.
Pardha Saradhi Upadrasta ….. ఇరాన్ ఇప్పుడు ఒక తిరుగులేని చారిత్రక దశలోకి ప్రవేశించింది. ఇది ఆర్థిక నిరసన కాదు. ఇది మతపరమైన అసంతృప్తి మాత్రమే కాదు. ఇది రాజకీయ వ్యవస్థను పూర్తిగా కూల్చే దశకు చేరుకున్న ప్రజా చైతన్యం.
విప్లవాలు ఒక్కరోజులో మొదలవు. అవి ఒక కీలక గీత దాటిన తర్వాతే ఇంకా తొందరగా పేలుతాయి. దాన్నే నేను “మనం ఇది చేయగలం” అనే సమూహ అవగాహన రేఖ అంటాను. ప్రజలు ఆ రేఖ దాటాక వెనక్కి చూడరు. ఒకసారి ప్రజల సామూహిక చైతన్యంలో ఈ పాలనను ఓడించగలమనే నమ్మకం బలంగా నాటుకుపోతే,ఆ తర్వాత చరిత్ర వెనక్కి తిరగదు. ఆ తరుణం ఇరాన్ లో వచ్చింది అనే చెప్పాలి.
Ads
ఆ క్షణమే — రూపకంగా చెప్పాలంటే సింహం పంజా విసిరే క్షణం.
ఈ దశ ఒక్కసారిగా రాలేదు
ఈ స్థితికి పునాది పడింది:
• 2017 — ఆర్థిక కష్టాలు, నిరుద్యోగం
• 2019 — ఇంధన ధరల పేలుడు, వేల మంది హత్య
• 2022 — మహ్సా అమిని మరణం, మహిళా నేతృత్వ ఉద్యమం
ఈ మూడు ఉద్యమాలు ఒక నిజాన్ని ప్రజలకు బలంగా తెలియజేశాయి: ఇరాన్ ప్రజల్లో మెజారిటీ ఈ ఇస్లామిక్ రిజీమ్‌ను కోరుకోవడం లేదు. పాలనకు ఎదురుదాడి చేయడం సాధ్యమే. ప్రజలు ఒంటరిగా లేరు — సంఖ్యలో, ధైర్యంలో, కోపంలో
ఈ అవగాహనే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటుకు ఇంధనం అవుతోంది.
రిజీమ్ ముందున్న రెండు భయంకర ఎంపికలు
🔴 ఎంపిక–1 : 2019 తరహా సంపూర్ణ అణచివేత
వేల మందిని చంపడం. నగరాలన్నింటినీ రక్తంతో ముంచడం. బసీజీ, ఐఆర్‌జీసీని పూర్తిగా దించటం
కానీ ఇది రిజీమ్‌కు అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం.
ఎందుకంటే:
• ఇది ప్రజలను మరణభూమిలోకి నెట్టేస్తుంది
• “ఇప్పుడు చావు లేదా స్వేచ్ఛ” అనే దశకు తీసుకెళ్తుంది
• అంతర్జాతీయంగా రిజీమ్ పూర్తిగా ఒంటరిగా మారడం
• Donald Trump స్పష్టంగా మాస్ హత్యలపై రెడ్ లైన్ గీసాడు
• ముఖ్యంగా — Israel , తెహ్రాన్ మీద ఒక కన్ను వేసి ఉంది, ఈ తరహా అణచివేత జరిగితే సిస్టమ్‌ను తొలగించాల్సిన సమయం వచ్చిందని భావించే అవకాశం ఎక్కువ
ఈ మార్గం రిజీమ్‌కు త్వరిత ఆత్మహత్య.
🟠 ఎంపిక–2 : నెమ్మదిగా ఊపిరాడకుండా చేయడం
ఇదే ఇప్పటివరకు రిజీమ్ ఉపయోగించిన “మేధస్సు”.
• ఎంపిక చేసిన అరెస్టులు
• రహస్య హత్యలు
• ఉరి శిక్షలు
• భయాన్ని నియంత్రిత స్థాయిలో ఉంచడం
భయం ఉండాలి కానీ ప్రజలకు “మనం ఏం చేసినా చచ్చిపోవాల్సిందే” అనే భావన రాకూడదు — ఇదే వారి లెక్క.
కానీ ఈసారి సమస్య ఏంటంటే:
ఇరాన్ రెజిమ్ ఇక 2019లాగా బలంగా లేదు, ఆర్థికంగా కూలిపోయింది, అంతర్గత భద్రతా వ్యవస్థపై నమ్మకం తగ్గింది, ప్రజల కోపం నియంత్రణ దాటి పోయింది
ఈ దశలో రిజీమ్‌కు సాధ్యమైన బెస్ట్ కేస్ సీనారియో కూడా ఆలస్యం అయిన పతనం మాత్రమే.
ప్రతి ఆలస్యం ప్రజలకు మరింత ధైర్యం ఇస్తుంది. తదుపరి అవకాశం వచ్చిన వెంటనే విప్లవం ఇంకా ఉగ్రంగా మారుతుంది.
అసలు మూలకారణం: ఇది ఎప్పటికీ సరిదిద్దబడదు
ఈ పాలన
• దేశ సంపదను గ్లోబల్ టెర్రర్ నెట్‌వర్క్‌లపై ఖర్చు చేసింది.
• దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది
• యువత భవిష్యత్తును మూసేసింది
• మహిళలపై, స్వేచ్ఛపై యుద్ధం చేస్తోంది
ఈ మూలకారణాలు మారవు కాబట్టి: సంఘర్షణ తప్పదు, విప్లవం తప్పదు. ఇక సమయం సమస్య మాత్రమే.
నేలమీద వాస్తవ పరిస్థితి
• అసదాబాద్ లో నిరసనకారులు బసీజీ హెడ్‌క్వార్టర్స్‌ను ఆక్రమించి నిప్పంటించారు
• కెర్మన్షా లో లైవ్ రౌండ్లతో కాల్పులు
• వీధుల్లో వినిపిస్తున్న నినాదం: “ఇది చివరి పోరు — పహ్లవి తిరిగి వస్తాడు”
ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇది భయాన్ని దాటి పోస్ట్-ఫియర్ దశలోకి ప్రజలు వెళ్లిన సంకేతం.
ముందున్న దృశ్యం
గత కొన్ని ఏళ్లలో ఈ రిజీమ్ ఒక అంగవైకల్యం చెందిన పాలనగా మారింది. మంచి ఎంపికలు లేవు. చెడు ఎంపికలు మాత్రమే ఉన్నాయి.
అందుకే 2026లో ఇరాన్ మత గురువు Ali Khamenei మాస్కో వైపు విమానంలో వెళ్ళి రష్యాలో శరణు కోరినా అది ఆశ్చర్యం కాదు — అది చరిత్రలో సహజ ముగింపు.
విప్లవం మొదలైంది. ఇది నిరసన దశను దాటి పోయింది. ఇది ఆగే స్థితిలో లేదు. — ఉపద్రష్ట పార్ధసారధి
#IranRevolution #IranProtests #RegimeChange #MiddleEast #Geopolitics #Pahlavi #WorldAffairs #pardhatalks
Share this Article