదు… ఓ సాదాసీదా సగటు వెంకన్న భక్తుడికి…! జగన్, చంద్రబాబు… ఎవరైతేనేం..? వాళ్లేమీ చేయలేరు… చేయరు… సగటు భక్తుడి చెవుల్లో ఎడ్డి పూలు పెట్టడం తప్ప… అదే ఈ కథన సారాంశం…
విషయం ఏమిటంటే..? మధురై ధర్మాసనం దగ్గరకు ఓ కేసు వచ్చింది… ఎవరో ఓ ఉద్యోగి వేసిన పిటిషన్… ఈ సందర్భంగా ఇంకొన్ని అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది… ఒరేయ్, ఒరేయ్, దుర్మార్గుల్లారా… వీఐపీ దర్శనాల పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టొద్దురా, ఆలయానికి అసలు వీఐపీ ఆ దేవుడేరా..? సామాన్యులపై వివక్ష చూపించొద్దురా, వీఐపీల వెంట వచ్చే బంధుగణం, సిబ్బందికి కూడా సాగిలపడొద్దురా అని అక్షింతలు వేసింది…
Ads
బాగుంది… గ్రేట్ న్యాయమూర్తీ….. కానీ ఒక్క మాట… అసలు ఈ వీవీఐపీల జాబితాలో న్యాయమూర్తులు ఎందుకుండాలి..? ఈ అపవిత్ర అధర్మ దర్శన కార్యక్రమాల్లో వాళ్లు పాలుపంచుకోవడం లేదా..? తెల్లారిలేస్తే పత్రికల్లో వాళ్ల ఫోటోలు, వాళ్లు దేవుడిని దర్శనం చేసుకుని, ఆ దేవుడిని కరుణించారు అన్నట్టుగానే వార్తలు వస్తున్నయ్ కదా… మరి అదెందుకు పరిగణనలోకి తీసుకోలేదు…
జానేదేవ్… పొలిటికల్ లీడర్లు, పారిశ్రామికవేత్తలు, సమాజంలో హోదా కలిగిన పెద్ద మనుషులు… వీళ్లకు దేవుడూ, జీవుడూ జాన్తా నై… అసలు వీళ్లంతా వెళ్లేది క్రూరమైన రౌరవాది నరకాలకే… డౌట్ లేదు… గరుడ పురాణంలోని అన్ని శిక్షలకూ అర్హులు వీళ్లు… అయితే… ఈ కోర్టు తీర్పు స్పూర్తి మాత్రం కాస్త నచ్చుతోంది… భక్తులను తిట్టే సిబ్బందిని శిక్షించాలి, వీవీఐపీల ఆశ్రితగణాన్ని కంట్రోల్ చేయాలి… ఇది బాగుంది…
హబ్బ, ఒక్కరు ఎవరైనా ఈ కోర్టు తీర్పును ఉదాహరణగా తీసుకుని, సిమిలర్ కేసు అని ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో కేసులు వేస్తే ఎంత బాగుండు..? అసలు వీవీఐపీలకు ఎందుకు గుడిలో దేవుడే దిగిరావాలో చర్చకు వస్తే ఎంత బాగుండు..? ఈ చెత్తా ప్రోటోకాల్స్ మొత్తం రద్దయిపోతే ఎంత బాగుండు..? అలాంటి వీవీఐపీలను శిక్షించే తీర్పు వస్తే ఎంత బాగుండు..? చెత్తా మీడియా సంస్థలు వేసే ఫోటోలు, వార్తలు ఆగిపోతే ఎంత బాగుండు..? సగటు భక్తుడు ప్రశాంతంగా దర్శించుకుంటే ఎంత బాగుండు..?
ఇది ఒక్క తిరుపతో, తమిళనాడులో ఏ తిరచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి గుడో కాదు… మొత్తం దేశానికే వర్తించే తీర్పు వెలువరిస్తే ఎంత బాగుండేది..? ప్రధాని వచ్చినా సరే, రాష్ట్రపతి వచ్చినా సరే… సాధారణ క్యూ లైన్‌లో వచ్చే పరిస్థితి వస్తే దేవుడికి ఎంత విలువ..? అసలు ఆ దేవుళ్లనే కించపరిచేలా ఈ చెత్తా దేవుళ్లు ప్రోటోకాల్ పేరిట ప్రత్యేక దర్శనాలు, పూజలు చేయించుకునే ధర్మవ్యతిరేక పద్ధతి తొలగిపోతే ఎంత బాగుండు..?
అవున్లెండి… అలా చేస్తే ఆ పోస్టులకు, ఆ కుర్చీలకు విలువెక్కడిది..? దేవుళ్లయినా సరే, పెద్ద పెద్ద భక్తుల కోసం వేలాది మంది సామాన్య భక్తుల్ని తృణీకరిస్తే తప్పేమిటి అంటారా… అంతేలెండి… ఈ సూత్రానికి మోడీ, కేసీయార్, జగన్… అంతెందుకు, న్యాయమూర్తులు కూడా అతీతులు ఏమీ కాదుగా…! ప్చ్, గరుడ పురాణంలో వీళ్లకు ఏ శిక్షలూ పేర్కొన్నట్టుగా కనిపించలేదు ఇప్పటికి…!! ఐనా మనకెందుకులెండి… ఒక్కసారి స్వర్ణదేవాలయానికి వెళ్లిరండిరా అని మనం చెప్పలేం కదా…!!!
Share this Article