కొన్నిసార్లు ఈనాడు మనల్ని మెచ్చుకోకతప్పదు అనేట్టు వ్యవహరిస్తుంది… ఇదీ అంతే… సాధారణంగా ఆదివారం గానీ, పండుగలు గానీ పత్రికలు మూడ్ ఆఫ్ ది డే పరిగణనలోకి తీసుకుంటాయి… వీలైనంతవరకూ ఫస్ట్ పేజీలో రక్తపాతాలు, భీకర నేరాలు, క్షుద్రమైన రాజకీయ వార్తలు, ప్రత్యేకించి పెద్ద నేతల ప్రసంగాలను పరిహరిస్తాయి… అవి పొద్దున్నే పాఠకుడిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి… వాటి బదులు ఆఫ్ బీట్, లైఫ్ స్టైల్ స్టోరీలను ప్రత్యేకంగా సేకరించి, రాయించి పబ్లిష్ చేస్తాయి…
అది నిజానికి మంచి ధోరణి… కానీ తెలుగు పత్రికలకు ఇలాంటి సోయి ఎప్పటికీ రాదు కదా… గుడ్డెద్దు చేలో పడ్డ యవ్వారం… జీవితమంటే కేవలం రాజకీయాలే అన్నట్టుగా (అఫ్ కోర్స్, పత్రిక ప్రయోజనాలకు లింక్ కదా… పాఠకులకూ రుద్దుతారు)… వార్తలు వేస్తారు… నిజానికి మీడియా నుంచి మ్యాగ్జిమం తప్పించాల్సినవే రాజకీయ నాయకుల మీటింగులు, ప్రోగ్రాములు, వ్యాఖ్యలు, వివాదాలు… అది చేస్తే ప్రపంచంలో సగం శాంతి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది… మనుషుల మానసిక స్థితి కూడా పదిలంగా ఉంటుంది…
విషయానికి వస్తే… ఈనాడు తన తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లలో బ్యానర్ స్టోరీ… చైనాలో పీఆర్23 అనే వరివంగడాన్ని డెవలప్ చేశారు… ఒకసారి నాట్లేస్తే ఇక 8 పంటలు తీసుకోవచ్చుననేది స్టోరీ… అర్థం కాలేదా..? వరుసగా నాలుగేళ్లు మళ్లీ మళ్లీ నాట్లేయాల్సిన పనిలేదు… ఒకసారి కోసుకోవడం, తరువాత ఆ పిలకలపైనే మళ్లీ కొత్త మొలకలు… సూపర్ కదా… ఎంత పెట్టుబడి, ఎంత ప్రయాస తప్పుతుందో కదా… ఎకరానికి సగటున 27 క్వింటాళ్ల దిగుబడి అట…
Ads
నాట్ల ఖర్చు, దున్నకాల ఖర్చులో దాదాపు 60 శాతం ఆదా… తక్కువ నీరు, తక్కువ ఎరువులు… నిజానికి వరి అనగానే వియత్నాం, థాయ్‌లాండ్, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు గుర్తొస్తాయి… కానీ హఠాత్తుగా ఈ చైనా సంచలనం… ఆల్‌రెడీ రైతులకు వంగడాలు ఇచ్చి 40 వేల ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు… మన దేశంలో కూడా ఇలాంటి వంగడాల్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందో చెప్పాలని ఐసీఏఆర్ అన్ని వ్యవసాయ పరిశోధన సంస్థల్ని అడిగింది… రాజేంద్రనగర్‌లోని రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కూడా స్డడీ చేస్తోంది…
ఊరందరిదీ ఓ దారి అయితే, మన తెలంగాణ అగ్రివర్శిటీ రూటు వేరు కదా… దాని రీసెర్చ్ డైరెక్టర్ వింత ప్రశ్నల్ని ప్రస్తావించాడు ఈనాడు ఎదుట… సరే, ఈ స్టోరీ వేసినందుకు ఈనాడును అభినందిద్దాం… అయితే… మరి ఏపీ ఎడిషన్..? అక్కడ జగన్‌ను తిట్టడమే ప్రధానం… ప్రపంచం మునిగిపోతున్నా సరే, ముందుగా జగన్‌ను తిట్టడంతోనే రోజును ప్రారంభించాలనేది దాని సూత్రం… అందుకే ఈ వరి స్టోరీని ఎక్కడో అయిదో పేజీలో మమ అనిపించింది…!!
Share this Article