చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, నల్గొండ శానంపూడి సైదిరెడ్డి, నాగర్‌కర్నూల్ పోతుగంటి భరత్ ప్రసాద్, మహబూబాబాద్ సీతారాంనాయక్, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజిగిరి పట్నం సునీతారెడ్డి, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, వరంగల్ ఆరూరి రమేష్…. వీళ్ల ఓటమిలో ఓ పోలిక ఉంది గమనించారా…? అని ఏకరువు పెట్టాడు ఓ మిత్రుడు…
వీళ్లందరూ పార్టీలు మారి, ఇన్‌స్టంట్‌గా టికెట్లు తెచ్చుకున్నవారే… వోటర్లు అందరినీ తిరస్కరించారు… వీళ్లకు మినహాయింపు కడియం కావ్య… బీఆర్ఎస్ టికెట్టు ఇచ్చినా సరే, వద్దని వాపస్ చేసి, కాంగ్రెస్‌లో చేరి, గెలిచిందామె… గుడ్… ఎలా పడితే అలా పార్టీలు మారతాం అని నాయకులు, ఎలా వస్తేనేం టికెట్లు ఇచ్చి నిలబెడతాం అనుకునే పార్టీలకు జనం భలే పాఠం చెప్పారు…
మరి ఈటల కూడా బయటి నుంచి వచ్చినవాడే కదా అంటారా..? ఆల్రెడీ రెండుచోట్ల ఓటమిపాలయ్యాడు… ఇన్‌స్టంట్‌గా ఈ ఎన్నికల ముందే జంపైనవాడు కాదు… సరే, ఒకటీరెండు మినహాయింపులు ఉంటే ఉండవచ్చుగాక… కానీ వోటర్లు మాత్రం తెలివిగానే వ్యవహరించారు… ఈ కారణమే గాకుండా ఓడించడానికి ఇంకా వేర్వేరు కారణాలు కూడా ఉండవచ్చు… ఐతే వీరందరిలో ఒకటే సామ్యం మాత్రం జంపిన వెంటనే టికెట్లు తెచ్చుకుని నిలబడటం, వోటర్లను తేలికగా తీసుకోవడం…
Ads
మెదక్‌లో ఏమైనా పొరపాటున బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనుకున్నారు… కానీ పొలిటిషియన్‌గా మారిన బీఆర్ఎస్ వీరవిధేయ బ్యూరోక్రాట్ వెంకట్రామారెడ్డిని మరీ వోటర్లు మూడో స్థానంలోకి తోసేశారు… ఏమాత్రం కనికరించలేదు వోటర్లు, విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టినా సరే..!
ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో ఉన్నారు… మిగతా అన్ని చోట్లా మూడో స్థానమే… కనీస పోటీ ఇవ్వలేకపోయారు… మొత్తంగా బీఆర్ఎస్‌కు పడిన వోట్లు జస్ట్, 16.68 శాతం (రాత్రి 10.11 గంటల వివరాలు) మాత్రమే… చాలా దారుణమైన వోటమి… చెరి ఎనిమిది సీట్లు గెలుచుకున్న బీజేపీ, కాంగ్రెస్ వోట్లలో మాత్రం తేడా బాగానే ఉంది…
బీజేపీ ఓవరాల్‌గా 35.08 శాతం వోట్లు పొందగా… కాంగ్రెస్ 40.10 శాతం వోట్లు పొందింది… అంటే పడ్డచోట్ల కాంగ్రెస్‌కు భారీగా వోట్లు పడ్డాయి, అదీ బీజేపీకన్నా ఎక్కువ వోట్ల శాతం రావడానికి కారణం… మరీ నల్గొండ వంటి చోట్ల 5.59 లక్షల మెజారిటీ అంటే మాటలు కాదు… ఖమ్మంలో కూడా 4.67 లక్షల మెజారిటీ… అంటే ఎంపీ ఎన్నికల్లో పోటీ కేవలం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే జరిగింది… బీఆర్ఎస్ నామమాత్రపు పోటీ ఇచ్చింది మెజారిటీ స్థానాల్లో… ఎలాంటి కారు..? ఎలా షెడ్డుకొచ్చేసింది ఫాఫం..!!
Share this Article