శరత్ కుమార్ చింత……… డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. కెరీర్ లో ఎన్నో హిట్లు, ప్లాపులు చూసిన దర్శకుడు.. ఇప్పుడు లైగర్ అనే ఒకే ఒక్క సినిమా డిజాస్టర్ తో ఎప్పుడు లేనంత నెగెటివిటీని ఫేస్ చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియర్ల మీద పోలీస్ కేసు దాకా వెళ్లడం, విషయాన్నీ ఇంతదాకా తీసుకొచ్చినందుకు ఇకపై అతని సినిమాలు కొనకుండా బ్యాన్ చేయాలని డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయంతో వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయింది.
ఒకపక్క లైగర్ కాంట్రావర్సీలు, జనగణమన సినిమా ఆగిపోవడం, ఈ స్థితిలో మిగతా హీరోలెవరూ పూరీతో సినిమా చేయడానికి ముందుకు రారు, కొడుకు ఆకాష్ ఇంకా సెటిల్ కాకపోవడం, పూరి పర్సనల్ లైఫ్ గురించి బయట రకరకాల కామెంట్లు వినిపించడం ఇలా ఒక పద్మవ్యూహంలో ఉన్నాడు ఈ కల్ట్ డైరెక్టర్. లైగర్ రిలీజ్ ముందు వరకు పూరితో కనిపించిన కో-ప్రొడ్యూసర్ ఛార్మి పూరి ఒక్కడే బాధ్యుడిగా ఇబ్బందులు పడుతుంటే, ఇంత జరగుతున్నా తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకప్పుడు హీరోలను స్టార్లుగా మార్చే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడికి ఈ పరిస్థితి రావడం ఫ్యాన్స్ కి బాధ కలిగించేదే. కింద పడేది లేచేందుకే అనే సూత్రాన్ని బలంగా నమ్మే పూరి గట్టిగా తలుచుకుని తనలో రచయితకు దర్శకుడికి సరైన పని కల్పిస్తే బౌన్స్ బ్యాక్ అవ్వడం ఎంతసేపు. దానికోసమే అందరూ వెయిటింగ్.
ఇంతకీ తను ఏమని చెప్పుకుంటున్నాడంటే… వేదాంతం, వైరాగ్యం, విరక్తి, స్థితప్రజ్ఞత అన్నీ ఆ నోట్‌లో కనిపిస్తున్నయ్… అదేమిటో మీరే చదవండి… ఎంతమేరకు తనతో ఏకీభవిస్తారో మీ ఇష్టం… సక్సెస్ బుర్రలో గిర్రున తిరుగుతూ, మబ్బుల్లో ఉన్నప్పుడు ఏమీ కనిపించకుండా… నేల మీద నడుస్తున్నప్పుడు మాత్రమే నీతులు, లెక్కలు గుర్తుకురావడం ఏమిటీ అంటారా..? పోనీ, ఆ సోయి రావడం, అవగాహనకు తెచ్చుకోవడం, వ్యక్తీకరించడం కూడా గ్రేటే కదా….
Ads
(గతంలో ఇలాంటివి జరిగినప్పుడు సినిమా పెద్దలు ఎవరో కూర్చుని అమికబుల్ సొల్యూషన్‌తో ఇష్యూ సెటిల్ చేసేవాళ్లు… కృష్ణ వంటి హీరోలు అయితే ఫ్రీగా సినిమా చేసేవాళ్లు… నిజానికి బయ్యర్లను ఎవరు అంతలేసి రేట్లకు కొనమన్నారు..? బేరం ఇది… నష్టపోతే ఎవరినో బాధ్యుడిని చేసి, నువ్వు పరిహారం చెల్లించు అనడం ఏమిటి..? తనేమైనా అగ్రిమెంట్లు రాసిచ్చాడా సినిమా హిట్ అవుతుందని..? వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ తరువాత కూడా విజయ్ మీద అంత నమ్మకం పెంచుకోవడం బయ్యర్ల తప్పు కాదా..? సో కాల్డ్ సినిమా పెద్ద నిర్మాతలు, దర్శకులు పూరికి సపోర్టుగా ఎందుకు నిలవడం లేదు..? అన్నీ ప్రశ్నలే…)
Share this Article