Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“నో ఫిక్సింగ్, నో దందా, నో గుజరాత్..! మళ్లీ ఆర్సీబీ… జయహో కోహ్లీ..!

May 31, 2026 by M S R

.

బాగా ప్రచారం జరిగింది… జైషా ఈసారి ఐపీఎల్ సీజన్ విజేతగా గుజరాత్‌ను ఫిక్స్ చేశాడు, అందుకే అహ్మదాబాద్‌ను ఫైనల్ వేదికగా మార్పించాడు అని..! నిజానికి త్వరగా ప్లే ఆఫ్ చేరడం, అనూహ్యమైన ఫలితాలతో గుజరాత్ దూసుకువచ్చిన తీరుతో చాలామంది, ఓహో, అది నిజమే కావచ్చు సుమీ అని నమ్మారు…

కానీ నిజం కాదన్నమాట… డిఫెండింగ్ ఛాంపియన్ బెంగుళూరు జట్టు మరోసారి, వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్ ముద్దాడింది… ఇక్కడ ఓ విషయం చెప్పాలి… ఫుట్ బాల్ మ్యాచుల్లో ఎవరు బాల్ తీసుకొస్తారు, అందరినీ తప్పించుకుంటూ… గోల్ పోస్ట్ దాకా వస్తాడు, ఇంకెవరో అందుకుంటారు, గోల్ చేస్తారు… వాడే విజేత… ఫైనల్స్‌లో తోటి వికెట్లు పడిపోతున్నా, కోహ్లీ నిలబడ్డాడు, అసలే చేజింగ్ స్టార్… హాఫ్ సెంచరీ (75) దాటాడు, గెలిపించాడు…. కాదు, తను గెలిచాడు..!!

Ads

క్రికెట్ ఐపీఎల్ మ్యాచులే తీసుకుందాం… ఎన్నోమంచి క్యాచులు, ఎన్నో మంచి బాల్స్, ఎన్నో మంచి వికెట్లు, ఎన్నోమంచి ఇన్నింగ్స్ ఎట్సెట్రా మ్యాచుల ఫలితాల్ని నిర్దేశిస్తాయి… కానీ అంతిమంగా హైలైట్ అయ్యేది ఎవరు..? చివరకు విజేతగా కాలరెగరేసేవాడే… గత సీజన్, ఈ సీజన్ విజేత కోహ్లీ… నిజంగా నిజం ఇదే…

పేరుకు తను కెప్టెన్ కాకపోవచ్చు, తనను అందరూ ఓవర్సీస్ క్రికెటర్ అని వెక్కిరించవచ్చు… కానీ ఒక ధోనీ ఔట్, ఒక రోహిత్ శర్మ ఔట్… కానీ కోహ్లీ మాత్రం ఈరోజుకూ సూపర్ హిట్… ఇప్పటికీ తను ఫీల్డింగ్, బ్యాటింగ్, జట్టు వ్యూహాల్లో కోహ్లీ పర్‌ఫెక్ట్, యాక్టివ్… అన్నింటికీ మించి ఈ సూపర్ ఛేజర్ ఈరోజు కూడా అదే దూకుడుతో ఉన్నాడు…

సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్… ఇలా చాలామంది హైలైట్ అయ్యారు ఈ సీజన్‌లో… కానీ అంతిమంగా కోహ్లీ హీరోగా నిలిచాడు… అదృష్టం, ప్రతిభ, ఇంకా ఇంకా ఆడాలి, గెలవాలనే కసి, తపన… ప్రత్యేకించి చేజింగ్‌ను ప్రేమించి, వేటాడే ధోరణి… కోహ్లీ రియల్ హీరో… లక్షాఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట కప్ అందుకోవడానికి పక్కాగా అర్హుడే…

ఈసారి బలంగా పోటీపడ్డ ఇతర జట్లు రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ కూడా..! పెద్ద పెద్ద తోపులు ఉన్నారనే ఫుల్ హైప్ క్రియేటయిన ముంబై, చెన్నై వంటి జట్లు అడ్డంగా చేతులెత్తేశాయి… చివరకు ఓ కన్సిస్టెన్సీతో ఆడుతూ వస్తున్న బెంగుళూరు రెండోసారి కప్ ముద్దాడింది… ఈ ఐపీఎల్ సీజన్‌కు శుభం కార్డు..!!

చివరగా… రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో తప్పకుండా కోహ్లీ ఉండాల్సిందే… అదీ కోహ్లీ నిరూపించుకున్నాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions