.
Pardha Saradhi Upadrasta …… పింప్రి–చించ్వడ్ నుంచి మొదలైన మహారాష్ట్ర రాజకీయ భూకంపం
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పవార్ స్టైల్ రాజకీయాలు స్పష్టంగా బయటపడుతున్నాయి.
డిప్యూటీ సీఎం & NCP చీఫ్ Ajit Pawar పింప్రి–చించ్వడ్ మునిసిపల్ ఎన్నికల్లో Nationalist Congress Party (NCP), NCP (శరద్ చంద్ర పవార్ వర్గం) కలిసి పోటీ చేస్తాయని అధికారికంగా ప్రకటించారు.
🗳️ అజిత్ పవార్ ఏమన్నాడు?
ఎన్నికల ప్రచార సభలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం…
“అభ్యర్థుల జాబితా ఖరారు చేసే సమయంలో రెండు NCP వర్గాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం.. దీని వల్ల కుటుంబం మళ్లీ ఒక్కటవుతుంది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాలి. సీట్ల పంపకం త్వరలో ప్రకటిస్తాం…. ’’ అంటే… ఇది కేవలం స్థానిక ఎన్నికల నిర్ణయం కాదు పవార్ కుటుంబ రాజకీయ పునఃఏకీకరణకు స్పష్టమైన సంకేతం
Ads
🧠 పవార్ కుటుంబంలో పాత్రల విభజన
ఇప్పటి రాజకీయ పరిణామాలను గమనిస్తే
🔹 Sharad Pawar
రాష్ట్ర రాజకీయాల నుంచి క్రమంగా వెనక్కి “Kingmaker” పాత్రలోకి…
🔹 అజిత్ పవార్
మహారాష్ట్ర పాలన, పరిపాలన + అభివృద్ధి ఫోకస్…
🔹 Supriya Sule
జాతీయ రాజకీయాల ముఖచిత్రం, సాఫ్ట్ పవర్, డైలాగ్, కన్సెన్సస్ రాజకీయాలు…
అనిపిస్తున్నదేమిటంటే…
రాబోయే కాలంలో సుప్రియా సూలే మోదీ ప్రభుత్వంలో మంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఆకస్మికం కాదు… ఇది ప్లాన్ చేసిన పొలిటికల్ ట్రాన్సిషన్.
♟️ Sharad Pawar – “Master of the Flip”
శరద్ పవార్ రాజకీయ జీవితం ఒక్కసారి చూస్తే ఒక విషయం స్పష్టం. I Hate నుంచి I Love వరకు ఫ్లిప్ అవ్వడం ఆయనకు కొత్త కాదు.
🔸 ఒకప్పుడు బాల్ ఠాక్రేతో సిద్ధాంతపర పోరాటం చేసిన తరువాత ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాడితో పొత్తు అసాధ్యం అనిపించింది కానీ అదే పొత్తు 2.5 సంవత్సరాలు ప్రభుత్వం నడిపింది.
🔸 ఒక దశలో సోనియా గాంధీ & కాంగ్రెస్‌కు దూరం. మరో దశలో అదే కాంగ్రెస్‌తో ప్రభుత్వం.
ఇప్పుడు అజిత్ పవార్ వర్గంతో మునిసిపల్ కార్పొరేషన్లలో పొత్తులు, ప్రతిపక్షంలో ఆందోళన.
కుటుంబం పూర్తిగా కలిసిపోతే, రెండు వర్గాలు ఒక్కటైతే —ప్రతిపక్షానికి మిగిలేదేముంటుంది? ఇండి కూటమికి పెద్ద దెబ్బ. ఉద్ధవ్ సేన ఇప్పటికే బలహీనంగా ఉంది…
ఇప్పుడు వారి ఉనికే ప్రశ్నార్థకం. రేప్పొద్దున ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో ఉద్ధవ్ , రాజ్ పొత్తుకు పోయాక కూడా ఓడిపోతే ఇక పార్టీ మూసుకోవలసిందే.
🔮 NDA వైపు అడుగులా?
ఈ పరిణామాలపై శివసేన (షిందే వర్గం) మంత్రి Sanjay Shirsat వ్యాఖ్య…
“శరద్ పవార్ త్వరలో NDAలోకి రావడానికి ఇదే సూచన కావచ్చు. ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే ఇది ఆశ్చర్యకరం కాదు…” అంటే, ఇది కేవలం పింప్రి– చించ్వడ్ ఎన్నికల విషయం కాదు, మహారాష్ట్ర రాజకీయాల దిశ మారే సూచన.
🧩 పెద్ద జాతీయ సమీకరణ
మొదటిసారి అజిత్ పవార్ పార్టీని విడిచినప్పుడు చాలా ఈక్వేషన్లు పనిచేయలేదు, ఎక్కువ మంది అజిత్ వైపు వెళ్లకుండా శరద్ పవార్ నిలువరించాడు.
కానీ ఏడాది తిరగకముందే అదే అజిత్ పవార్ 90% పార్టీని తీసుకెళ్లి “పార్టీ నాదే, చిహ్నం నాదే” అని ఎన్నికల సంఘం ముందు నిరూపించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలంగా చూపించాడు. అప్పుడే ఈ కుటుంబ ఏకీకరణ ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి.
ఇది జాతీయ రాజకీయాల్లో కూడా పెద్ద మార్పులకు దారితీస్తుంది NDA లోకి శరద్ పవార్ వర్గం 8 లోక్‌సభ ఎంపీలు కలిస్తే NDA బలం 300 దాటుతుంది, అప్పుడు నితీష్, బాబు బయటకు వెళ్లినా ప్రభుత్వానికి ప్రమాదం ఉండదు.
బీజేపీ లేకుండా నితీష్ సీఎం కావడం అసాధ్యం అని బీహార్ ఎన్నికలే చూపించాయి , వాళ్ళు ఎక్కడకు పోరు అని తెలిసినా ఈ ఉత్తుత్తి బెదిరింపుల కార్యక్రమం కూడా ముగుస్తుంది.
చిన్నా చితకా పార్టీలు కావలసినప్పుడు కావలసిన మద్దతు ఇస్తూనే వున్నాయి. ఇది NDA కు పెరిగిన మద్దతుతో పాటు ఇండి కూటమికి ఒక పెద్ద దెబ్బ. ఇప్పుడు ఇండి కూటమికి ఇంకొక బలమైన నాయకుడు దూరం అయినట్లు అవుతుంది.
🧠 Bottom Line
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు.
శాశ్వతంగా ఉండేది అవకాశం, అధికారం, టైమింగ్.
పవార్ రాజకీయాలు అంటే —ఓపిక, లెక్క, చివరికి సరైన సమయములో అడుగు , ఆయన జీవితంలో ఒక ఇది చివరి జంప్ కావచ్చు….. — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #SharadPawar #AjitPawar #SupriyaSule #NCP #MaharashtraPolitics #PimpriChinchwad #MunicipalElections #NDA #IndianPolitics
Share this Article