ప్రేక్షకులకు ఏదో కొత్తదనం కావాలి… కథలో, కథనంలో, తారాగణంలో, సంగీతంలో, డాన్సుల్లో, యాక్షన్ సీన్లలో… ఏదైతేనేం..? భిన్నంగా ఉండాలి… ఆకట్టుకోవాలి… కొత్తకొత్తగానే కాదు, వేగంగా కథ నడవాలి… గ్రిప్పింగుగా సాగాలి… తదుపరి సీన్ ఏమిటో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు… మరి ఇలా ఉంటే తప్ప పాన్ ఇండియా ఆదరణ పొందలేం… అసలే ఇప్పుడు పాన్ ఇండియా అంటే హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, తెలుగు మాత్రమే కాదు, ఇంగ్లిషు, ఒడియా, మరాఠీ భాషల్లోనూ డబ్ చేయాల్సి వస్తోంది…
ఒక స్టార్ హీరోతోపాటు ఒక సినిమాలో మరో స్టార్ హీరో ఉంటేనే ఓ థ్రిల్… మరి ముగ్గురు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే..? అవును, మలయాళ సినిమా నిర్మాత లిజో జోస్ అదే ఆలోచించాడు… ముందుగా మోహన్‌లాల్‌ను అడిగాడు, ఆయన పెద్దగా తర్జనభర్జనలు పడే రకం కాదు, గో ఎహెడ్ అన్నాడు… సినిమా పేరు మలైకొట్టయ్ వలిబన్… యాక్షన్ థ్రిల్లర్ తీయాలని ప్లాన్
ఆసియా నెట్ న్యూస్ ఏం రాస్తుందంటే… కాంతార సినిమాలో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు కదా రిషబ్ శెట్టి… తను కూడా ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించబోతున్నాడట… ఇటు కన్నడం, అటు మలయాళం ఫ్యాన్స్, ప్రేక్షకుల మద్దతు వస్తుంది… రిషబ్‌కు మొదటి మలయాళ సినిమా అవుతుంది… అదీ మోహన్‌లాల్‌తో… బాగానే ఉన్నట్టనిపిస్తోంది కదా… ఇక్కడే అయిపోలేదు…
Ads
నిజానికి ఈ సినిమాలో అతిథి పాత్రలో చేయాలని రిషబ్ శెట్టిని అడిగాడట నిర్మాత… సరే, కాస్త కథ చెప్పు అన్నాడట రిషబ్… కథ విన్నాక, ఈ క్రేజీ ప్రాజెక్టులో నేనూ నటిస్తాను, అతిథిగా కాదు, మంచి రోల్ ఇవ్వండి చేస్తాను అన్నాడట… దాంతో కథలో రిషబ్ కోసం ఓ పాత్రను పొడిగించి, ప్రాధాన్యం పెంచేశారుట… అఫ్ కోర్స్, నిర్మాతలు అధికారికంగా ఇంకా ఏమీ ప్రకటించడం లేదనుకొండి…
సినిమాలో ఓ కీలక పాత్ర ఉంటుంది… దానికి మంచి పాపులారిటీ హీరోను ఇతర భాషల నుంచి తీసుకుందాం అనేది నిర్మాత ఆలోచన… గ్రేప్‌వైన్ న్యూస్ ప్రకారం… ఈ పాత్రకు కమల్ హాసన్‌ను అడిగారు… వోకే, నేను రెడీ, గో ఎహెడ్ అన్నాడట కమల్… ఇంకేముంది..? ముగ్గురు స్టార్ హీరోలు… చాలా ఏళ్ల తరువాత కమల్ హాసన్ మళ్లీ మోహన్‌లాల్‌తో నటిస్తున్నాడన్నమాట… ముగ్గురికీ పాన్ ఇండియా స్టేటస్ ఉంది, ఇంకేం కావాలి…?
జాగరణ్ ఏం రాస్తున్నదంటే… అందరి ఆసక్తీ కాన్సంట్రేట్ అవుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ త్వరలో రాజస్థాన్, జైసల్మేర్‌లో స్టార్ట్ చేయబోతున్నారు… స్క్రీన్ ప్లే పీఎస్ రఫీక్, ఫోటోగ్రఫీ మధు నీలకంధన్, ఎడిటర్ దీపు జోసెఫ్ అని ఫైనల్ చేశారు… సంగీత దర్శకత్వం ప్రశాంత్ పిళ్లై… ముగ్గురు హీరోలూ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసినవాళ్లే కాబట్టి తెలుగు నుంచి వేరే ఎవరినీ తీసుకోకుండా, హీరోయిన్‌ను మాత్రం హిందీ మార్కెట్ కోసం బాలీవుడ్ నుంచి తీసుకోవాలని ఆలోచించారట… ఇంట్రస్టింగ్ ప్రాజెక్టే…
Share this Article