కథనం ఆర్ఆర్ఆర్ స్థాయిలో, విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలాగే ఉంది… కానీ ఈ వాట్సప్ యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ఇదే బాధ… జనం నవ్వుకుంటారనే సోయి లేకపోవడం..! వాజపేయి రహస్యంగా చైనాలో మన ఏజెంట్ల టీం క్రియేట్ చేశాడట… దానికి ములాయం లీడరట… ఇక నమ్మడానికి ములాయమే ఎందుకు దొరికాడో ఆయనకు..?! పైగా ములాయం కాషాయ క్యాంపుకి అత్యంత బద్ధవ్యతిరేకి… ఆర్ఎస్ఎస్‌కు ములాయం విషయంలో, తన హిందూ వ్యతిరేకతపై, ఆజంఖాన్ వంటి దేశవ్యతిరేకులతో ములాయం మిలాఖతైన తీరుపై ఆగ్రహం…
తనకు రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ ఇవ్వడం మీద ఆర్ఎస్ఎస్ క్యాంపులో ముఖ్యులకే మింగుడుపడటం లేదని వార్తలు వస్తున్నాయి… నిజంగానే ఇది ఆశ్చర్యకరమైన చర్య… ఇప్పటికీ ములాయం కొడుకు అఖిలేష్ దేశవ్యతిరేక శక్తులు, నాన్ బీజేపీ శక్తుల చేతుల్లో పావు… మరి ములాయంకు ఆ పురస్కారం ఏమిటనే విస్మయం కాషాయ శిబిరంలోనే వ్యక్తమవుతోంది… దానికి పైన వివరించిన సమర్థన నవ్వొచ్చేలా ఉంది…
Ads
అమిత్ షా, మోడీ సంప్రదాయ బీజేపీ రాజకీయాలతో పోలి ఉండదు… ఇదంతా డిఫరెంట్ పాలిటిక్స్… చతుర్విధోపాయాలను ప్రయోగిస్తూ తమంటే పడనివాళ్లను కూడా తమ తొవ్వకు తీసుకొచ్చుకుంటారు… రానీ, రాకపోనీ, ప్రయత్నం జరుగుతుంది… అంతటి మమతా బెనర్జీ సైతం ఇప్పుడు కుయ్ కుయ్ అని కూడా అనడం లేదు… మాయాదేవి బీజేపీ ఫోల్డ్‌లో ఉంది… కాంగ్రెస్‌ను తొక్కే పనిలో కేసీయార్‌ను కూడా వాడుకుంటోందనే ప్రచారం కూడా ఉంది… ములాయం తన కెరీర్ చివరలో యాంటీ బీజేపీ కాదు… చల్లబడిపోయాడు… తనకు ఓ పౌరపురస్కారం ఇవ్వడం వల్ల నష్టం లేదు… యూపీలోని యాంటీ బీజేపీ సెక్షన్లలోకి ఓ పాజిటివ్ సంకేతాల్ని పంపించినట్టు అవుతుంది…
రాజకీయాల్లో శతృత్వాలు శాశ్వతం కావు, కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వ్యూహాన్ని బట్టి అమలుపరచబడే ఎత్తుగడలు రకరకాలుగా ఉంటయ్… ప్రతి అడుగు వెనుక ఓ మర్మం ఉంటుంది… ఇదీ అదే… అంతేతప్ప చైనా ఏజెంట్లు, వాజపేయి ఎట్సెట్రా కథలు వేస్ట్… ఒక్క సంగతి చెప్పుకుందాం, దాంతోనే పైన కథ ఎలాంటిదో మీకే అర్థమవుతుంది… అసలు 2017లో వాజపేయి మనుషుల్ని గుర్తించే స్థితిలో గానీ, మాట్లాడే స్థితిలో గానీ లేడు… వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మోడీకి సర్టిఫికెట్ ఇలా ఇచ్చాడు..?!
Share this Article