Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రొటీన్ కథ… ఫార్ములా కమర్షియల్ పోకడ… ఐనా సూపర్ హిట్…

May 29, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… చిరంజీవికి ఫిలింఫేర్ అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా 1984 సెప్టెంబరులో వచ్చిన ఈ ఇంటిగుట్టు సినిమా . ఫైట్స్ , డాన్సుల పరంపరలో వచ్చిన ఇంటి కధాచిత్రం ఈ ఇంటిగుట్టు . వంద రోజుల ఫంక్షన్  గుంటూరులో 1985 జనవరి ఒకటో తారీఖున జరిగింది .

తమిళంలో 1964 లో వచ్చిన MGR , బి సరోజాదేవిల సూపర్ హిట్ సినిమా పనక్కర కుడుంబం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా .

Ads

1958 లో వచ్చిన యన్టీఆర్ ఆ ఇంటిగుట్టు కథ ఈ సినిమా కధ ఒకటి కాదు . ఆ ఇంటిగుట్టు కధాంశమైన పిల్లల మార్పిడి ఆధారంగా వచ్చిందే మొన్నటి అల వైకుంఠపురంలో సినిమా…

ప్రముఖ నిర్మాత డి వి యస్ రాజు నిర్మాణంలో , కె బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ హిట్ ఇంటిగుట్టు సినిమాలో నళిని , సుహాసిని , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , సత్యనారాయణ , గిరిబాబు , నూతన్ ప్రసాద్ , కాకినాడ శ్యామల , ప్రభాకరరెడ్డి , అన్నపూర్ణ , చంద్రమోహన్ , జయమాలిని , రావి కొండలరావు , సారధి  ప్రభృతులు నటించారు . భారీ తారాగణం .

చిరంజీవి నటన గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి . Settled నటనను కూడా బాగా చేయగలనని మరోసారి రుజువు చేసుకున్నారు . చిరంజీవితో రెండో సినిమా నళినికి . చాలా సినిమాల్లో హీరోయినుగా వేసిన సుహాసిని ఈ సినిమాలో చెల్లెలుగా నటిస్తుంది . అల్లు , సత్యనారాయణల అల్లరే అల్లరి . అలాగే చంద్రమోహన్ , సుహాసిని , జయమాలినిల ట్రయాంగ్యులర్ అల్లరి కూడా సినిమాలో బాగుంటుంది .

ఆస్తి కోసం మూర్ఛ రోగి అయిన భార్యను , బిడ్డను చంపించేందుకు విఫల యత్నం చేస్తాడు రావు గోపాలరావు . ఆ గుట్టును అడ్డంగా పెట్టుకుని అల్లు రామలింగయ్య , ఆయన చెల్లెలు కాకినాడ శ్యామల రావు గోపాలరావుని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు . ఆ వలయాన్ని ఛేదించి తాను ప్రేమించిన రావు గోపాలరావు కూతురిని హీరో పెళ్ళి చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది . రొటీన్ స్టోరీయే.

1980 s లో చక్రవర్తి ఎన్ని సినిమాలకు సంగీతాన్ని అందించాడో ! ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతాన్ని అందించారు . వేటూరి సాహిత్యం రొమాంటిగ్గా ఉంటుంది . స్త్రీ పురుషుల మధ్య చెడుగుడు పోటీలో చెడుగుడు చెడుగుడు పాట హుషారుగా ఉంటుంది . అలాగే చంద్రమోహన్ , సుహాసిని డ్యూయెట్ లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి పాట కూడా గోలగోలగా బాగుంటుంది .

intiguttu

చిరంజీవి , నళిని డ్యూయెట్లు బాగుంటాయి . ఓ వాన పాట కూడా ఉంటుంది . కొత్త కొత్త ఆకలి , నవ్వితే నవ్వింది ఊరూవాడా , లేత లేత చీకటి పాటలు వేటూరి వారి మోడల్లోనే ఉంటాయి . వెరైటీ వెరైటీ అని సాగే క్లబ్ డాన్సులో చిరంజీవి డాన్స్ అదరగొట్టేస్తుంది . శేషు , సలీంలు డాన్సుల్ని కంపోజ్ చేసారు .

వాన పాట అచ్చంగా హిందీ బ్లాక్ బస్టర్ నమక్ హలాల్ సినిమాలోని అమితాబ్, స్మితాపాటిల్ వానపాటకు కాపీలా ఉంటుంది… ఆజ్ రపట్ జాయేతో… సేమ్, తోపుడు బండి మీద స్టెప్పులు, రొమాన్స్…

A neat , feel good , entertaining , family-centric , action movie . యూట్యూబులో ఉంది . చిరంజీవి అభిమానులు , నళిని అభిమానులు ఉంటే వాళ్ళూ , చూడతగ్గ సినిమాయే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రానున్న 48 గంటలు అత్యంత కీలకం – మధ్యప్రాచ్యం మండిపోతోంది
  • టాక్సిస్ పారడాక్స్..! ఓ అశ్లీల వ్యతిరేకి దాన్నే ఆశ్రయించడం..!!
  • యాదాద్రి, భద్రాద్రి… తెలంగాణ నెత్తిన రెండు తెల్ల ఏనుగులు…
  • సుహాసిని సరే… యాంగ్రీ రాజశేఖర్ శాకాహార సినిమాలూ చేయగలడు…
  • మర్యాద రేవంతన్న..! గౌరవనీయ కేసీయార్..! ప్రొటోకాల్ పాలిటిక్స్..!!
  • ది రాజా సాబ్..! ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కూ మారుతి బలమైన దెబ్బ..!!
  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions