పార్ధసారధి పోట్లూరి ……… మధ్య ప్రాచ్యం మంట-పార్ట్ -1… రష్యా విసిరిన సవాల్ కి చాలా త్వరగానే జవాబు వచ్చింది! అయితే రష్యా, ఇరాన్ లు తాము చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తప్పవని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని బట్టి తెటతెల్లమవుతున్నది రష్యా, ఇరాన్ లు అనుకున్నది ఒకటయితే జరుగుతున్నది భిన్నంగా ఉంది! అరబ్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోవాలన్న ఆశ ఆడియాస అవబోతున్నది!
***********************
హమాస్ దాడి జరిగిన తరువాతి రోజున అనూహ్యంగా అమెరికా తన కారియర్ స్ట్రైక్ గ్రూపు (CSG) ని మధ్యధరా సముద్రంలోకి దించింది! ఇది ఎవరూ ఊహించని చర్య. ఎందుకంటే మహా అయితే అమెరికా తన B2 బాంబర్లని టెల్ అవీవ్ కి పంపిస్తుంది అనుకున్నారు, ఇజ్రాయెల్ దగ్గర లేవు కాబట్టి!
Ads
1.అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అతని చుట్టూ ఉన్న అధికార యంత్రాంగం ఎర్రబ్యాచ్. కానీ చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారని పైకి కనిపించ వచ్చు గాక!
2.కానీ అమెరికన్ మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి యుద్ధం కావాలి. ఆయధాలు అమ్ముకోవాలి. ఇదే బిడెన్ యంత్రాగాన్ని నడిపిస్తున్నది. కాబట్టి అవకాశం వచ్చింది వాడుకోవాలి.
3. డోనాల్డ్ ట్రంప్ ఉన్న నాలుగేళ్లు యుద్ధం లేదు. ప్రశాంతంగా ఉంది. ఆయుధ లాబీకి పని లేదు.
4.అందుకే బిడెన్ అత్యంత అధునాతన కారియర్ స్టైక్ గ్రూపుని పంపించాడు!
5.USS గెరాల్డ్ R. ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ (USS Gerald R. Ford Aircraft Carrier), ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న విమాన వాహక నౌకలలో కెల్లా అతి పెద్దది. రెండు న్యూక్లీయర్ రియాక్టర్స్ ఉన్నాయి దీనిలో. ఒక అణు రియాక్టర్ కేవలం ఇంజిన్ కోసం కేటాయించారు. రెండో రియాక్టర్ విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుతుంది.
6.గెరాల్డ్ ఫోర్డ్ తో ఆ స్ట్రైక్ గ్రూపులో ఉన్నవి..Ticonderoga క్లాస్ గైడెడ్ మిసైల్ క్రూయిజర్, USS నార్మన్డీ, మరో నాలుగు Arleigh-Burke-class డిస్ట్రాయర్స్ ఉన్నాయి.
7.వీటికి తోడుగా పిసోడియన్ P8 సబ్మెరైన్ హంటర్ విమానం టెల్ అవీవ్ చేరుకుంది.
8.ఇంత భారీగా అమెరికా తన కారియర్ స్ట్రైక్ గ్రూపుని మధ్యధరా సముద్రంలోకి పంపడానికి పైకి చెప్తున్న కారణం ఏంటి? ఇరాన్ నుండి సముద్రం ద్వారా గాజాకి ఆయుధాలు అందకుండా అడ్డుకోవడానికి!
9.కానీ అసలు కథ వేరే ఏదో ఉండి ఉంటుంది కానీ అదేమిటో తెలియరాలేదు.
10.ఇరాన్ నుండి మధ్యధరా సముద్రం ద్వారా సప్లయ్ ని అడ్డుకోవడానికి స్పీడ్ బొట్లు, గస్తీ హెలికాప్టర్లు చాలు అడ్డుకోవడానికి.
*******************
ఇజ్రాయెల్ సిరియా రాజధాని డమాస్కస్ , మరో టూరిస్ట్ కేంద్రమయిన అలెప్పో ఎయిర్ పోర్ట్ ల మీద బాంబులు వేసింది. రెండు ఎయిర్ పోర్టులు మూసివేసింది సిరియా. అంటే దీనర్థం ఏమిటీ? రష్యాకి నేరుగా సందేశం పంపింది ఇజ్రాయెల్. నువ్వు హమాస్ కి మద్దతు ఇస్తే నేను సిరియాని ధ్వంసం చేస్తాను అని. So! ఇజ్రాయెల్ ఈసారి స్పష్టంగా హెచ్చరిక చేసింది రష్యాతో పాటు ఇరాన్ కి.
*********************
ప్రస్తుతం సిరియాలో అంతర్యుద్ధం టర్కీ సరిహద్దులకే పరిమితం అయి ప్రశాంతంగా ఉన్న తరుణంలో ఇజ్రాయెల్ డమాస్కస్, అలెప్పోల విమానాశ్రయాలని ధ్వంసం చేయడానికి కారణం ఇరాన్, రష్యా లనుండి సప్లైస్ ని ఆపడానికి. ఏదన్నా సాహసం చేయడానికి సన్నాహాలు చేస్తే ఈసారి రష్యా, ఇరాన్ విమానాలని కూల్చే ఉద్దేశ్యంలో ఇజ్రాయెల్ ఉన్నట్లు తెలుస్తోంది! పనిలో పనిగా సిరియా అధ్యక్షుడు అల్ బషర్ ని గద్దె దింపే దిశగా అడుగులు వేయవచ్చు ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి!
******************
గత దశాబ్ద కాలంగా షియా వర్గానికి చెందిన సిరియా అధ్యక్షుడు అల్ బషర్ ని గద్దె దించడానికి సౌదీ అరేబియా లక్షల కొద్దీ డాలర్లని వెచ్చించింది అక్కడి ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులకి కానీ పుతిన్ అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ పని చేస్తే మొదట సంతోషించేది సౌదీ ప్రిన్స్. ఇజ్రాయెల్ కి సంపూర్ణ మద్దతు ఉంటుంది సౌదీ నుండి! కాబట్టి గాజాలో ఇజ్రాయెల్ మసీదులని కూల్చింది అనే విషయంలో ఎలాంటి అభ్యంతరం ఉండబోదు సౌదీకి!
*******************
హమాస్ దాడితో అరబ్ దేశాలు ఏకమయి పోయి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాయి అని పుతిన్ అనుకొని ఉండవచ్చు. కానీ అలా ఏమీ జరగలేదు. తమ దేశ సరిహద్దులు దగ్గరికి చేరుకున్న గాజా ప్రజలని ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ దేశంలోకి రానివ్వమని అంటూ బోర్డర్ చెక్ పోస్టులని మూసివేసింది!
అఫ్కోర్స్ ఇటీవలే 40 రాఫెల్ జెట్లను ఫ్రాన్స్ నుండి కొన్నా ఈజిప్ట్ కి ధైర్యం చాలలేదు. 200 మంది జోర్డాన్ పౌరులు గాజాలోకి వెళ్లి IDF తో పోరాడతామని దౌర్జన్యానికి దిగారు కానీ వాళ్ళందరిని బోర్డర్ చెక్ పోస్ట్ వద్దనే ఆపేసి సైన్యం వెనక్కి పంపింది! So! పుతిన్ అనుకున్నట్లుగా అరబ్ ప్రపంచం ఇజ్రాయెల్ నుండి దూరం జరిగి 1973 నాటి పరిస్థితులు వస్తాయి అనేది జరగదు. చూడబోతే సిరియా, ఇరాన్ ల మీద అమెరికా , ఇజ్రాయెల్ లు కలిసి దాడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి! ఒకవేళ ఇదే జరిగితే రష్యా ఇరాన్, సిరియాలకి బాసటగా ఉండి కాపాడగలదా? ఒకసారి రష్యా లోగుట్టు గురుంచి తెలుసుకుంటే పుతిన్ ఎలాంటి తప్పు చేశాడో అర్ధం అవుతుంది. (మిగతాది పార్ట్2 లో….)
Share this Article