మన తెలుగు మీమ్స్‌లో తరచూ కనిపించే ఓ ఎక్స్‌ప్రెషన్… కమెడియన్ ఆలీ ఓ విచిత్ర వేషంలో ‘అసలు ఎవడు మమ్మీ వీడు..?’ అని ఆశ్చర్యపోతూ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు… ఈసారి ఒలింపిక్స్‌లో షూటర్ యుసుఫ్ డికెక్ మెడల్ కొట్టిన తీరు చూస్తే అలాగే అనాలని అనిపిస్తుంది ఎవరికైనా…
తను టర్కిష్ షూటర్… అది ఒలింపిక్స్ 10 M ఎయిర్ పిస్టల్ ఈవెంట్… ఓ టీషర్ట్ వేసుకుని కాజువల్‌గా వచ్చాడు… 51 ఏళ్లు కదా… సాల్ట్ అండ్ పెప్పర్ జుత్తు… బక్కపలుచని దేహం… సాధారణంగా షూటర్లు స్పెషలైజ్డ్ లెన్సులు వాడుతుంటారు ఈవెంట్లలో… బ్లర్ అవాయిడ్ లెన్స్, బెటర్ ప్రొటెక్షన్ లెన్స్, నాయిస్ రిడక్షన్ కోసం ఇయర్ ప్రొటెక్టర్ గట్రా… తనకు అవేవీ లేవు… అంటే, ధరించలేదు…
కానీ తనేమో సాధారణంగా తను ఎప్పుడూ పెట్టుకునే కళ్లజోడుతో వచ్చాడు… చెవుల్లో మాత్రం మామూలు ఇయర్ బడ్స్… ఓ చేయి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు… రిలాక్స్‌డ్ మూడ్‌లో… ఏదో ఫోటోకు ఫోజు ఇస్తున్నట్టుగా నిలబడి… గురిచూశాడు, కాల్చాడు… అంతే… ఆ దెబ్బకు ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఎగిరొచ్చి మెడలో పడింది…
Ads
అసలు పతకం సాధించినందుకు కాదు… తన అప్పియరెన్స్, తను పోటీలో పిస్టల్ కాల్చిన తీరు ఇంటర్‌నెట్‌ను షేక్ చేసింది… తన ఫోటో, ఆ వీడియో వైరల్ అయిపోయాయి… ప్రపంచవ్యాప్తంగా… అదేదో సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్ ఉంటుంది కదా… ‘‘ఆడు మగాడ్రా బుజ్జీ, ఎవడైనా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు, వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్టు, చాలా జాగ్రత్తగా, పద్దతిగా కొట్టాడురా…’’ అదుగో అది గుర్తొచ్చింది…
పతకాలు చాలామంది కొడతారు, కానీ ఇలా కొట్టేవాళ్లే మనస్సుల్ని గెలుస్తారు… అదంత వీజీ కాదు… విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉండాలి, అన్నింటికీ మంచి ఆ మెరిట్ ఉండాలి… తనది సార్జెంటుగా గ్రాడ్యుయేషన్… ఏడాదిపాటు అదే సర్వీసు… తరువాత స్పోర్ట్స్ స్కూల్ కొలువు… షూటింగులో ప్రాక్టీస్…
నిజానికి మూడు ఒలింపిక్స్ ఈవెంట్లలో పాల్గొన్నాడు… కలిసి రాలేదు… ఐనా ఏమాత్రం ఒత్తిడి లేకుండా, కనిపించకుండా అలా వచ్చి ఇలా కొట్టేసి వెళ్లడమే అందరినీ ఆకర్షించింది… గుడ్, కొందరుంటారు… రికార్డులు లిఖిస్తారు… అదీ తమదైన యూనిక్ స్టయిల్‌లో… ఏదో జేమ్స్‌బాండ్ సినిమాలో హీరో అలవోకగా పిస్టల్ కాల్చినట్టు… అదే తనికెళ్ల భరణి చెప్పినట్టు… ఆడు మగాడ్రా బుజ్జీ..!! (మగాడు అనే పదం ఓ గొప్పతనానికి ప్రతీక అని అంగీకరించకపోయినా సరే…) (మడత నలగని, క్రాఫు చెదరని తెలుగు హీరో స్టయిల్‌లో…)
Share this Article