Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మూడో ప్రపంచ యుద్దానికి కొత్త బెడద… ఇరాన్ అణుపరీక్షలు… సన్నాహాలు…

October 7, 2024 by M S R

.

ఇజ్రాయేల్ Vs ఇరాన్… Part 1

ఇరాన్ అణుపరీక్ష జరిపిందా?

Ads

.
5-10-2024 న మధ్యాహ్నం 12.15 లకి ఇరాన్ లోని కవిర్ ఎడారి (Kavir Desert ) లో 4.5 మాగ్నిట్యూడ్ తో భూకంపం వచ్చినట్లు రికార్డ్ అయ్యింది!

భూకంపం రికార్డ్ అయిన కవిర్ ఎడారి భూకంపాలు వచ్చే జోన్ లో లేదు!

కవిర్ ఎడారి ఇరాన్ లోని సేమ్నాన్ ప్రావిన్స్ (Semnan Province ) లో ఉంది మరియి టేహ్రాన్ కి 150 km దూరంలో ఉంది!

4.5 మాగ్నిట్యూడ్ భూకంపం అనేది చిన్నది. ఈ ప్రదేశం సీస్మిక్ జోన్ లో లేదు. అంటే తరుచూ భూకంపాలు వచ్చే జోన్ లో లేదు.

సాధారణంగా భూగర్భ అణు పరీక్షలు జనావాసాలకి దూరంగా ఎడారులలో చేస్తారు!

అణు పరీక్షలు జరిపినప్పుడు 2.5 నుండీ 4.5 మధ్యలో ప్రకంపనలు రికార్డ్ అవుతాయి రిక్టర్ స్కేల్ మీద!

ఇరాన్ పక్కనే ఉన్న ఆర్మేనియాలో భూ ప్రకంపనలు రికార్డ్ చేసే సీస్మిక్ కేంద్రం ఉంది.

ఆర్మేనియా అధికారుల కధనం ప్రకారం భూ ప్రకంపనలు వచ్చిన తీరు పరిశీలిస్తే అది అణు పరీక్ష జరిపినట్లుగా ఓకే ఒక్క ప్రకంపన రికార్డ్ అయింది. అదే భూకంపం అయితే కనీసం రెండు నుండీ మూడు ప్రకంపనలు వస్తాయి!

*******
ఇరాన్ అణు పరీక్ష జరిపింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి!
మరి అమెరికన్ నిఘా ఉపగ్రహాల కళ్ళు కప్పి అనుమానం రాకుండా ఇరాన్ మానేజ్ చేయగలిగిందా?
శతాబ్దాల కాలం నుండీ పర్షియాలో భూమి లోపల సొరంగాలు తవ్వి వాటిలో నివాసం ఉండే సాంప్రదాయం ఉంది!

గాజాలో 450 కిలోమీటర్స్ పొడవైన సొరంగాలు తవ్వారు హమాస్ ఉగ్రవాదులు. అదీ ఇజ్రాయెల్ కి అనుమానం రాకుండా!

సిరియా నుండీ లెబనాన్ లోకి సొరంగాలు తవ్వి హెజ్ బొల్లా తీవ్ర వాదులు రాకపోకలు సాగిస్తున్నట్లు IDF కనుగొన్నది వారం క్రితం!

సిరియా నుండీ లెబనాన్ కి రోడ్ మార్గం ఉంది. ఇజ్రాయేల్ ఏదో ఒక రోజు రోడ్ ని ధ్వంసం చేస్తుందని తెలుసు కాబట్టి సొరంగాలు తవ్వారు. ఒక మిలిటరీ హెవీ ట్రక్ సాఫీగా ప్రయాణించగల పెద్ద సొరంగాలు అవి.

అదే ఇరాన్ విషయానికి వస్తే వాళ్ళ దేశంలో సొరంగాలు తవ్వలేరా? అదీ 150 KM దూరం!

 

*********
ఇరాన్ అణు ప్రోగ్రాం!

2003 వ సంవత్సరం లో అమెరికా, UN లు కలిసి ఇరాన్ అణు కార్యక్రమం మీద ఆందోళన వెలిబుచ్చాయి. ఇరాన్ మేము అణు విద్యుత్ కోసమే రియాక్టర్లు కట్టాలనుకుంటున్నాము అని ప్రకటించింది కానీ అప్పటికే జరుగుతున్న పనులని ఆపేసింది!

మళ్ళీ 2015 లో ఇరాన్ అణు కార్యక్రమం గురుంచి వార్తలలోకి వచ్చింది! 2014 లో రష్యా అనుకూల ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ మీద దేశ ద్రోహం కేసుపెట్టడంతో యనుకోవిచ్ రష్యా పారిపోయాడు.

2015 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్ తో చర్చలు జరిపి ఇరాన్ అణు కార్యక్రమం మీద అంతర్జాతీయ అణుశక్తి సంఘం తనిఖీ జరిపి అణు బాంబు తయారు చెయ్యట్లేదు అని నిర్ధారణ జరిగాక ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తి వేస్తామని ప్రతిపాదన చేశాడు. బదులుగా ఇరాన్ కి చెందిన డాలర్ల ని వాడుకోవచ్చు స్వేచ్ఛగా!

ఇరాన్ అంగీకరించడంతో ఒప్పందం మీద సంతకాలు చేశాయి ఇరు దేశాలు. దీనిని జాయింట్ కంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA ) అని పిలుస్తారు.

2018 లో అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ JCPOA ని రద్దు చేశాడు ఒప్పందం ఏకపక్షంగా ఉంది అంటూ!

2018 నుండీ తన అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చేయడం మొదలు పెట్టింది ఇరాన్! తన అణు కార్యక్రమం అనేది విద్యుత్ ఉత్పత్తి కోసమే అని ఇరాన్ చెప్తున్నా అనుమానాలు మాత్రం అణు బాంబు కోసమే అని చెప్పుకోవచ్చు.
ఇరాన్ దగ్గర క్రూడ్ నిల్వలతో పాటు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి.
సహజ వాయువుతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు చాలా తక్కువ ఖర్చుతో. కాబట్టి ఇరాన్ చెప్తున్నట్లు అణు విద్యుత్ కోసం అయితే కాదు. ఈ విషయం విద్యుత్ ఉత్పత్తి చేసే అన్ని దేశాలకి తెలుసు.

ప్రస్తుతం ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసిన యూరేనియం (enriched uranium ) ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇది అణు బాంబు తయారు చేయడానికి పనికి వస్తుంది. అయితే కనీసం మూడు అణు బాంబులు చేయడానికి సరిపడా శుద్ధి చేసిన యూరినియం ఉంది ఇరాన్ దగ్గర.

అమెరికా, ఇజ్రాయేల్ దేశాలతో పాటు సౌదీ అరేబియా, UAE, జోర్దాన్ దేశాలకి కూడా ఇరాన్ అణు బాంబు అనేది భయం కలిగించే అంశం!

ఇరాన్ లో 2020 లో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించింది ఇజ్రాయేల్. అప్పట్లో ఈ విషయం బయటికి రాలేదు. 2024 MARCH నెలలో కోవర్ట్ ఆపరేషన్ జరిగిన సంగతి బయటపడ్డది.

AEOI ( Atomic Energy Organization of Iran ) అనేది ఇరాన్ లోని ఎనర్జీ కి సంబంధించిన వ్యవహారాల్ని చూసే ఇరాన్ అధికార సంస్థ.

AEOI 2020 జులై లో టెహ్రాన్ దగ్గర ఉన్న షబబాద్ (Shababad ) ఇండస్ట్రీయల్ ప్రోడక్షన్ వర్క్ షాప్ నిర్వహించింది! అయితే ఈ వర్క్ షాప్ లో తీవ్ర అగ్నిప్రమాదం జరిగింది. అలా ఆ వర్క్ షాప్ విఫలం అయ్యింది. కానీ ఈ విషయం బయటికి రాలేదు.

గత మార్చి నెలలో మాత్రమే విషయం బయట పడ్డది! ఎలా?
ఒక హాకర్స్ గ్రూపు ఇరాన్ అణు కార్యక్రమం చూస్తున్న AEOI నుండి డాక్యుమెంట్స్ దొంగిలించింది!

ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి….

2020 లో మోస్సాద్ ముగ్గురు ఇరాన్ పౌరులకి డబ్బు ఆశ చూపి తన తరపున పని చేయడానికి ఒప్పించింది. ఈ విషయం ఇరాన్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది కానీ వాళ్ళ పేర్లు కనుక్కోలేక పోయింది. మోస్సాద్ ఏ పని మీద తమ వాళ్ళని రిక్రూట్ చేసుకుందో వివరాలు సేకరించే పనిలో ఉండగానే ఇండస్ట్రీయల్ ప్రోడక్షన్ వర్క్ షాప్ తగలబడి పోయింది.

ఇరాన్ ఇంటెలిజెన్స్ ఎట్టకేలకి వర్క్ షాప్ తగలబెట్టిన వాళ్ళని పట్టుకొని విచారించగా అసలు విషయం బయట పడ్డది.

మాసౌద్ రహీమి, మోస్తాఫా, మొహమ్మద్ అనే ముగ్గురు అన్నాదమ్ముళ్ల ని మోస్సాద్ ఒక్కొక్కరికి 2.7 బిలియన్ రియాల్స్ ( $ 10,000 డాలర్లు ) ఇస్తామని బదులుగా వర్క్ షాప్ తగులబెట్టాలని అడిగింది. అయితే వర్క్ షాప్ చాలా పెద్దదిగా ఉండడంతో ముగ్గురు సరిపోరని మరో ఆరుగురు అవసరం అవుతారని మౌసాద్ రహీమి అడగడంతో వాళ్లకి కూడా ఒక్కొక్కరికి 10 వేల డాలర్లు ఇస్తామని మోస్సాద్ చెప్పింది.

ఆ వర్క్ షాప్ కి కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని కట్టేసి వర్క్ షాప్ ని తగలపెట్టారు! నిజానికి వీళ్ళకి తమదేశ అణు బాంబు తయారు చేసే వర్క్ షాప్ ని తగులపెడుతున్నాము అని తెలియదు.

షబాద్ లో న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి వివరాలు అంతర్జాతీయ అణు శక్తి సంఘంకి తెలియచేయలేదు ఇరాన్. ఈ విషయం బయటపెట్టాలానే ఉద్దేశ్యంతోనే మోస్సాద్ కోవర్ట్ ఆపరేషన్ ఉద్దేశ్యం!

 

*******
మొన్న అణు పరీక్షతో ఇరాన్ అణు బాంబు తయారు చేయగల స్థితిలోకి వచ్చేసినట్లే!

మూడు రోజుల క్రితం డోనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ ఇంకా ఆలస్యమ్ ఎందుకు? కొట్టాల్సిన చోట కొడితే సరి అన్నాడు. అంటే వచ్చే నెలలో జరిగే ఎన్నికలలో తాను గెలిస్తే ఇరాన్ అణు స్థావరాల మీద దాడికి ఆదేశిస్తాను అనే సంకేతం ఇచ్చాడు హెచ్చరికగా!

పోనీ కమలా హారీస్ గెలిచినా డెమోలు ఇరాన్ మీద దాడికి ఒప్పుకుంటారు. So! ఇరాన్ అణు పరీక్ష జరిపి హెచ్చరిక చేసింది!

ఇప్పుడు సమస్య మరింత జఠీలంగా మారింది! ముందే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేసుంటే బాగుండేది అని ఇప్పుడు అమెరికా, ఇజ్రాయేల్ తల పట్టుకొని ఉంటుండవచ్చు.

ఒక్కటే ఊరట! అదేమిటంటే అణు పరీక్ష జరుపగానే బాంబు తయారు చేయలేరు. కనీసం నెల రోజులు పడుతుంది డేటా విశ్లేషణ చేసి ముందుకు పోవడానికి!

Contd… part 2……. మధ్యప్రాచ్యం సెగ భారత్ మీద ఉండబోతున్నది అది ఎలా అన్నది పార్ట్ 2 లో తెలుసుకుందాం…. (పొట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions