Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ధరలు ఎక్కువ… సరుకు నాసిరకం… సూపర్ ఫ్లాప్ టీమ్ ఇదేనట…

May 6, 2025 by M S R

.

తమదైన శైలిలో సోషల్ మీడియాలో సెటైర్లు వేసే ఐస్‌లాండ్ క్రికెట్ ఓ చెత్త ఐపీఎల్ జట్టును ప్రకటిస్తూ ఓ ట్వీట్ కొట్టింది… దానికి ‘ఫ్రాడ్స్ అండ్ స్కామర్స్’ అని పేరు కూడా పెట్టింది…

అందులో చాలావరకు ప్లేయర్ల ఆటతీరు మీద ఇప్పటికే క్రికెట్ ప్రేమికుల్లో విమర్శలు, సందేహాలు ఉన్న విషయం తెలిసిందే… ఆ ప్రచారంలో ఉన్న పేర్లనే ఓ జట్టుగా ప్రకటించి భలే సెటైర్ పేల్చింది ఈ ట్వీట్…

Ads

నిజంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో అంచనాలకు మించి, తక్కువ ధరలకే కొనుక్కోబడి మంచి ప్రదర్శన ఇచ్చినవాళ్లు కూడా ఉన్నారు… కానీ ఈ లిస్టులో వాళ్లు మాత్రం పేలవమైన ఆటతీరుతో విమర్శలకు గురవుతున్నారు…

https://x.com/icelandcricket/status/1919392201508872497

R Tripathi
R Ravindra
I Kishan
R Pant (c & wk)
V Iyer
G Maxwell
L Livingstone
D Hooda
R Ashwin
M Pathirana
M Shami

No impact player: M Kumar

ఇదే ఆ జాబితా… వీరికి కెప్టెన్ రిషబ్ పంత్ అట… నిజంగానే క్రికెట్ ప్రేమికులు తనను దుమ్మెత్తిపోస్తున్నారు… 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కొనుగోలు చేసి నిండా మునిగింది… 10 మ్యాచుల్లో తను చేసిన పరుగులు జస్ట్, 128 మాత్రమే… హయ్యెస్ట్ రేట్ ఈ సీజన్‌కు సంబంధించి…

ఈ లిస్టులో ఉన్న ఓపెనర్లు ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు… వీరిలో రచిన్ రవీంద్రకు 4 కోట్లు, రాహుల్ త్రిపాఠీకి 3.4 కోట్లు పెట్టి కొనుక్కుంది చెన్నై టీమ్… ఈ టీమ్ అసలు ప్లే ఆఫ్‌కు కూడా చేరకుండా, అన్ని జట్లకన్నా ముందే ఔటయిపోయింది…

ఇషాన్ కిషన్‌కు 11.25 కోట్లు పెట్టి కొన్నది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్… తుస్సుమనిపించాడు… ఈ టీమ్ కూడా ప్రస్తుతం ప్లేఆఫ్ నుంచి దూరమైపోయింది… జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగిన మరో పేరు వెంకటేష్ అయ్యర్… తన ధర 23.75 కోట్లు… తన సో సో ఆటతీరుతో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ఆశాభంగమైంది…

4.20 కోట్ల ధర పలికిన గ్లెన్ మాక్స్‌వెల్ ఆరు మ్యాచుల్లో కేవలం 48 పరుగులు చేశాడు… లివింగ్ స్టోన్ ధర 8.75 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు), దీపక్ హుడా ధర 1.7 కోట్లు (ఇతనూ చెన్నై టీమే) ఈ ఇద్దరితోపాటు మరో ప్రముఖమైన పేరు రవిచంద్ర అశ్విన్… తనూ చెన్నై టీమే… ధర 9.75 కోట్లు…

మత్తీశ పత్తిరానా ధర 13 కోట్లు (చెన్నై) షమి ధర 10 కోట్లు (హైదరాబాద్)… ఈ ఇద్దరూ ఉసూరుమనిపించారు… ఇంపాక్ట్ ప్లేయర్ ముఖేష్ కుమార్ ధర 8 కోట్లు (ఢిల్లీ) కూడా నో ఇంపాక్ట్… వెరసి ఈ చెత్తా జాబితాలో ఉన్నవాళ్లలో అయిదారుగురు చెన్నై టీమే… అందరికీ ధరలు ఎక్కువే… కొందరిపై మ్యాచ్ ఫిక్సర్లనే ఆరోపణల్ని కూడా నెటిజనం చేస్తోంది… అది వేరే కథ… (ఐస్‌లాండ్ క్రికెట్ కూడా ఫ్రాడ్స్ అండ్ స్కామర్స్ అనే ముద్ర వేసింది)…

అవునూ, ప్రతి ఏటా ఇండియన్ సినిమా జాతీయ అవార్డుల్లాగే… ఇలాంటి ఓ సూపర్ ఫ్లాప్ జాబితా కూడా ఎవరైనా విడుదల చేస్తే బాగుంటుందేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions