…….. ఆర్గానిక్ బియ్యం కిలో 600 ( నల్లబియ్యం) రూపాయలుట… అలాగే ఆర్గానిక్ ఆవు నెయ్యి కిలో 3000 రూపాయలంట… ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నానో అనేలా గర్వంగా వాటి ఖరీదు చెప్పి వాటినే వాడుతున్నాను అని చెప్పాడు మిత్రుడు… ఎందుకంత ఖరీదు అని అడిగితే అందులో పెస్టిసైడ్స్ వేయరు, వీడీసైడ్స్ వేయరు, ఎరువులు వేయరు అన్నాడు… ఆర్టిఫిసియల్ ప్రిసర్వేటివ్స్ కూడా వాడరు తెలుసా.. పూర్తి సహజ సిద్ధంగా పండిస్తారు… అన్నాడు…
అవేమీ వేయకపోతే ధర తగ్గాలి కానీ పెరిగిందేమిటని అడిగాను… వాటి టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి ఆ టేస్టు కోసమైనా వాటికి అంతటి ధర పలుకుతుందని చెప్పాడు… నాలిక మీద పెట్టుకుంటే అమృతంలాగా ఉంటుందని చెప్పాడు… ఆర్గానిక్ మామిడి పండు కిలో ఆరు వందల రూపాయలు ఎప్పుడైనా తిన్నారా “అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా…” అని నాలిక మిటకరించాడు..?
కరోనా కాలం నుండీ ఆర్గానిక్ ఫుడ్స్ తినడం వల్లే తమకు కరోనా రాలేదని బలంగా నమ్మినట్టు కనిపించాడు… తమలో అద్భుతమైన ఇమ్యూనిటీ డెవెలప్ ఐందని, తామందరమూ ఎంతో ఆరోగ్యంగా ప్రకృతికి దగ్గరగా బ్రతుకుతున్నామ,నీ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నప్పటి నుండి గాలి పీలుస్తుంటే కూడా ఫ్రెష్ గా ఫీలౌతున్నామని చెప్పాడు… తమలాంటి వారెందరో ఉన్నారనీ, అందరికీ ఆర్గానిక్ ఫుడ్స్ గొప్పతనం తెలిసిందనీ, మీరూ వాడండని సలహా ఇచ్చాడు…
Ads
మార్కెట్ లో తక్కువ రేటుకు అని అమ్మేవన్నీ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అనీ.. ఆ టమాటాలూ, బెండకాయలూ తింటే ఆ ఫుడ్స్ లో ఉండే జీన్స్ మన శరీరంలోకి పాకి మన జీన్స్ ని కూడా కలుషితం చేస్తాయనీ చెప్పాడు… చాలా ఆనందంగా ఉత్సాహంగా కనిపించాడు. మాస్ హిస్టీరియా అనాలో, మాస్ రీథింకింగ్ అనాలో, మాస్ వాట్సాప్ గ్రాడ్యుయేషన్ అనాలో అర్థం కాలేదు… సాంప్రదాయకంగా పంటలు పండించే బీద రైతులకు ఈ నయా హిస్టీరియా నుంచి దూరంగా కనీస మద్ధతు ధర లభించాలని కోరుకుందాం…
ఇదీ ‘‘విరించి విరివింటి’’ ఫేస్ బుక్ పోస్టు… చాలా బాగుంది, ఓ ఇంపార్టెంట్ ప్రశ్నను సమాజానికి వేసినట్టుగా ఉంది… ఏ పురుగు మందులు, ఎరువుల ఖర్చు లేనప్పుడు ధర తగ్గాలి కానీ పెరగడం ఏమిటి… అనేది ఆ ప్రశ్న… సరే, దిగుబడి తగ్గుతుంది కాబట్టి కాస్త ధర ఎక్కువ పెట్టడమే బెటర్ అనేది ఓ సమర్థన… కానీ అది ఎంత మేరకు..?
మరీ కిలో బియ్యం 600 రూపాయలా..? ఆవు నెయ్యి 3 వేలా..? సరే, ఆర్గానిక్ ఫుడ్‌తో ఆయుష్షును ఎన్నేళ్లు పొడిగించుకోగలరు..? ఏ కరోనాయో కొడితే ఇవన్నీ ఢాం డుష్… ఏమీ పనిచేయవు… ఓ సంప్రదాయిక సాంబారు, రసం చేసినంత ప్రయోజనం కూడా ఈ ఫుడ్ వల్ల ఉండదు… వోకే, ఆర్గానిక్ మంచిదే… కానీ నిజంగా మనం ప్యూర్ ఆర్గానిక్ పంథాకు పరిమితమై బతుకుతున్నామా..? సాధ్యమేనా..?
దేశదేశాల నుంచి మనకు దిగుమతై వస్తున్న ఆయిల్స్ కథేమిటి..? ఫ్లేక్స్ మాటేమిటి..? జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ కాదా..? అవి సేఫేనా…? మన దేశంలోనే అనధికారికంగా పండిస్తున్న జీఎం వంకాయలు, ఆముదం గట్రా మాటేమిటి..? ఇంపోర్ట్ చేసుకునే పప్పుల కథేమిటి..? ఇంకా పలురకాల కూరగాయలు, ఆకుకూరల మాటేమిటి..? అంతెందుకు..? మూసీ నీళ్లతో పడించే కూరగాయల్లోని విష రసాయన అవశేషాల మాటేమిటి..? మేక, కోడి, చేప… అన్నీ రసాయన ప్రభావితాలే కదా… లాస్ట్, బట్ నాట్ లీస్ట్… మనం పీల్చే గాలి..? ఐనా సరే, ఆర్గానిక్ ఈజ్ గుడ్… నో డౌట్… కానీ ధనికులకు మాత్రమేనా ఆ ఆరోగ్య సౌభాగ్యం..?!
Share this Article