.
జన్యుసంకరం అనండి, వైవిధ్య జన్యుసంపర్కం అనండి… ఏ జాతినైనా బలపడేట్టు చేస్తుంది… మానవ పరిణామ క్రమాన్ని పరిశీలించేవారూ అంగీకరించే వాస్తవం ఇది… వైవిధ్యమైన కలయిక బలాన్ని ఇస్తుంది…
సాధారణ భాషలో చెప్పాలంటే… కులాంతరం, కుటుంబాంతరం, మతాంతరం, దేశాంతరం, ఖండాంతర వివాహాలు శారీరిక, అనువంశిక లక్షణాల కోణంలో చూస్తే బెటర్… అఫ్‌కోర్స్, సంస్కృతులు, అలవాట్లు, భాషలు, తత్వాలు పడొచ్చు, పడకపోవచ్చు… కొత్త సమస్యలకు తలెత్తొచ్చు కూడా…
Ads
కానీ పూర్తిగా ఒక హ్యూమన్ అనే కోణంలో చూస్తే మటుకు భిన్న జాతులతో సంపర్కం మంచిది… గతంలో ఒకే కుటుంబం లేదా ఒకే సమూహంలో పెళ్లిళ్లు జరిగేవి… వర్ణసంకరం జరగొద్దు అనే ఓ భావన అప్పట్లో… కానీ ఎప్పుడైతే మేనరికాలతో, అంటే ఒకే కుటుంబంలో జరిగే పెళ్లిళ్లు పిల్లల్లో ఎన్నిరకాల వ్యాధులకు కారణం అవుతుందో తెలిసొచ్చాక అవి గణనీయంగా తగ్గిపోయాయి…
అలాగే ఒకే ఊరు, ఒకే బంధుగణంలోనే పెళ్లిళ్లు అనే నమ్మకాలు కూడా కాలగతిలో బ్రేకయ్యాయి… కాలం మారుతోంది… కడుపు చేత్తో పట్టుకుని దేశదేశాలకు వలసవెళ్తున్నారు మనవాళ్లు… సినిమాలు, ఇతర బలమైన కమ్యూనికేషన్స్ ప్రభావం పడుతోంది… చదువుకునే రోజుల్లోనే ప్రేమలు, తరువాత పెళ్లిళ్లు…
గతంలో ఈ పెళ్లిళ్లను బలంగా వ్యతిరేకించి, ప్రతిఘటించిన సోకాల్డ్ ఛాందస కుటుంబాల్లో కూడా ఇప్పుడు కులాంతరాలు కామన్ అయిపోయాయి… భ్రూణహత్యలతో అసలు కొన్నిచోట్ల కొన్ని కులాల్లో అసలు ఆడవాళ్లంటూ గణనీయంగా తగ్గిపోయి, ఎదురు కట్నాలు ఇచ్చి మరీ వేరే కులాల నుంచి సంబంధాలు తెచ్చుకుంటున్న స్థితి…
వెరసి కులం అడ్డుగోడలు కూలిపోవడమే కాదు… కులాలు అనువంశికంగా సంతరించుకునే బలహీనతల స్థానంలోకి కొత్త బలాలు వచ్చి చేరుతున్నాయి… ఒకరకంగా ఇదొక రక్తమార్పిడి… అనువంశిక లక్షణాల మార్పిడి కూడా…
కులాన్ని బట్టి కొన్ని బలహీనతలుంటాయి అని చెప్పడానికి ఓ ఉదాహరణ… వైశ్యులకు కొన్నిరకాల అనస్తీషియా పడదు… కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా… చాలామంది తెలిసిన డాక్టర్లు అనస్తీషియా ఇచ్చేటప్పుడు మీరు వైశ్యులా అనడుగుతారు దీనికే… కాలక్రమేణా ఈ కులంలోకి కూడా కొత్త రక్తాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ బలహీనత కనిపించడం లేదు…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… సాక్షిలో ఓ వార్త… సీసీఎంబీ వాళ్ల పరిశోధనలో ఒకే కులంలో జరిగే పెళ్లిళ్లు కూడా కొన్ని వ్యాధులకు, వ్యాధుల తీవ్రతకూ దారితీస్తుందని తేలింది… చివరకు వాటికి వాడే ఔషధాలు కూడా భిన్న ప్రభావాల్ని చూపిస్తాయి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో ఒక కులంలో స్పాండిలైటిస్ ఎక్కువ ఉండటానికి అదే కారణం అంటున్నాడు సీసీఎంబీ శాస్త్రవేత్త… నిజానికి ఈ వార్త మరింత విపులంగా రాసి ఉండాల్సింది… నిజాలు కాబట్టి… అవసరం కాబట్టి… ఇతర మీడియా సంస్థలు ఏమైనా టచ్ చేసి, మరింత వివరంగా ప్రజెంట్ చేస్తాయేమో చూడాలిక..!
Share this Article