ఒక ఇంట్రస్టింగ్ చర్చే… ఎలాబరేట్‌గా చెప్పుకోవడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా సరే… ఓ ఫేమస్ నవల ఆధారంగా తీయబడిన ఏ ఫేమస్ మూవీ కాబట్టి… అదే ది గోట్ లైఫ్… ఆడుజీవితం… ఆ పాత్ర కోసం పృథ్విరాజ్ చాలా కష్టపడ్డాడు, బరువు తగ్గాడు, పాత్రకు తగిన నటన కనబరిచాడు కాబట్టి… సినిమా చాలామంది ప్రశంసలు అందుకుంది కాబట్టి… చెప్పుకుంటే తప్పేమీ లేదు…
ఈమధ్య ఆ హీరోకు మీడియా మీట్‌లో ఓ ప్రశ్న ఎదురైంది… ‘‘కథానాయకుడికి ఆ ఎడారిలో నెలల తరబడీ మేకలు తప్ప మరేమీ కనిపించవు కదా, వాటితోనే జీవితం కదా, మేకతో ఇంటిమేట్ సీన్స్ కూడా షూట్ చేశారట కదా..’ ఇదీ ప్రశ్న… అంటే మేకతో సంభోగం అనేది ఆ విలేకరి ఉద్దేశం… శారీరిక వాంఛ అణుచుకోలేక మేకతో సంపర్కం అనేది ఒరిజినల్ నవలలో కూడా రచయిత ప్రస్తావిస్తాడట… నిజంగా నవలలో ఆ పార్ట్‌ను ఒరిజినల్ కథానాయకుడు ఆమోదించాడా అనేది ఓ పెద్ద ప్రశ్న… ఎందుకంటే… చెప్పుకోవడానికి, అలా జంతుసంపర్కుడిగా కనిపించడానికి ఎవరూ ఇష్టపడరు కదా…
ఆ విలేకరి ఆ ప్రశ్న వేయడానికి కారణం, మేకతో అలాంటి సీన్లను కూడా షూట్ చేశారని, తరువాత ఎందుకో మూవీలో యాడ్ చేయలేదనీ కొన్ని వార్తలు వచ్చాయట… సరే, అడగడంలో తప్పేమీ లేదు… దానికి పృథ్విరాజ్ కూడా అదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు… నవలను యథాతథంగా తీయడం కాదు, సినిమాకు ఎంత అవసరమో అంతే తీసుకున్నామని చెప్పాడు… గుడ్… మనం నమ్మామా లేదానేది ముఖ్యం కాదు… ఇలాంటి ప్రశ్నలు వస్తే ఏం చెప్పాలో తనకు క్లారిటీ ఉంది కాబట్టి…
Ads
పర్ సపోజ్… ఆ పుస్తకంలో ఉన్న కంటెంటునే ఒకవేళ సినిమాలో పెట్టడానికి షూట్ చేయాలని అనుకున్నారనుకుంటే… ముందుగా పృథ్విరాజ్ దానికి ఒప్పుకోడు… ఏదో గ్రాఫిక్స్ మాయ చేసినా సరే, జనం అలాంటి సీన్లను హర్షించరు… మొత్తం సినిమా కంటెంటు ఉదాత్తత కూడా కొట్టుకుపోతుంది… ఇప్పుడు పాపం ఆ వలస కార్మికుడు అనుకున్నవాళ్లు కూడా కాస్త వెగటుతనాన్ని ఫీలవుతారు… సినిమా తద్వారా బిజినెస్‌పరంగా కూడా చేదు అయిపోతుంది…
అన్నింటికీ మించి మరో ప్రమాదం ఉంది… అసలు మామూలుగా జంతువులను ఇష్టమొచ్చినట్టు చూపించడానికి వీల్లేదు ఇప్పుడు… ట్రెయిన్డ్, హింసించలేదు అని డిస్‌క్లయిమర్లు డిస్‌ప్లే చేస్తున్నా సరే, మారిన రూల్స్ మేరకు సెన్సార్ చాలా నిశితంగా గమనిస్తుంది… అదేదో శేఖర్ కమ్ముల సినిమాలో ఓ ఒరిజినల్ కుక్కపిల్లను చూపించలేక, ఈ తల్నొప్పులు ఎందుకులే అనుకుని గ్రాఫిక్స్‌తో నడిపించేశాడు… ఇలా చాలా సినిమాల్లో… అదేదో ఏనుగులకు సంబంధించిన రానా సినిమాకు అనుమతుల కోసం ఎన్ని కష్టాలు పడ్డారో… ఇప్పుడు ఆడుజీవితం సినిమాలోనూ దాదాపు మెజారిటీ సీన్లలో గొర్రెలే కనిపిస్తాయి…
అక్కడెక్కడో షూట్ చేసినా సరే, ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నిర్మాత ఈ సీన్ల అప్రూవల్‌కే ఎన్ని కష్టాలు పడ్డాడో… ఇక సంపర్కాలు వంటివి చూపిస్తే ఇంకేమైనా ఉందా..? ఏకంగా లైంగిక హింస కేసులు పెట్టేవారేమో జీవకారుణ్యవాదులు… ఈ తల్నొప్పులు ఎందుకులే అనుకుని ఎంచక్కా ఒరిజినల్ నవలలోని అలాంటి సీన్లను జస్ట్ అలా అవాయిడ్ చేసేసి ఉంటారు… అంతేనా పృథ్వీరాజ్..?!
Share this Article