.
Pardha Saradhi Potluri …. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చాడని సామెత!
అమెరికన్ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ ఇంటి వెనకాల చావలేదు కానీ ఒక చిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల తీవ్రంగా గాయపడి చావు తప్పి కన్ను లొట్టపడి చివరికి బ్రతుకు జీవుడా అని అత్యవసర లాండింగ్ అవ్వాల్సి వచ్చింది!
ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికన్ F-35 ని చావు దెబ్బ కొట్టింది!
మార్చి 19 న ఇరాన్ గగనతలం మీద స్వేచ్ఛగా ఎగురుతున్న F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ మీదకి IRGC తన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో మిసైల్ ని ప్రయోగించి చావు దెబ్బ కొట్టింది!
IRGC వీడియో ఫుటేజ్ ని విడుదల చేసింది!
Ads
IRGC తమ మీసైల్ కి ఉన్న ఫార్వర్డ్ లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా తీసిన వీడియోని విడుదల చేస్తూ తమ మిసైల్ F-35 ని డామేజి చేసినట్లుగా తెలిపింది!
మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన మిసైల్ నేరుగా F-35 ని ఢీ కొట్టలేదు! టార్గెట్ సమీపంలోకి వెళ్లి షార్ప్నెల్స్ ని రిలీజ్ చేసింది! మిసైల్ పేలి షార్ప్నెల్స్ రిలీజ్ చేయగానే ఇన్ఫ్రారెడ్ కెమెరా ధ్వంసం అయిపోయి వీడియో రికార్డింగ్ ఆగిపోయింది!
మిసైల్ రిలీజ్ చేసిన షార్ప్నెల్స్ F-35 కి తగలడంతో పైలట్ దగ్గరలో ఉన్న అమెరికన్ బేస్ లో ఎమర్జెన్సీ లాండింగ్ చేశాడు!
ఫిబ్రవరి 28 న అమెరికన్ GA-18A గ్రోలర్ వెనిజులాలో చేసినట్లుగానే ఇరాన్ లో కూడా రాడార్ వ్యవస్థని జామ్ చేసింది! తరువాత ఇజ్రాయేలి F-15i లు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ధ్వంసం చేశాయి! అప్పటి నుండి అమెరికన్, ఇజ్రాయేల్ ఫైటర్స్ ఇరాన్ గగనతలం మీద ఎగురుతూ స్వేచ్ఛగా బాంబింగ్ చేస్తూ వచ్చాయి!
కానీ అనూహ్యంగా నిన్న IRGC మొబైల్ లాంచర్ తో F-35 ని దెబ్బతీయడం ఆశ్చర్యం కలిగించింది!
IRGC మిసైల్ ఇన్ఫ్రారెడ్ వీడియో రిలీజ్ చేయడం, CNN దానిని నిర్ధారించడం జరిగింది!
మజీద్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్! Majid Short Range Air Defence System! AD -08 అని కూడా పిలుస్తారు!
2021 లో ఇరాన్ తన స్వంత డిజైన్ తో డెవలప్ చేసిన మజీద్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని సైన్యంలో ప్రవేశ పెట్టింది!
మజీద్ ఎయిర్ డిఫెన్స్ అనేది ఇన్ఫ్రారెడ్ హీట్ సీకింగ్
మిసైల్స్ ని ప్రయోగిస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ జామింగ్ చేయడం అనేది కుదరదు!
ఒకసారి టార్గెట్ ని చూపించి ప్రయోగిస్తే మిసైల్ లో ఇంధనం అయిపోతే తప్పితే టార్గెట్ ని వదలదు!
అమెరికన్ F-35 పైలట్ కి తెలియదా?
తెలిసే అవకాశం ఉండదు! ఇతర ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ రాడార్ హోమింగ్ లేదా సెమీ రాడార్ హోమింగ్ వ్యవస్థని వాడుతాయి కాబట్టి F-35 లో ఉండే మిసైల్ అప్రోచింగ్ రాడర్ వార్నింగ్ సిస్టమ్ ఉంటుంది అంటే 360 డిగ్రీల కోణంలో మిసైల్ దూసుకువస్తుంటే పైలట్ కి వార్నింగ్ అలారం ఇస్తుంది! తన మీదకి దూసుకు వస్తున్న మిసైల్ లో ఉండే రాడార్ సిగ్నల్స్ ని పసిగట్టి వార్నింగ్ ఇస్తుంది!
కానీ మజీద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వదిలిన మిసైల్ ఇన్ఫ్రారెడ్ హీట్ సీకర్ తో పనిచేస్తుంది కాబట్టి, F-35 ఇంజిన్ నుండి వచ్చే వేడిని( Heat Signature ) ఆధారం చేసుకొని వెంబడించి దాడి చేస్తుంది కాబట్టి, F-35 పైలట్ కి తన జెట్ ని మిసైల్ వెంటాడుతున్నట్లు తెలియదు!
మరి F-35 స్టెల్త్ ఫైటర్ కదా? మజీద్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ ఎలా చూడగలిగింది?
రెండు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది!
1.F-35 వెళ్లే దారిలో మజీద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండి ఉంటుంది. హీట్ సిగ్నేచర్ ఉన్న వైపు మిసైల్ ని ప్రయోగిస్తే చాలు ఎక్కడ ఎక్కువ వేడి జెనరెట్ అవుతున్నదో అటువైపు వెళ్లి టార్గెట్ దగ్గరకి రాగానే మిసైల్ ముందు భాగంలో ఉండే షార్ప్నెల్స్ ( పొడుగ్గా, బలంగా ఉండే సూదుల లాంటి రాడ్స్, గుండ్రటి ఐరన్ బాల్స్ ) వేగంగా వెళ్లి ఇంజిన్ ని ఢీ కొడతాయి!
2. F-35 కి యాంటి రాడార్ మెటీరియల్ పెయింట్ వేసి ఉండకపోవచ్చు! ARM ( Anti Radar Material ) కోటింగ్ గాల్లోకి ఎగరక ముందే విమానం మీద వేస్తారు. మళ్ళీ కిందకి దిగి ఎగిరే ముందు మళ్ళీ ఇంకో కోటింగ్ వేస్తారు. ARM అనేది రేర్ ఎర్త్ మినరల్స్ తో తయారుచేస్తారు. ARM కోటింగ్ వేయడం వలన రాడార్ సిగ్నల్స్ జెట్ కి తగిలి తిరిగి వెనక్కి వెళ్లవు కాబట్టి రాడార్ గుర్తించలేదు!
3.చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ని అమెరికాకి ఎగుమతి చేయడం ఆపేసి 7 నెలలు అవుతున్నది కాబట్టి ARM షార్టెజ్ ఉండడం వలన కోటింగ్ వేసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇరాన్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని నాశనం చేసామనే ధీమాతో ARM కోటింగ్ వేయకుండానే పెట్రోలింగ్ కి పంపించి ఉండవచ్చు!
జస్ట్! మహీంద్రా పిక్ అప్ వాన్ సైజులో ఉండే మజీద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో 100 మిలియన్ డాలర్ల F-35 దెబ్బతిని ఎమర్జెన్సీ లాండింగ్ అవడమే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి!
ఇదే రీతిలో రష్యన్ Su -35 ని నాటో సైనిక అధికారులు దగ్గర ఉండి మరీ ఉక్రెనియన్ సైనికుల చేత కూల్పించారు 2024 డిసెంబర్ లో!
ఇప్పుడు పుతిన్ పర్షియన్ ల చేత F-35 ని దెబ్బకొట్టించాడు!
ట్రంప్ హెచ్చరిక :
ఇరాన్ కి సహకరించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ ని హెచ్చరించాడు ట్రంప్!
పుతిన్ నిశ్శబ్దంగా పనిచేసుకుపోతాడు తప్పితే రంకెలు వేయడు!
నిజం ఎంతవరకో తెలియదు కానీ ఒక వార్త వైరల్ అవుతున్నది గత కొంత కాలంగా, అది……
- ఎప్స్టీన్ ఫైల్స్ ని చూపించి నెతన్యాహు ట్రంప్ ని బ్లాక్ మెయిల్ చేస్తే, మరోవైపు అంతకంటే ప్రమాదకరమైన సాక్ష్యాలు పుతిన్ దగ్గర ఉన్నాయని ట్రంప్ భయపడుతున్నాడు అని వార్త! పుతిన్ బహిరంగంగా ఏదీ అనడు!
Share this Article