.
Pardha Saradhi Upadrasta …. బావ బావే పేకాట పేకాటే. వ్యాపారవేత్త ఎక్కడ తయారు చేస్తే తక్కువ ధరకు ఉత్పత్తి అవుతుందో అక్కడే తయారు చేస్తాడు, ఇది ట్రంప్ మామకు తెలుసు, టిమ్ కుక్ కీ తెలుసు, భారత్ కు కూడా తెలుసు.
నో, నో, యాపిల్ ఐఫోన్లను ఇండియాలో తయారు చేయడానికి వీల్లేదు అని ఉరుముతాడు ట్రంపు… ఒక ఐఫోన్ అమెరికాలో తయారు చేస్తే 3000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది.
Ads
అదే చైనాలో తయారు చేస్తే ఒక ఐఫోన్ 16 ప్రో మాక్స్ (256 GB) హార్డ్‌వేర్ ఖర్చు సుమారు $550… చైనా నుండి దిగుమతి చేసే సుంకాలు (54 % టారిఫ్) జోడిస్తే, దిగుమతి ఖర్చు సుమారు $300 అదనంగా ఉంటుంది, కాబట్టి మొత్తం ల్యాండెడ్ ఖర్చు $850 వరకు ఉంటుంది…
అదే భారత్ లో తయారు చేస్తే… భారతదేశంలో తయారీ ఖర్చు చైనా కంటే 5- 8 % ఎక్కువ, కొన్ని సందర్భాల్లో 10 % వరకు… ఒక ఐఫోన్ 16 ($450 తయారీ ఖర్చు) భారతదేశంలో తయారై, 26 % టారిఫ్‌తో యూఎస్‌కు దిగుమతి చేస్తే, టారిఫ్ ఖర్చు సుమారు $117 ఉంటుంది, కాబట్టి మొత్తం ల్యాండెడ్ ఖర్చు $567 వరకు ఉంటుంది…
చైనాతో పోలిస్తే భారత్ లో టారిఫ్‌లు తక్కువ, పన్ను తక్కువ కాబట్టి మొత్తము మీద తయారీ ఖర్చు తక్కువ. ట్రంప్ కుక్ ను అమెరికాలో తయారు చెయ్యి అని అడిగినంత మాత్రాన యాపిల్ అక్కడే తయారు చేయడు… వ్యాపారికి తయారీ ఖర్చు చౌకగా అయిపోవాలి…
సుమారు 10- 15 % ఐఫోన్‌లు భారతదేశంలో తయారవుతాయి, ముఖ్యంగా ఫాక్స్‌కాన్ , టాటా వంటి కంపెనీల ద్వారా. 2026 నాటికి యూఎస్ మార్కెట్ కోసం భారతదేశంలో అన్ని ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఆ పథకాల్లో మార్పేమీ లేదు అని ఈ రోజు ఆపిల్ సంస్థ వర్గాలు చెప్పాయట..
ట్రంప్ అరుపులు వూరికే తాటాకు చప్పుళ్లే. అయన వెనుక ఆయన టీమ్ వుంటుంది, ఆయన చేసే నష్టాన్ని అటు ఇటు సమతుల్యం చేస్తూ వుంటుంది…
Share this Article