.
— దేశంలో అత్యంత సీనియర్ సీఎంగా చంద్రబాబు.
సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడంతో, ఇప్పుడు చంద్రబాబు గారు (75) భారతదేశంలో అత్యంత ఎక్కువ వయస్సు గల ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన అత్యంత సీనియర్ ముఖ్యమంత్రుల్లో ఒకరు కూడా. . ఆయన అనుభవం, పరిపాలన, పట్టుదల, జాతీయ స్థాయి రాజకీయ సంబంధాలు ఇప్పటికీ టిడిపి , NDAకి ప్రధాన బలం. కానీ రాజకీయాల్లో ఒక దశ తర్వాత “ఈ నాయకుడి తర్వాత ఎవరు?” అనే చర్చ సహజంగానే మొదలవుతుంది. గత 2, 3 ఏళ్లుగా అదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వినిపిస్తోంది. ఇది కేవలం వయస్సు గురించి కాదు; సరైన సమయంలో నాయకత్వ మార్పును ఎలా నిర్వహించాలి అన్నది కూడా ఒక వ్యూహాత్మక అంశం.
Ads
— మహానాడు సంకేతాలు ఏమి చెబుతున్నాయి?
PR క్యాంపెయిన్ల వెనుక పెద్ద రాజకీయ సందేశమా? ఈసారి మహానాడులో కనిపించిన యువ నాయకత్వ ప్రొజెక్షన్, భవిష్యత్ విజన్ ప్రజెంటేషన్లు, సోషల్ మీడియా నేరేటివ్ లు, all these are giving signals that TDP is slowly preparing for a generational shift. ఇలాంటి మార్పులు ఒక్కసారిగా జరగవు. ముందుగా ప్రజల్లో కొత్త నాయకత్వంపై అంగీకారం పెంచుతారు. తర్వాత cadre లో psychological acceptance build చేస్తారు. చివరగా పొత్తులో ఉండే పార్టీలకి కూడా భవిష్యత్ అధికార నిర్మాణముపై indirect signals ఇస్తారు. ప్రస్తుతం టిడిపిలో ఇదే ప్రక్రియ ప్రారంభ దశలో ఉందనే అభిప్రాయం బలపడుతోంది.
— అసలు కీలకం — పవన్ కళ్యాణ్ పాత్ర
కూటమి సమీకరణాలు మారుతాయా ? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఫ్యాక్టర్. 2024లో NDA విజయంలో చంద్రబాబు గారి governance image ఎంత ముఖ్యమో, పవన్ కళ్యాణ్ గారి emotional mobilisation , anti-YSRCP consolidation కూడా అంతే ముఖ్యమైంది. అందుకే 2029కు ముందే టిడిపిలో పూర్తి స్థాయి నాయకత్వ మార్పు జరిగితే జనసేన దానిని ఎలా స్వీకరిస్తుంది అన్నది పెద్ద ప్రశ్నగా మారుతోంది.
వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని గౌరవిస్తారు. కానీ రాజకీయంగా జనసేన క్యాడర్ భవిష్యత్తులో తమ పార్టీకి మరింత అధికార భాగం రావాలని ఆశించడం సహజం. అలాంటి పరిస్థితిలో నాయకత్వ మార్పు జరిగితే సీట్ల పంపకం, మంత్రివర్గ కూర్పు – వంటి అంశాలు మళ్లీ చర్చకు రావచ్చు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం pavan గౌరవంగా సర్దుకు పోవచ్చు కానీ, నాయకత్వ మార్పు జరిగితే అధికారంలో ఇంకా పెద్ద భాగం కావాలి అని అడిగే అవకాశం.ఉంది. నాయకుడు సర్దుకునే ప్రయత్నం చేసినా పార్టీ క్యాడర్ ఊరుకుంటుందా అనేది చర్చనీయాంశమే
— NDA దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు కీలకం?
BJP stability politics ను ప్రాధాన్యంగా చూస్తుందా? నరేంద్ర మోదీ , అమిత్ షా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేవలం ఒక రాష్ట్రం కాదు. ఇది దక్షిణ భారత రాజకీయ విస్తరణలో strategic state. YSRCP decline తర్వాత ఏర్పడిన NDA ecosystem ను stable గా ఉంచటం BJPకి కూడా ముఖ్యమైన లక్ష్యం.
అందుకే BJP sudden leadership experiment కంటే gradual transition ను prefer చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమిలో instability లేదా uncertainty రావటం NDAకి 2029 ముందు అవసరం లేని రిస్క్ అవుతుంది.
— KCR ఉదాహరణ ఇప్పుడు టిడిపిలో చర్చ అవుతుందా?
“అధికారంలో ఉన్నప్పుడే వారసత్వ మార్పు చేయాలా?” అనే ప్రశ్న తెలంగాణలో కేసీఆర్ రాజకీయ ప్రయాణాన్ని ఇప్పుడు చాలామంది ఒక case study లా చూస్తున్నారు. KTR ను ప్రజల్లో బలంగా project చేసినా, పూర్తి స్థాయి administrative transfer ఆలస్యమైందనే విశ్లేషణ వినిపిస్తోంది. Anti-incumbency peak కు చేరుకునేలోపు పూర్తి transition జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయింది.
ఇదే ఉదాహరణ ఇప్పుడు టిడిపిలో కూడా అంతర్మథనం అయ్యే అవకాశం ఉంది. “దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి” అనే రాజకీయ ఆలోచనను చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా పరిశీలిస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
— చంద్రబాబు గారి శైలి ఏమిటి?
Sudden transition కంటే phased transition వైపేనా? చంద్రబాబు గారి రాజకీయ శైలి చూస్తే ఆయన హఠాత్ నిర్ణయాల కంటే phased transition ను ఎక్కువగా ఇష్టపడే నాయకుడు. అందుకే ఒకేసారి ముఖ్యమంత్రి మార్పు కంటే, party operations, organisational control, administrative responsibilities ను దశలవారీగా తర్వాతి తరానికి అప్పగించే hybrid model వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు పాలనలో, పార్టీలో అంతర్గతంగా జరిగిపోయాయి అనే వార్తలు. కార్యనిర్వహక అధ్యక్షత పదవి సృష్టి, పార్టీ రాష్ట్ర, స్థాయి నాయకత్వంలో మార్పులు ఇవన్నీ దాని వైపు చూపుతున్నాయి.
అంటే: అధికారికంగా చంద్రబాబు గారే NDA ముఖచిత్రంగా కొనసాగడం, సమాంతరంగా భవిష్యత్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం. క్యాడర్ కు ఆశ్చర్యం ఇవ్వకుండా gradual acceptance build చేయడం. పొత్తు పార్టీలకు అభద్రత కలిగించకుండా balance maintain చేయడం. ఈ model రాజకీయంగా safest option గా కనిపిస్తోంది. అందుకే లోకేష్ కూడా వీలు చిక్కినప్పుడల్లా పవన్ ను భుజాల మీద వేసుకొని తిరగటం, పవన్ అన్న లేనిదే మనం లేము అనే మాటలు మాట్లాడటం, చిన్న చిన్నవి ఉంటే సర్దుకుపోదాం అనే సంకేతాలు ఇస్తున్నాడు, కానీ అసలు పరిస్థితి వచ్చే సమయానికి ఎవరు ఎలా స్పందిస్తారో రాజకీయాల్లో చెప్పటం కష్టం.
—2029 ముందు మార్పా? లేక 2029 తర్వాతా?
టిడిపి ముందున్న అసలు dilemma, ఇప్పుడు టిడిపి ముందున్న ప్రధాన ప్రశ్న ఇదే:
Option 1: 2029 వరకు చంద్రబాబు గారే పూర్తి స్థాయి ముఖచిత్రంగా కొనసాగడం. అంతర్గతంగా భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయటం.
ఇది stability ఇస్తుంది. కూటమి chemistry అలాగే ఉంటుంది. కానీ అప్పటికి బాబు గారికి 78 నిండుతాయి.
Option 2: 2027-28 నుంచే కొత్త నాయకత్వాన్ని పూర్తిగా project చేయడం.
ఇది long-term succession advantage ఇస్తుంది. కానీ చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం.
Option 3: Hybrid model — చంద్రబాబు గారే ప్రధాన ముఖచిత్రంగా కొనసాగుతూ, తర్వాతి తరానికి operational control , political visibility పెంచడం.
ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ సంకేతాలు చూస్తే మూడో మోడల్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Interesting Times Ahead in AP Politics
రాజకీయాల్లో ఒక్క ఎన్నిక, ఒక్క ఆరోగ్య పరిస్థితి, ఒక్క జాతీయ పరిణామం మొత్తం సమీకరణాలను మార్చేస్తాయి. అందుకే ప్రస్తుతం బయటకు కనిపిస్తున్న ప్రశాంతత వెనుక ఆంధ్రా రాజకీయాల్లో ఒక పెద్ద succession chessboard నెమ్మదిగా కదులుతోందనే భావన స్పష్టంగా కనిపిస్తోంది.
2026 నుంచి 2029 వరకు కాలం…
టిడిపి భవిష్యత్తు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశను కూడా నిర్ణయించే కీలక దశగా మారే అవకాశాలు ఉన్నాయి.
— ఉపద్రష్ట పార్ధసారధి
AndhraPradesh #TDP #ChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #Janasena #NDA #BJP #APPolitics #TeluguPolitics #KCR #KTR #PoliticalAnalysis #PardhaTalks
Share this Article