తెలుగు టీవీ అంటేనే… యాంకర్ల లవ్వాయణాలు…! కామెడీ, మ్యూజిక్, డాన్స్… షో ఏదైనా సరే, ఈ లవ్ షోలు ఉండాల్సిందే… ఇది మనం చెప్పుకున్నదే కదా… అయితే తాజాగా ఈటీవీ జబర్దస్త్ షోలో ఓ సీన్ విస్మయాన్ని కలిగించింది… యాంకర్ రష్మి ఇమాన్యుయేల్ అనే కమెడియన్‌పై చెప్పుతీసింది… కొట్టడానికి కాదు, ఓ ఝలక్… ఓ హెచ్చరిక… అడ్వాంటేజ్ తీసుకోవద్దని చెప్పడానికి…! ఎందుకొచ్చింది ఈ పరిస్థితి..? ఏదో స్కిట్ చేస్తూ ఇమాన్యుయేల్ గుడ్డోడిగా నటిస్తూ చేతులు ముందుకుజాపి రష్మి వైపు వచ్చాడు… అదుగో అప్పుడు తీసింది ఆమె చెప్పు…
చూడటానికి నిజానికి ఇది సరదాగా, చిన్న కనిపించవచ్చుగాక… కానీ రష్మి చర్యలో చాలా అర్థముంది… ‘‘మీ స్కిట్లేవో మీరు చేసుకొండి, మీ వేషాలేవో మీరు పడండి… అంతేతప్ప మమ్మల్ని లాగకండి…’’ అన్నట్టుగా…! అసలు ఆ స్కిట్లు చూస్తుంటేనే ఎవరికీ నవ్వు రావడం లేదిప్పుడు… కానీ డబ్బు తీసుకుంటున్నందుకు నవ్వు రాకపోయినా తెగ నవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అనసూయ, రష్మి… ఫాఫం, భీకరంగా నవ్వులు వినిపించిన శ్రీముఖి పుణ్యమాని జీటీవీలో అదిరింది షోయే ఆగిపోయింది… ఇదే ఇమాన్యుయేల్, వర్ష ట్రాక్ ఒకవైపు సాగుతూనే ఉంది… అదేదో షోలో మళ్లీ రవి-లాస్య స్నేహం పునరుద్ధరించబడింది… పోవేపోరా కథలు సరేసరి… రవి-వింధ్య సంగతి తెలియదు…
Ads
ప్రతి కమెడియనూ యాంకర్‌ను గోకడానికి ట్రై చేసేవాడే… ఒకసారి అనసూయ ఎదుట హైపర్ ఆది దేబిరింపులు గుర్తుతెచ్చుకొండి… అసలు స్కిట్లు ఎప్పుడో లైఫ్ కోల్పోయాయి… ఈ తిక్క వ్యవహారాలు ఎక్కువ హైలైట్ అవుతున్నాయి… వోకే, రష్మి-సుధీర్ జంట పాపులర్ అయ్యిందంటే… అలా నటించడంలో వాళ్లు జీవిస్తున్నారు ఎనిమిదేళ్లుగా…! ఆమెకు పెళ్లయ్యింది… వేదిక మీద సుధీర్ కూడా ఎప్పుడూ ఓ గీతను దాటడు… చివరకు డాన్సులు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడపడితేఅక్కడ తాకడం వంటి వెకిలి చర్యలుండవ్…
ఢీలోనూ ఇదే కొనసాగిస్తుంటారు… ఇది చూసి ఒక రకరకాల లవ్ ట్రాకులు మొదలుపెట్టించారు… చివరకు మ్యూజిక్ షో సరిగమపకూ పాకింది అది… సింగర్ హారికతో ప్రదీప్‌కు ట్రాక్ పెట్టారు… ఢీ షోకు కాపీగా వచ్చిన డాన్స్ ప్లస్‌లో మోనాల్, యశ్ ట్రాకు స్టార్ట్ చేశారు… ఢీలో కూడా వర్షిణిని వెళ్లగొట్టారు కదా, హైపర్ ఆదికి ట్రాక్ లేకుండా పోయింది… కొత్తగా వచ్చిన దీపిక పిల్లి నేనందరికీ చెల్లిని అని ముందే అల్టిమేటమ్ ఇచ్చింది… ఈ తొక్కలో షో ఉంటే ఎంత..? పోతే ఎంత..? అన్నట్టుగా ఉంది ఆమె బాడీ లాంగ్వేజీ…
మరెలా అనుకుని ఇక ఏకంగా జడ్జి స్థానంలో ఉన్న ప్రియమణికీ ఆదికీ లింకులు పెట్టేశారు, ప్రోగ్రామ్ నిర్మాతలు… ప్రదీప్, పూర్ణ సరేసరి… తప్పేదేముంది..? డబ్బులిచ్చినవాడు ఏది చెబితే అది చేయాలి, నటనేగా…! చివరకు మొన్న ఏదో ఎపిసోడ్లో రమణమ్మ అనే ఓ ముసలావిడతో ‘ఆదికి హగ్గు ఇవ్వు ప్రియా’ అంటూ దేబిరింపు డైలాగులు చెప్పించారు… అదేమాట యాంకర్ ప్రదీప్తోనూ అనిపించారు… మరీ ‘‘బాబ్బాబు’’ అని అడుక్కుంటున్నట్టుగా ఉందీ అని…! పరాకాష్ట ఏమిటంటే..? అదే రమణమ్మతో శేఖర్ మాస్టర్‌కు ఐలవ్యూ చెప్పించడం… క్రమేపీ ఈ టీవీ రియాలిటీ షోలలో అసలు సరుకుకన్నా ఈ మసాలాలు ఎక్కువై, ‘‘అతి’’ ప్రదర్శిస్తున్నయ్…!! ఏమాటకామాట… ఇదే ఇమాన్యుయేల్ కలర్‌ను పదే పదే కించపరుస్తూ రోజా మొహమంతా అసహ్యంగా పెట్టేసి, చేసే వ్యాఖ్యలు కూడా చీప్…!!
Share this Article