.
ఈసారి ఐపీఎల్‌లో తోపులు తుస్సుమంటే… కొత్త కొత్త ప్లేయర్లు క్లిక్కయి, ఆటకు కొత్త మజాను అద్దుతున్నారు… అందులో ప్రత్యేకం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ… ముందే చెప్పుకున్నట్టు మళ్లీ ఈ పిల్లాడే ఇప్పుడు కీలకం అయ్యాడు… ఇంట్రస్టింగుగా… అదెలాగో చెప్పుకుందాం…
నిన్న లక్నో మీద పంజాబ్ గెలిచింది… లక్నోకు వచ్చేది లేదు, పోయేది లేదు… పంజాబ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్… వరుసగా ఏడు మ్యాచులు ఓటమి లేకుండా సాగి, తరువాత వరుసగా 6 మ్యాచులు ఓడిపోయిన అప్రతిష్ట… ఇది గెలిస్తేనే ప్లేఆఫ్ పోరులో ఉండే స్థితిలో… గెలిచింది… కాస్త ఊపిరి పీల్చుకుంది… కానీ అయిపోలేదు…
Ads
తనకున్నవి నాలుగో ప్లేసులో 15 పాయింట్లు… కానీ ఈరోజు రెండు చివరి, క్రూషియల్ మ్యాచులున్నయ్… ఇందులో రాజస్థాన్ రాయల్స్ గనుక ముంబై మీద గెలిస్తే, రాజస్థాన్ నేరుగా ప్లేఆఫ్‌కు వెళ్లిపోయి, పంజాబ్ సర్పంచ్ సాబ్ ఆశల మీద నీళ్లు చల్లినట్టే… రాజస్థాన్ జట్టు గెలవాలంటే బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడితేనే సాధ్యం…
ఒకవేళ రాజస్థాన్ గనుక ముంబై మీద ఓడిపోతే… ఇక అది ఇంటికే నేరుగా పోవడమే..! కానీ అప్పుడు ఢిల్లీ- కలకత్తా జట్ల మ్యాచ్ కీలకం అవుతుంది… అందులో ఢిల్లీ గనుక గెలిస్తే పంజాబ్ సేఫ్… కానీ కలకత్తా గనుక గెలిస్తే అదీ 15 పాయింట్లతో పంజాబ్‌కు ఈక్వల్ అవుతుంది… అప్పుడిక నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది…
అలా రన్‌రేటులో ముందుండాలంటే… కలకత్తా ఢిల్లీని 77 రన్స్ తేడాతో ఓడించాలి (వాళ్లు 200 రన్స్ చేస్తే)… ఒకవేళ కలకత్తా చేజింగులో ఉంటే 12 – 13 ఓవర్లలో ఏకంగా 180 రేన్స్ చేయాలి… కష్టమే… కానీ ఐపీఎల్ కదా, ఎప్పుడు ఎలాగైనా జరగొచ్చు…

ఈ టేబుల్ ప్రకారం టాప్-2లో ఉన్నవి…
Royal Challengers Bengaluru – 18 పాయింట్లు
Gujarat Titans – 18 పాయింట్లు
కాబట్టి ప్రస్తుతం క్వాలిఫయర్-1 మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరుగుతుంది. అంటే: Royal Challengers Bengaluru vs Gujarat Titans… ఇందులో విజేత నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.
అలాగే: 3వ స్థానంలో Sunrisers Hyderabad ఉంది, నాలుగో స్థానం ఎవరికి ఈరోజు ఖరారైతే వాళ్లతో హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది… ఎవరు ఓడిపోతే వాళ్లు ఇంటికే… ఒకవేళ రాజస్థాన్ ఈరోజు గెలిచి నాలుగో ప్లేసుకు వెళ్తే… అది గట్టెక్కడానికి కూడా మళ్లీ బుడ్డోడే కీలకం అవుతాడు… మొత్తానికి సీజన్‌ను నీ చుట్టూ భలే తిప్పుకుంటున్నావు కదరా చిన్నోడా..!
Share this Article