ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది… పలు దేశాల్లో పలురకాల డెమోక్రసీలున్నయ్… కానీ మనది బహుళ పార్టీ వ్యవస్థ… అంటే ప్రజల ఎదుట పరిమిత ఆప్షన్స్ గాకుండా ఎక్కువ ఆప్షన్స్ ఉంటయ్… ఈ దేశపు అత్యున్నత ప్రధాని పీఠం ఎక్కాలనే కోరిక ఉన్న నాయకులు కోకొల్లలు… కెపాసిటీ అనేది మరిచిపొండి, కొన్నిసార్లు నంబర్లాటలో తగిలినా తగలొచ్చు లాటరీ… దేవెగౌడ, చంద్రశేఖర్, గుజ్రాల్… వీళ్లంతా ఆ గజమాల అనుకోకుండా మెడలో పడిన ప్రధానులే కదా… ఏదో ఓ రాష్ట్రంలో బలంగా ఉన్న స్థితిని బట్టి లెక్కేస్తే మన దేశంలో కనీసం 18 పార్టీలను పరిగణనలోకి తీసుకోవచ్చు… మిగతావి తూచ్… ఇప్పుడు యశ్వంత్ సిన్హా, శరద్ పవార్ ఎట్సెట్రా కొత్త అతుకుల బొంతను కుట్టే పనిలోపడ్డారు కదా… అందుకే మన ప్రజలు ఏ నాయకుడిని ప్రధానిగా అంగీకరిస్తున్నారు అనే ప్రశ్న మళ్లీ చర్చనీయాంశమైంది… ఈమధ్య ఇన్స్టంట్ సర్వేలు వచ్చి పడ్డయ్ కదా… దిప్రింట్ అనే న్యూస్సైటుకు ప్రశ్నం అనే ఓ ఆన్లైన్ సంస్థ ఎప్పటికప్పుడు పలు అంశాలపై సర్వే చేసి ఇస్తుంటుంది… శరద్ పవార్ కొత్త దుకాణం ఏర్పాట్ల నేపథ్యంలో అర్జెంటుగా ఈ ప్రశ్నం ఓ సర్వే చేసింది… అందులో మనకు కావల్సిన ప్రధాని ఎవరు..? అనేదే ప్రశ్న…
మనది పేరుకు పార్టీస్వామ్యం… అధ్యక్ష ప్రజాస్వామ్యం కాదు… కానీ వ్యక్తుల ప్రభావం చాలా ఎక్కువ… నెహ్రూ, ఇందిర… తరువాత మోడీ… వాళ్ల ఇమేజీ పార్టీకి ఉపయోగకరం… మరి ఇప్పుడు ఏ నాయకులకు ప్రజల యాక్సెప్టెన్సీ లెవల్ ఎంతమేరకు ఉంది..? ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఓ కొత్త ప్రశ్న ఏమిటి..? ‘‘మోడీ కాకపోతే ఎవరు..?’’ అసలు ఎవరైనా ప్రాంతీయ నాయకుడు రాష్ట్రాల సరిహద్దుల్ని బ్రేక్ చేసి, ఓ జాతీయ హీరోగా కనిపిస్తున్నాడా ఇప్పుడు..? ప్రశ్నం సంస్థ 12 పెద్ద రాష్ట్రాల్లో, అంటే యూపీ, మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్నాటక, గుజరాత్, రాజస్థాన్, కేరళ, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 397 ఎంపీ నియోజకవర్గాలు, 2309 అసెంబ్లీ నియోజకవర్గాలు కవరయ్యేలా 20 వేల మందితో ఓ సర్వే చేసింది… ఇలాంటి సర్వేలు నిజంగా ప్రజాభిప్రాయాన్ని పట్టిచూపిస్తాయా అనేది క్వశ్చన్ మార్కే, కానీ రఫ్‌గా ట్రెండ్ చెబుతాయి… ఇదీ ఆ సర్వే ఫలితం…
Ads
మోడీ సహజంగానే బెటర్ చాయిస్‌గా మరోసారి కనిపిస్తున్నాడు… 33 శాతం వరకూ ప్రజలు మోడీకే జై అంటున్నారు ఇప్పటికీ… నోట్ల రద్దు నుంచి కరోనా ఫెయిల్యూర్ల దాకా ఎన్నెన్ని మరకలున్నా సరే.., వేరే సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం మోడీకి ఇలా అనుకూలిస్తుంది అనుకోవాలా..? మెచ్యూరిటీ లెవల్స్‌లో నానాటికీ దిగదుడుపు అనిపించుకున్నా సరే, రాహుల్ గాంధీకి 17 శాతం ప్రజలు సై అంటున్నారు… విశేషమే… సో, మోడీకి సమీప ప్రత్యర్థి రాహుల్ గాంధీ మాత్రమే… కానీ ఈ పీకేలు, పవార్లు, యశ్వంతులు రాహుల్‌ను పక్కకుతోసేసి, కొత్త మొహాల్ని ప్రజల ఎదుట నిలబెట్టే విఫలప్రయత్నాలు చేస్తున్నారు… విచిత్రం ఏమిటంటే… నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ లీడర్లందరూ కలిసి కూడా రాహుల్ సంపాదించిన యాక్సెప్టెన్సీ లెవల్ సాధించలేదు…
మొన్నటి బెంగాల్ విజయం తరువాత మమత రేంజ్ కాస్త పెరిగింది… సో, ఆమెకు 7 శాతం మద్దతు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు… కానీ ఆమెకు దీటుగా కనిపిస్తున్న లీడర్ యోగి… ఆరు శాతం… విశేషమే… ఇక మిగతా వాళ్ల స్థానాలేమిటో ఈ చార్ట్ చెబుతోంది… ఫెడరల్ ఫ్రంట్ పెడతాడు మా సారు, ప్రధాని అవుతాడు, ఢిల్లీలో గత్తర లేపుతాడు అని టీఆర్ఎస్ గప్పాలు కొట్టుకుంది కదా అప్పట్లో… కేసీయార్ యాక్సెప్టెన్సీ రేంజ్ కేవలం 0.7 శాతం… జగన్ పేరు అసలు లిస్టులోనే లేదు… ఏపీలో వోటర్లు కొందరిని ఎంపిక చేసి ఉంటే తనకూ ఎంతోకొంత శాతం మద్దతు లెక్కలోకి వచ్చేదేమో… నేను ప్రధాని అవుతాను అని కలలు కంటున్న శరద్ పవార్ ఒక శాతం మద్దతు కూడా సంపాదించలేదు… గతంలో అయితే మాయావతి, ఫరూఖ్ అబ్దుల్లా, చంద్రబాబు, లాలూ ప్రసాద్, దేవెగౌడ తదితరుల పేర్లు జాబితాలో కనిపించేవేమో… ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో వాళ్లు అప్రస్తుత నాయకులు అయిపోనట్టున్నారు… ప్రత్యేకించి చంద్రబాబు ఇమేజీ దారుణంగా కోల్పోయి, మరీ సోదిలోకి లేకుండా పోవడం తెలుగు ప్రజలకు ఆసక్తికరంగా కనిపించే అంశం..!!
Share this Article