Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… ఇంకా నయం, స్టేడియంలోనే కోడిమెడ కోసి నెత్తురు చల్లలేదు..!!!

April 21, 2026 by M S R

.

Ashok Kumar Vemulapalli …. నిమ్మకాయ -చేతబడి నిజమేనా ?
అతను నిమ్మకాయ చూపించి మంత్రాలు చదివితే వికెట్ పడింది… అంతా ఫేక్ అని అందరికీ తెలుసు … అదంతా ఎడిటింగ్ అని కేవలం రీల్ కోసం అతను అదంతా సరదాగా చేశాడని తెలుసు … అయినా చేతబడి చేసాడని ఎలా నమ్ముతారు ?

ఇది వైరల్ కావడం తో ఇంకొకడు వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ … ఈ నిమ్మకాయ మంత్రాలపై ఏకంగా BCCI కి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసేసి సోషల్ మీడియాలోకి వదిలాడు … అది నిజమనుకుని టీవీ ఛాన్సల్స్ , యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ బ్రేకింగ్స్ వేసాయి .. హెడ్ లైన్స్ పెట్టేసాయి ..

Ads

చిన్న కామన్ సెన్స్ .. ఇంత సిల్లీ విషయానికి నిజంగా బీసీసీఐకి చెన్నై సూపర్ కింగ్స్ కంప్లైంట్ చేస్తుందా ? అని ప్రశ్నించుకుంటే అక్కడే ఆన్సర్ దొరుకుతుంది కదా …

సోషల్ మీడియాకి ఎప్పుడో ఏదో ఒక మేత కావాలి .. వైరల్ కంటెంట్ కావాలి .. అందులో తప్పేమీ లేదు .. జనాలకి అదొక ఎంటర్ టైన్మెంట్ .. కానీ శాటిలైట్ మీడియాకు ఏమైంది ? ఏది ఫేక్ లెటరో ? ఏది నిజమైనదో మనం నిర్ధారించుకోవాలి కదా ? ఇవాళ ఏఐతో ఏకంగా వీడియోలు కూడా సృష్టించేస్తున్నాము .. అలాంటిది ఇక ఫేక్ లెటర్ క్రియేట్ చేయలేమా ?

ఒకప్పుడు టీవీ ఛానెల్స్ లో ప్లే అయిన వార్తలు .. సోషల్ మీడియాలోకి వచ్చేవి . ఇపుడు సోషల్ మీడియాలో వచ్చేవి టీవీ ఛానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి .. నా ఉద్దేశం సోషల్ మీడియాని తక్కువ చేసి చూపడం కాదు .. కానీ మీడియాకి , సోషల్ మీడియాకి తేడా ఉండాలి కదా అంటున్నాను .. అశోక్ వేములపల్లి



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?
  • AMR … ఈడీ భారీ దాడులపై తెలుగు మీడియా సైలెన్స్ దేనికి..?
  • కొన్ని పుస్తకాలు బయటికి రావు ! ఏ పార్టీ ప్రభుత్వమూ మినహాయింపు కాదు !!
  • AIలో ఫోటో అప్‌లోడ్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు పోతాయా? నిజమేంటి?
  • ‘‘ఆ రీసెర్చ్ కోసం- బ్లడ్ క్యాన్సర్ సోకిన నీ కూతుర్ని ఇస్తావా?”
  • 40 స్క్రీన్లకు పడిపోయిన సినిమా… 2,500 స్క్రీన్లకు ఎలా వెళ్లింది?
  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!
  • బహుశా ఇలాంటి ‘ఘనత’ ప్రపంచంలో కేవలం కేసీయార్ పార్టీకే సాధ్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions