Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రేమికులమే… కానీ అలుముకున్నాడు, ముద్దాడాడు యువరానర్…

November 15, 2024 by M S R

అప్పటిదాకా బాగానే ఉంటారు, కలిసి తిరుగుతారు… మన సోషల్ మీడియా, మన జియో బ్రాడ్ బ్యాండ్, మన స్మార్ట్ ఫోన్లు, మన సినిమాలు స్కూల్ వయస్సులోనే లవ్ అనే పిచ్చి వైపు పిల్లలను నెట్టేస్తుంది తెలుసు కదా… సరే, అది మన సొసైటీ దురదృష్టం…

అసలు మానసికంగా మెచ్యూరిటీ లేని ప్రేమ అసలు ప్రేమే కాదు, ఉత్త ఆకర్షణ… అది నిలిచేదీ కాదు, పెళ్లి వైపు పోయేదీ కాదు… ఒక్క మాటలో చెప్పాలంటే అదీ ఓ బాలానందం… విషయం ఏమిటంటే..? అలా కలిసి తిరుగుతున్నప్పుడు హగ్గులు, కిస్సులు… మరీ ముదుర్లయితే ఓయోలు, పొదలు, చాటు యవ్వారాలు…

బూతు మన అరచేతిలో నర్తిస్తున్నప్పుడు అన్నీ అలా లాగేస్తుంటాయి… ఐతే ఆ వయస్సులో అన్నీ చేసుకుని, తీరా ఎక్కడో భేదాభిప్రాయాలు వస్తే… ఏకంగా కోర్టులో కేసులు పడేస్తున్నారు… లైంగిక వేధింపులు అని… పరస్పర సమ్మతితో చేసుకునేది నేరం అవుతుందా..? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్…

Ads

పోలీసులు కూడా ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసేసి, మీరూ మీరూ కోర్టులో తేల్చుకొండి అని చేతులు దులిపేసుకుంటున్నారు… అసలు అలాంటివి కేసులకు అర్హమేనా అని కూడా ఆలోచించడం లేదు… ఇలాంటి కేసే మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ దగ్గరకు వచ్చింది…

తనతో ప్రేమ వ్యవహారం నడిపిన వ్యక్తి, తనను హగ్ చేసుకున్నాడని, ముద్దు పెట్టుకున్నాడని 21 ఏళ్ల మాజీ ప్రియుడిపై 19 ఏళ్ల మాజీ ప్రేయసి కేసు పెట్టింది… నిజానికి 21 ఏళ్లంటే తను యువకుడే… పిల్లాడేమీ కాదు… ఆమెకు 19 ఏళ్లంటే యుక్త వయస్సే…

కానీ ఈ హగ్గులు, కిస్సులు ఇప్పుడు కాదు 2022లో ఓ రోజు రాత్రి జరిగాయట… తాము ఓ రాత్రి కలుసుకున్నామని అప్పుడు ఇలా బిహేవ్ చేశాడని ఆరోపణ… అర్థమవుతోంది కదా, ఇదెంత డొల్ల కేసో… ఎప్పుడో 2022లో, తాము ప్రేమలో ఉన్నప్పుడే ముద్దులు పెట్టుకున్నాడని, హగ్ చేసుకున్నాడని కేసు పెట్టిందంటే..!

ప్రేమికులు రాత్రి పూట కలుసుకుంటే ఒకరికొకరు దూరంగా, అంటీఅంటనట్టుగా కూర్చుని, నాలుగు టైమ్ పా్ పల్లీ పొట్లాలు ఖాళీ చేసి, ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకుని వెళ్లిపోతారా..? సహజంగానే పోలీసులు మాకెందుకు వచ్చిన తిప్పలు అనుకుని సదరు యువకుడిపై కేసు పెట్టేసి, కోర్టుకు అప్పగించేశారు… అది తిరిగీ తిరిగీ హైకోర్టు దాకా వచ్చింది… సీరియస్ కేసు… 354 సెక్షన్…

ఎహె, ఇదొక కేసా..? ప్రేమ వ్యవహారంలో ముద్దులు, హగ్గులు ఉండవా..? ఇద్దరూ యుక్తవయస్సు అంచులో ఉండి, ఇష్టపూర్వకంగా కలిసి, కాలం గడిపితే, అందులో నేరం ఏముంది..? దురుద్దేశపూర్వక చర్య ఎలా అవుతుంది అని వ్యాఖ్యానించి కేసు కొట్టేసింది… సదరు యువకుడికి విముక్తి ప్రసాదించింది..!!

లివ్‌ఇన్ రిలేషన్ షిప్‌లో ఉండి ఇన్నేళ్లూ తనను అత్యాచారం చేశాడని కేసులు పెట్టిన ఉదంతాలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి…

ఏమో, రాబోయే రోజుల్లో హగ్గులు, కిస్సులు, ఇతరత్రా యోయో యవ్వారాలు పరస్పర సమ్మతితోనే సాగుతున్నాయని, నేను అంగీకరిస్తున్నానని యువతుల నుంచి యువకులు లిఖితపూర్వకంగా రాయించుకుని మరీ ప్రొసీడ్ కావల్సి వస్తుందేమో… ఇవేం ప్రేమలురా భయ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎలన్ మస్క్‌‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
  • కృతి మహేశ్… లండన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ… ఇప్పుడు డాన్స్ ఫ్లోరే బతుకు…
  • జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…
  • ఆడదాని ఒళ్లు ఎఫెక్టివ్‌‌గా అమ్మగలగడమే సినీవ్యాపార సూత్రం..!!
  • ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
  • జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions