Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన ఖరీదైన ఆతిథ్యం… విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ టైంపాస్ టూర్…

April 23, 2026 by M S R

.

( గోపు విజయకుమార్ రెడ్డి ) ….. ఐపీఎల్ అంటేనే జూదం… ఎప్పుడు ఏ ముక్క ఎక్కుతుందో ఎవరికీ తెలియదు… ఇలాగే చాలా దేశాల ప్లేయర్లు ఐపీఎల్ ని ఒక టైంపాస్ పల్లి బఠాణి యవ్వారంలాగా చూసాయి, చూస్తున్నాయే తప్ప ఎప్పుడూ సీరియస్ క్రికెట్ లీగ్ లా ట్రీట్ చెయ్యలేదు…

పాట్ కమ్మిన్స్, హజల్‌వుడ్, స్టార్క్, టాప్ త్రీ ఆస్ట్రేలియన్ బౌలర్లు… కానీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు, మొన్ననే హజల్‌వుడ్ rcb తరుపున దిగాడు, నెక్స్ట్ పాట్ కమిన్స్ వస్తున్నాడు, ఇక్కడ అసలు విషయం ఏంటంటే… వీళ్ళ మీద కోట్లు కోట్లు పెట్టి, ఉన్న డబ్బులన్నీ వీళ్ళ మీద తగలేసి బ్యాక్ అప్ లేకుండా మ్యాచులు ఆడుతున్నారు…

Ads

ఇప్పటి వరకు కొందరు విదేశీ ప్లాప్ ఆటగాళ్లు మన ఫ్రాంచైసీల దగ్గర దోచుకున్న డబ్బులు చూస్తే విజయ మాల్యా బెటర్… అన్ని సీజన్లలో ఆక్షన్లలో సంపాదించిన డబ్బు… గ్లెన్ మాక్స్‌వెల్ -145 కోట్లు. లియం లివింగస్టన్ -60 కోట్లు క్రిస్ మోరిస్ 80 కోట్లు, బెన్ స్టోక్స్ 80 కోట్లు.. ఇంకా సీజన్ సీజన్ కి వచ్చి కోట్లు కోట్లు సంపాదించిన విదేశీ ఆటగాళ్లు ఎందరో..

ఐపీఎల్

సాయంత్రం 7 అయ్యిందంటే చిన్నా పెద్దా అందరూ మొబైల్స్ కో, టీవీ స్క్రీన్స్ కో అతుక్కుపోయి మ్యాచ్ లు చూస్తున్నాం కదా… కానీ చాలా మంది విదేశీ ఆటగాళ్ళకి ఇదో ఒక టైం పాస్ యవ్వారం… మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ళకి…

ఈ రెండు దేశాలకి సంబంధించిన ఒక్క డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ తప్పించి, కోట్లకి కోట్లు టీం యాజమాన్యాలు పెట్టిన డబ్బులు అన్నీ బూడిదలో పోసిన పన్నీరే…. చిన్న ఉదాహరణ… విదేశీ బోర్డులు మన ఐపీఎల్ ని ఎలా చూస్తాయో చెప్పటానికి… ఈ సీజన్లలో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ ఉదంతమే… ఆస్ట్రేలియా నేషనల్ టీంలో ఇంపార్టెంట్ అల్ రౌండర్. తనదైన రోజున ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు…

కానీ వేలంలో కేవలం బ్యాటర్ కేటగిరీలో రిజిస్టర్ చేపించుకొని, దాదాపు 27 కోట్లు వేలంతో KKR కొనుక్కుంది… ఆ సొమ్ము ఎందుకు అంతగా అంటే అల్ రౌండర్ ఆటగాడు అని… కానీ ఇప్పుడు మనోడు, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు వాడు కేవలం బ్యాటర్ గానే ఆక్షన్‌లో ఉన్నాడు కాబట్టి మీరు అల్రౌండర్ గా ఉపయోగించుకోవద్దు అంటున్నాయి… మరెందుకంత సొమ్ము తగలేసినట్టు..?

మోస్ట్ సక్సెస్ ఫుల్ విదేశీ ఆటగాళ్లు ఎవరో తెలుసా… మనీ వర్సెస్ పర్ఫామేన్స్ ఆధారంగా AB డెవిలియర్స్, రషీద్ ఖాన్,…మోస్ట్ ఫెయిల్డ్ ఇండియన్ బ్యాటర్ యువరాజ్ సింగ్ మనీ వర్సెస్ పర్ఫామేన్స్ ఆధారంగా…, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్ విరాట్ కోహ్లీ… 6 బాల్స్ కి 6 సిక్సులు కొట్టిన ఇండియన్ ప్లేయర్ ఇండియన్ లీగ్ లో ఫెయిల్ కావడం కొంచెం ఆశ్చర్యమే…

నిజం చెప్పాలంటే… ఈ విదేశీ ఆటగాళ్లు, ఇంత సొమ్ము వేస్ట్… వాళ్లందరికీ నాలుగు రోజులు టైంపాస్, కోట్ల డబ్బు… అంతకుమించి సీరియస్‌నెస్ ఎవడికీ లేదు… ఏదో వెకేషన్‌కు వచ్చినట్టు వస్తున్నారు… కానీ రిజర్వ్ బెంచుల్లో ఉండి, అవకాశం వచ్చినప్పుడు మెరుపులు మెరిపిస్తున్న మన ప్లేయర్లు వందల రెట్లు మేలు కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మన ఖరీదైన ఆతిథ్యం… విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ టైంపాస్ టూర్…
  • ఏ ముత్యాలూ కడగబడలేదు… కాళేశ్వరం పిక్చర్ ఔర్ బహుత్ బాకీ హై…
  • సిద్ధరామయ్యపై క్షుద్రపూజలు, చేతబడి చేయించింది ఎవరు..?
  • జేడీ చక్రవర్తి చెప్పిన ఓ కథలో ఆ ముసలి గాడిద ఎవరై ఉంటారబ్బా..?!
  • … చివరకు అలాంటి పాకిస్థాన్ కూడా ఈమెకు సలాం కొట్టింది…
  • తోపులు కాదు, తుప్పాసులు… కోట్లకుకోట్లు పెట్టి కొన్నాను కదరా…
  • ఈమె నోరువిప్పితే… ట్రంపు ఫ్యామిలీ బజారున పడటం ఖాయమేనా…
  • ప్చ్, కష్టం బ్రో… భార్య వేసే ‘గూగ్లీ’ని ఏ భర్త కూడా సిక్స్ కొట్టలేడు..!
  • సరిగ్గా పోల్చాలంటే ఎస్‌.జానకి మీసాలు లేని కిశోర్‌ కుమార్‌..!!
  • నెల రోజుల ముఖ్యమంత్రి … చరిత్ర క్షమించలేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions