Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఛిఛీ.., ఆ పాత్రా..? అస్సలు చేయనుపో అని మడికట్టుకోలేదు…

March 22, 2025 by M S R

.

( వి.సాయివంశీ @ విశీ ) …. తమిళ డైరెక్టర్ అమీర్ సుల్తాన్ ఒక కథ రాసుకున్నారు. పల్లెటూరి మొరటు కుర్రాడి ప్రేమకథ. సినిమా చివర్లో హీరోయిన్‌ని నలుగురు లైంగికదాడి చేస్తారు. ఆమెకు ఆ కళంకం మిగలకుండా తన శరీరాన్ని ముక్కలుగా నరికేస్తాడు హీరో.

హీరోయిన్ పాత్ర కోసం ఎవర్ని అడిగినా, ‘ఆ హత్యాచారం కథా? సారీ’ అనేస్తున్నారు. కథ మార్చడానికి అమీర్ ఒప్పుకోవడం లేదు. పట్టుదలతో ఉన్నారు. అప్పుడప్పుడే నటిగా పేరు తెచ్చుకుంటున్న ఓ హీరోయిన్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. చేసింది. చాలా బాగా చేసింది. జాతీయ అవార్డు అందుకుంది. ఆ సినిమా పేరు ‘పరుత్తివీరన్’. ఆ నటి పేరు ‘ప్రియమణి’.

Ads

… మరో తమిళ డైరెక్టర్ అరుణ్ ప్రభు. కథ రాసుకున్నారు. హీరోయిన్‌కి ఎయిడ్స్. ఆ విషయం చెప్పగానే చాలామంది రిజెక్ట్ చేశారు. ‘ఛీ.. పోయి పోయి ఇలాంటి పాత్ర చేయాలా’ అనుకున్నారు. ఆయనకు ఒక పక్క విసుగు, మరో పక్క నిరాశ.

చివరకు ఓ కొత్త అమ్మాయి ఆడిషన్‌కి వచ్చింది. చాలా బాగా చేస్తోంది. తనే ఈ సినిమా హీరోయిన్ అనుకున్నారు అరుణ్ ప్రభు. ఆ అమ్మాయి చేసింది. తన నటనతో అందర్నీ కట్టి పడేసింది. ఆ సినిమా పేరు ‘అరువి’. ఆ హీరోయిన్ పేరు ‘అదితి బాలకృష్ణన్’.

… నిజమైన నటులకు భేషజాలుండవు. ఎలాంటి పాత్రలైనా మనసు పెట్టి చేయగలరు. అవకాశం వస్తే అదరగొట్టేస్తారు. రాజ్ అలాంటి నటుడే! ఇది అతని కెరీర్‌కి బెస్ట్‌గా నిలిచే సినిమా అనిపిస్తోంది.

పోస్టర్ చూడగానే, ఏంటిది అనే సందేహంతో మొదలై, ‘అరె.. ఆసక్తిగా ఉందే’ అనుకుని, ‘భలే సాహసంగా, ధైర్యంగా చేశాడే’ అనిపించింది. ఎలాంటి మొహమాటాలు లేకుండా ‘Body Positivity’ని బాగా ఎక్స్‌ప్రెస్ చేయడం నచ్చింది. Good Job and Great work Raj. All the Best.

… India’s First Film on P_ _r_n Addiction.

PS: ఈ పోస్టర్ పట్ల ఎవరికైనా అభ్యంతరాలున్నాయా? అయితే అమీర్‌ఖాన్ నటించిన ‘PK’ సినిమా పోస్టర్ ఓసారి గుర్తు తెచ్చుకోండి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇప్పుడు మోడీతో ఫోటో ఓ క్రేజ్… కానీ అప్పట్లో మోడీతో ఫోటో ఓ కలకలం…
  • హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు చేజేతులా తూట్లు… ఇజ్జత్ పోయింది..!!
  • భారీ సిక్స్ కొట్టాడు… అభినందనలు రాలేదు… చిలుం వదిలింది…
  • హరిహరా..! సమస్య లేదంటున్నావా..? నీకు సమస్య కావద్దంటావా..?
  • అసూర్యంపశ్య…! ఎండ కన్నెరుగని సుతారం బతుకులు అనారోగ్యమే..!!
  • … ఇంతకీ కుందరదన అంటే తెలుగులో అర్థమేమిటి చిరంజీవీ…
  • మిథున్ డిస్కోడాన్సర్‌తో పోలిక… బాలయ్య డిస్కోకింగ్‌కు శాపమైంది…
  • బ్రహ్మోస్ అంటేనే బ్రహ్మాస్త్రం… అది మన యుద్ధసామర్థ్య ప్రకటన…
  • ఒక నరేంద్ర, ఒక ఈటల, ఒక విజయశాంతి… సేమ్, ఒక కవిత..?!
  • స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions