ఈసారి పద్మ అవార్డులు ప్రకటించారు… సినిమా రంగంలోని వాళ్లకు పెద్దగా పద్మ అవార్డులు ఏమీ లేవు… గ్లోబల్ గ్లోబ్ అవార్డు పొందిన కీరవాణికి ఇప్పుడు ఏపీ కేటగిరీలో పద్మశ్రీ కూడా వరించింది… శుక్రమహర్దశ జోరుగా నడుస్తున్నట్టుంది… ఎక్కువగా జానపద గేయాలు- కళలు, గిరిజన సేవ, ఆర్గానిక్ సేద్యం విభాగాల్లో పద్మశ్రీలు కనిపిస్తున్నాయి… మంచి ప్రాధాన్యమే… కొన్నేళ్లుగా జనం నుంచి అభిప్రాయాలు తీసుకుని మరీ ఈ పురస్కారాలకు ఎంపికలు చేస్తున్నారు కాబట్టి కాస్త క్వాలిటీ కనిపిస్తోంది…
విమర్శలు కూడా తక్కువే… ములాయంసింగ్ యాదవ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం చెప్పుకోదగింది… తను బతికి ఉన్నన్నాళ్లూ కాషాయ శిబిరానికి ప్రత్యర్థే… అయోధ్యలో వేల మంది కరసేవకుల మీద కాల్పులు, బీజేపీ ఎదగకుండా రాజకీయాలు గట్రా ఎన్ని ఉన్నా… అవేవీ పరిగణనలోకి తీసుకోకుండా తనకు రెండో అత్యుత్తమ పురస్కారాన్ని ప్రకటించడం బాగుంది… హుందాగా, సంస్కారయుతంగా ఉంది… అదే అవార్డు పొందిన ఎస్ఎంకృష్ణ బీజేపీలోనే ఉండటం కలిసి వచ్చినట్టుంది… జకీర్ హుసేన్ ఎంపిక కూడా సమంజసం…
కర్నాటకలో భైరప్పకు పద్మభూషణ్ ప్రకటించడం రియల్లీ ప్రశంసార్హం… ఎంతో ప్రభావవంతమైన రచయిత… అలాగే తమిళనాడు కేటగిరీ నుంచి వాణిజయరాం ఎంపిక కూడా సూపర్… అసలైన అర్హురాలు… సుధామూర్తి సోషల్ సర్వీసులో పద్మభూషణ్ పొందింది… పర్లేదు… బాగా నచ్చిన పురస్కారం ఏమిటంటే… పరుశురాం కొమజీ కునేకు పద్మశ్రీ… తను 5000 నాటక ప్రదర్శనల్లో ఏకంగా 800 పాత్రలు వేశాడు… మన పక్కనే గడ్చిరోలి వాళ్లది…
ఆశ్చర్యం అనిపించింది చినజియ్యర్ ఎంపిక… అనర్హుడు అనడం లేదు గానీ… రామానుజ విగ్రహావిష్కరణకు మోడీని పిలవడం, కేసీయార్ అభ్యంతరాలను పట్టించుకోకపోవడం, కొన్నాళ్లుగా కేసీయార్ క్యాంపుకి దూరంగా ఉండటం, కేసీయార్ తననుఅస్సలు సహించకపోవడం, యాదాద్రికి కూడా దూరంగా ఉంచడం నేపథ్యంలో జియ్యర్‌కు పద్మభూషణ్ ఇవ్వడం బీజేపీ టిపికల్ రాజకీయాలకు ఉదాహరణ… ఇది కేసీయార్‌ను సుతిమెత్తగా గోకడం అన్నమాట… కేసీయార్ ఏమీ అనలేడు… కడుపులో ఉక్రోషం మాత్రం గ్యారంటీ… (జియ్యర్ పుట్టుకతో ఆంధ్రుడైనా, తన కార్యస్థలి తెలంగాణ)…
ప్చ్, తరచూ వెళ్లి, కానుకలు సమర్పించి, ఆశీస్సులు పొంది రావడమే తప్ప జగన్ తన స్వరూపానందుడికి పద్మశ్రీ ఇప్పించలేకపోయాడు… ఒక దశలో తెలంగాణ రాజకీయాలను జియ్యరుడు, ఏపీ రాజకీయాలను స్వరూపుడు శాసించారు కదా… దూదేకుల ఖాదర్ వలీకి పద్మశ్రీ కూడా ఇంట్రస్టింగ్… కర్నాటక నుంచి..!
Ads
ORS సృష్టికర్త దిలీప్‌కు పద్మవిభూషణ్ కూడా సరైన నిర్ణయం, నిజానికి తను బతికి ఉన్నప్పుడే దక్కాల్సిన పురస్కారం ఇది… అండమాన్‌లో జరవ ఆదిమజాతి కోసం కష్టపడుతున్న రతన్ చంద్రకర్, 20 రూపాయల వైద్యుడు మునీశ్వర్ చందర్, నాగాలాండ్ హీరక మతాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న రామ్ కువాంగ్ బే, ఇరులా గిరిజన జాతికి చెందిన గ్లోబల్ స్నేక్ క్యాచర్స్ వడివేలు, సదయ్యన్, జలపాయ్‌గురికి చెందిన టోటో భాషాసంరక్షకుడు ధనీరాం, కువి-మంద-కుయి భాషల రక్షకుడు రామకృష్ణారెడ్డి, దారుశిల్పి అజయ్ కుమార్ మాండవి, కొడవ జాతిలో పుట్టిన జానపదగాయని రన్‌రేంసంగి (రష్మిక మంధన పుట్టిన వర్గం) ఎంపికలు మెచ్చదగినవి… మిగతావాళ్లు అనర్హులని కాదు…!!
Share this Article