.
కొంతమందికి కొన్ని విజయాలు అస్సలు జీర్ణం కావు… బీహార్ అలీనగర్ నుంచి గెలిచిన పాతికేళ్ల మైథిలి ఠాకూర్ మీద అప్పుడే ట్రోలింగ్ మొదలైంది… ఆమెకు Election లో E అంటే తెలియదు… ఎవరో రిపోర్టర్ మీ బ్లూ ప్రింట్ ఏమిటీ అనడిగితే, పెళుసుగా అదేదో నీచపదం అన్నట్టు రియాక్ట్ అయ్యిందని మరొకరు…
రకరకాల వ్యాఖ్యానాలు… వీళ్లకు ఎంతసేపూ షాబుద్దీన్ వంటి మాఫియా డాన్లు కావాలి… లాలూ యాదవ్ వంటి జంగిల్ రాజ్ కావాలి… ఎయిత్ క్లాస్ డ్రాపవుట్ తేజస్వి సీఎం కావాాలి… మళ్లీ లాలూ కాలం నాటి అరాచకం కావాలి…
Ads
బీహార్ నుంచి ఎందరో వలసపోయారు లాలూ పాలనలో… పరిశ్రమల్లేవు, ఉపాధి లేదు… కుల, మత రాజకీయాలు, గుండాయిజం, దాడులు, కిడ్నాపులు, వసూళ్లు… అక్షరాలా అదొక జంగిల్ రాజ్… మరి మైథిలి..?
బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలు… ఈ సంవత్సరమే పాతికేళ్లు నిండాయి… ఆమె వీడియోలు చూడండి, మాటలో స్పష్టత, పరిణతి… ప్రచారం వీడియోలు చూడండి, ప్రతిచోటా ఆమెను సొంత బిడ్డగా ఎలా అలుముకుని ఆశీర్వచనాలు ఇచ్చారో…
ఏం.,.? ముస్లిం వోట్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ఓ ఆధ్యాత్మిక పాటల బాటలో నడిచే ఓ యువతి గెలవకూడదా..? ఆమె గ్రాడ్యుయేట్… సరే, ఆ నియోజకవర్గానికి వద్దాం…
అలీనగర్ దర్భంగా జిల్లాలో ఉంటుంది…
మధుబని, దర్భంగా జిల్లాలు మిథిల ప్రాంతంలో ఉంటాయి…
వాళ్లు మైథిలి భాష మాట్లాడుతారు…
అక్కడి సీతామర్హి సీతమ్మ జన్మస్థలం…
అక్కడే సీతమ్మకు పెద్ద మందిరం కడుతున్నారు…
మొన్ననే పనులు మొదలయ్యాయి..
మధుబని ఆర్ట్ తెలుసుకదా…
ఈ మైథిలి కూడా గాయని…
తనను గెలిపిస్తే అలీనగర్ పేరు సీతానగర్ అని మార్పిస్తానంది… చూడాలి…
(పేరు మార్పు ఇప్పుడప్పుడే సాధ్యం కాదు… బహుశా నియోజకవర్గాల డీలిమిటేషన్ సమయంలో సాధ్యమవుతుందేమో…)
అన్నట్టు… ఆమెకు పాట తప్ప ఇంకేం తెలుసు అని విమర్శిస్తున్నారు కదా… సచిన్ టెండూల్కర్‌కు ఏం తెలుసు, క్రికెట్ తప్ప… రేఖకు ఏం తెలుసు, నటన తప్ప… హేమమాలిని, జయా బచ్చన్, అమితాబ్, ఇతర రంగాల ప్రముఖులకు రాజకీయాలు ఏం తెలుసు, వాళ్ల వృత్తుల్లో నైపుణ్యం మినహా… వాళ్లు పార్లమెంటుకు రాలేదా..? మరి వాళ్లు ఉద్దరించింది ఏముందని..?!
ఆమె గెలిచినప్పుడు ‘ముచ్చట’ రాసిన కథనం మరోసారి మననం చేసుకుందాం ఇలా…
మైథిలి ఠాకూర్… కేవలం ఒక పేరు కాదు, బీహార్ రాజకీయాలలో, భారతీయ సంగీతంలో ఒక సంచలనం. గాయనిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యువతి, ఇప్పుడు కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఎమ్మెల్యేగా గెలిచి, బీహార్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలిగా చరిత్ర సృష్టించింది…
ఆమె బాల్యం, అద్భుతమైన గాన ప్రస్థానం, రాజకీయాల్లోకి అనూహ్య ప్రవేశం, మరియు చారిత్రాత్మక విజయం వివరాలు ఇక్కడ ఉన్నాయి…
1. బయోడేటా & కెరీర్: సంగీతం నుండి సోషల్ మీడియా సెన్సేషన్‌గా
| అంశం | వివరాలు |
| పూర్తి పేరు | మైథిలి ఠాకూర్ |
| పుట్టిన తేదీ | జూలై 25, 2000 |
| పుట్టిన ప్రదేశం | బెనిపట్టి, మధుబని జిల్లా, బీహార్ |
| విద్యార్హత | గ్రాడ్యుయేట్ |
| వృత్తి | గాయని, యూట్యూబర్, రాజకీయ నాయకురాలు |
| ప్రారంభ శిక్షణ | 3 ఏళ్ల వయస్సులో తాత గారు (శోభా సింధు ఠాకూర్), ఆ తర్వాత తండ్రి (రమేష్ ఠాకూర్) వద్ద హిందుస్థానీ శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ. |
| కీలక మలుపు | 2017లో ‘రైజింగ్ స్టార్ ఇండియా’ అనే టీవీ షోలో జాతీయ స్థాయి గుర్తింపు. |
| సోషల్ మీడియా | తన సోదరులు రిషవ్ (తబలా), అయాచి (గానం) లతో కలిసి వివిధ భారతీయ భాషల్లో ముఖ్యంగా మైథిలి, భోజ్‌పురి జానపద గీతాలను, భక్తి గీతాలను పాడి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించింది. |
| గుర్తింపు | బీహార్ ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం (2024), ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ గ్రహీత. |
సంగీత ప్రస్థానం: తన సోదరులతో కలిసి చేసిన సంప్రదాయ జానపద భక్తి సంగీతం, భక్తి గీతాలు ఆమెకు దేశవ్యాప్తంగానే కాక, అంతర్జాతీయంగా కూడా అపారమైన ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో, మైథిలి ‘మిథిలా సాంస్కృతిక స్వరంగా’ పేరొందింది…
2. రాజకీయాల్లోకి ప్రవేశం: అనూహ్య మలుపు
మైథిలి ఠాకూర్ రాజకీయ రంగంలోకి వస్తుందన్న ఊహాగానాలు చాలా కాలంగా ఉన్నప్పటికీ, ఆమె పార్టీలో చేరిన విధానం, వెంటనే టిక్కెట్ పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
-
ప్రేరణ…: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యువతకు రాజకీయాల్లో ప్రోత్సాహం అందించాలనే పిలుపు ఆమెకు ఒక ప్రేరణగా నిలిచింది. ప్రజలకు సేవ చేయడమే తన నిజమైన లక్ష్యమని ఆమె అనేక ఇంటర్వ్యూలలో పేర్కొంది.
-
పార్టీ ప్రవేశం…: 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ఆమె *భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరింది…
-
టికెట్…: ఆమె స్వస్థలానికి సమీపంలో ఉన్న దర్భంగా జిల్లాలోని అలినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్‌ను పొందింది… బీజేపీ దృష్టిలో ఆమె ‘యువ, ప్రసిద్ధ, సాంస్కృతిక చిహ్నం’ కావడం ఉత్తర బీహార్‌లో పార్టీకి బలంగా మారింది…
3. పోటీ, చారిత్రక విజయం
మైథిలి ఠాకూర్ పోటీ చేసిన అలినగర్ నియోజకవర్గం రాజకీయంగా చాలా కీలకమైనది, ఒక బలమైన కోట.
-
నియోజకవర్గం…: అలినగర్, దర్భంగా.
-
ఎదురైన సవాలు…: అలినగర్ సీటును బీజేపీ గతంలో ఎప్పుడూ గెలవలేదు. ఈ స్థానంలో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) సీనియర్ నాయకుడు బినోద్ మిశ్రా వంటి బలమైన అభ్యర్థితో ఆమె పోటీ పడింది…
-
ప్రచార వ్యూహం…: ఆమె తన సంగీత ప్రతిభను, స్థానిక మిథిలా సంస్కృతిపై తనకున్న లోతైన అనుబంధాన్ని ప్రచారంలో బలంగా ఉపయోగించుకున్నది… తన నియోజకవర్గ ప్రజలకు ‘వారి బిడ్డగా’ సేవ చేస్తానని, విద్య, ఉపాధి వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెడతానని హామీ ఇచ్చింది…
-
విజయ నినాదం…: తన ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేసేందుకు, గెలిస్తే అలినగర్‌ను ‘సీతానగర్’గా మారుస్తానని ఆమె ప్రకటించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది…
-
విజయం…: కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రత్యర్థి RJD అభ్యర్థిపై గణనీయమైన ఆధిక్యాన్ని కనబరిచి,. చివరికి, ఆమె చారిత్రక విజయాన్ని సాధించింది…
4. ఫలితం ప్రాముఖ్యత
-
అతి పిన్న వయస్కురాలైన MLA…: 25 ఏళ్ల వయస్సులో గెలిచి, బీహార్ అసెంబ్లీ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచింది…
-
బీజేపీకి మొదటి విజయం…: అలినగర్ స్థానాన్ని బీజేపీకి మొదటిసారిగా గెలిపించి, చారిత్రక విజయాన్ని అందించింది…
-
సాంస్కృతిక శక్తి…: స్టేజ్ నుండి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఒక సాంస్కృతిక చిహ్నం సాధించిన విజయంగా ఇది నిలిచింది…
రియల్ జెన్ జీ అంటే ఇలాంటి యువత..!!

ఇండియన్ ఐడల్ ఆడిషన్ లో రిజెక్ట్ అయినప్పుడు...
.
Share this Article