అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
ఒకసారి తప్పుల్లేకుండా చదవడానికి ప్రయత్నించండి… అర్థాలు, తాత్పర్యాలు అక్కర్లేదు, ఉచ్ఛరణ దోషాలు లేకుండా చదవగలమా అనేది పరీక్ష… అబ్బే, మనకెందుకండీ ఈ పరీక్షలు అంటారా..? పోనీ, మన టీవీ న్యూస్ రీడర్లకు, డిబేట్ ప్రజెంటర్లకు, టీవీ యాంకర్లకూ ఈ పరీక్ష పెడితే ఎలా ఉంటుంది..?
నో డౌట్… ఒక్కరూ పాస్ కారు… మామూలు తెలుగు పదాల్నే పలకలేరు, ఇక దీన్ని మధ్య మధ్య తడుముకోకుండా, ఆగిపోకుండా అదే ఫ్లోలో తప్పుల్లేకుండా చదవడం కష్టం… సినిమాలు, టీవీల్లో నటులకు ఎలాగూ డబ్బింగ్ సౌకర్యం ఉంటుంది, అనేకసార్లు టేకులు తినే అవకాశమూ ఉంటుంది… కానీ లైవ్‌లో వార్తలు చదివేవారికి..? పోనీ, రిహార్సళ్లు, ఎడిటింగులూ ఉండే టీవీ ప్రోగ్రామ్స్ యాంకర్లకు..?
Ads
ఇప్పుడీ ప్రస్తావన అంతా ఎందుకంటే..? ఈటీవీ ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజైంది… ఎప్పటిలాగే ఏవేవో చెత్తా స్కిట్ల పరిచయం ఉంది, కానీ ఒక్కటి మాత్రం ఆకట్టుకుంది… ఆసక్తికరం అనిపించింది… అఫ్‌కోర్స్, రష్మి తెలుగు భాష మీద కొన్ని వందల స్కిట్లు, ఎపిసోడ్లు చేసి ఉంటారు, ఇదీ అదే… కానీ కమెడియన్ రోహిణి ఈ పద్యాన్ని చదివిన తీరు బాగుంది… ఏమో, బాగానే రిహార్సల్ చేసి ఉండవచ్చుగాక…
బోర్డుపై ఇది రాసి ఉంటుంది, రోహిణి టీచర్… రష్మిని పిలిచి ముందుగా దీన్ని గబగబా చదివేస్తుంది, నువ్వు చదువు అంటుంది… ఆమె నీకో దండం తల్లీ అన్నట్టుగా వెళ్లిపోతుంది, రోహిణి ఆమెను మళ్లీ పిలిచి కనీసం ఒక్క వాక్యం చదువు అనడుగుతుంది… ఎప్పటిలాగే రష్మి చదవలేకపోతుంది… ఆమె తెలుగు రష్మి కాబట్టి చదవలేదు అనుకుందాం… తెలుగు యాంకర్లు, నటులు, రీడర్లలో ఎందరు చదవగలరనేది ఇక్కడ ప్రశ్న…
రోహిణి మంచి టైమింగ్ ఉన్న నటి… ఏమైనా ప్రాబ్లమో, కావాలనే ఆ బరువు మెయింటెయిన్ చేస్తుందో, అధిక బరువు కూడా అవకాశాలు తెచ్చిపెడుతందిలే అనే భావనో గానీ… తెరపై నిండుగా కనిపిస్తుంది… మొన్నామధ్య ఆహా ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో పాల్గొన్న ఏకైక లేడీ కమెడియన్… ఇప్పుడు జబర్దస్త్‌లోకి వచ్చింది… అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో కూడా కనిపిస్తోంది… అవును గానీ, తెలుగు మహిళ కాకపోయినా, ధారాళంగా తెలుగును ప్రవహింపజేసే నంబర్ వన్ యాంకర్ సుమ లేదా అనసూయతో ఈ పద్యం చదివిపిస్తే ఎలా ఉంటుంది ఎవరైనా..?! పోనీ, టీవీ9 రుధిరధారతోనైనా సరే..!
Share this Article