.
ఇరాన్ మీద ఇజ్రాయేల్ దాడి! Part 2 …… Days of Response!
రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలకి అమెరికా, ఇజ్రాయల్ దేశాలు ఒక సున్నితమైన హెచ్చరిక చేశాయి!
Ads
పాత తరం ఆయుధాలకి కొత్త పేర్లు, మోడల్ నంబర్స్ పెట్టి తమ శత్రువులని భయపెట్టడం, వాటిని ఇతర దేశాలకి అమ్మడం ఇక ముందు కుదరదు!
మరీ ముఖ్యంగా రష్యా, చైనాలు జాగ్రత్త పడాలి!
S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనుగడ ఎంత?
అఫ్కోర్స్! ఇప్పటికీ రష్యన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విలువైనదే అనడంలో సందేహం లేదు! కాకపొతే ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహా వృక్షం కదా?
ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే feb 23, 2022 లో రష్యా SMO (Special Military Operation) మొదలు పెట్టాక రెండు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు, 7 S-300 సిస్టంలు ధ్వంసం అయ్యాయి.
ఉక్రెయిన్ రెండు S-400 లని హిమార్స్ రాకెట్స్ తో దెబ్బతీసింది రష్యా భూభాగంలో . మరో రెండు S-300 లని డ్రోన్ దాడితో దెబ్బతీసింది ఉక్రెయిన్.
గత ఏప్రిల్ నెలలో ఒక S-300 ని ధ్వంసం చేసింది ఇజ్రాయేల్ ఇరాన్ లోని ఇస్పాహాన్ ఎయిర్ బేస్ దగ్గర.
గత శనివారం మరో నాలుగు S-300 లని దెబ్బతీసింది ఇజ్రాయేల్!
గత రెండేళ్ల చరిత్రని గమనిస్తే రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఉన్న లోపాలు బయటపడ్డాయి.
ఉక్రెయిన్ దళాలు రష్యన్ S-400 ని టార్గెట్ చేస్తూ HIMARS Gps గైడెడ్ రాకెట్ ని ప్రయోగించినప్పుడు ఉక్రెయిన్ కమాండర్ కి గాని, వాళ్ళతో ఉన్న నాటో యుద్ధ నిపుణులకి కానీ అది టార్గెట్ ని కొట్టగలదు అనే నమ్మకం లేదు. కానీ అనూహ్యంగా HIMARS రాకెట్ S-400 మీదకి దాడి చేయగలిగింది. డేటాని విశ్లేషంచాక తెలిసింది ఏమిటంటే HIMARS రాకెట్ తన మీదకి దూసుకొస్తున్నప్పుడు S-400 రాడార్ ఆలస్యంగా స్పందించింది అని.
S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి ICBM, బాలిస్టిక్, క్రూయిజ్, జెట్ ఫైటర్స్, హెలికాప్టర్ లని ఎదుర్కోవడానికి డిజైన్ చేసింది రష్యా. అఫ్కోర్స్! సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్నప్పటి డిజైన్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ S-200, S-300, S-400 అని పేర్లు పెట్టి అమ్ముతున్నది రష్యా అని రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు!
S-300 కి కొద్దిపాటి మార్పులు చేసి S-400 గా మార్కెట్ చేస్తున్నది అని ఆరోపిస్తున్నారు నిపుణులు.
రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి అదనపు రక్షణ వలయం అవసరం ఉంది. Pantisir అనే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని S-400 కి రక్షణగా పెడుతున్నది రష్యా ప్రస్తుతం.
*********
గత శనివారం ఇజ్రాయేల్ చేసిన దాడిలో ఇరాన్ ఉపయోగిస్తున్న S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లోని రాడార్ స్క్రీన్లు ఆగిపోయాయి అంటే రాడార్ మానిటర్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి! ఇజ్రాయేల్ F-16i లు విజయవంతంగా S-300 ఎయిర్ డిఫెన్స్ రాడార్ మానిటర్లని తన EW (Electronic Warfare ) సూట్ తో స్విచ్ ఆఫ్ చేసింది.
దాంతో S300 సిస్టమ్ పనిచేస్తున్నా కూడా రాడార్ స్క్రీన్లు ఆఫ్ అవ్వడంతో ఆపరేటర్లు నిస్సహాయంగా వాటిని అక్కడే వదిలేసి దూరంగా వెళ్లిపోవడం కొద్ది నిముషాలలోపే IAF వాటి మీద దాడి చేయడం జరిగింది!
ఇరాన్ దగ్గర ప్రస్తుతం షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇజ్రాయేల్ మళ్ళీ దాడి చేయడానికి స్వేచ్ఛగా ఇరాన్ లోకి వచ్చి దాడి చేయగలదు అన్న మాట!
F-35 i లతో పాటు F-15 i, F- 16 i లు ఈసారి ఇరాక్ ఎయిర్ స్పేస్ లో ఉంటూ ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఉండదన్నమాట!
ఇది పరోక్షంగా రష్యాకి హెచ్చరిక!
రెండు నెలల క్రితం రష్యా తన లేటెస్ట్ S-500 ని ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకి తరలించింది అంటే S-400 లో ఏవో లోపాలు ఉన్నట్లుగా భావించాలి!
Well… అలా అని వెస్ట్రన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో లోపాలు లేవని కాదు, కాకపోతే ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే అమెరికన్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని రష్యా ధ్వంసం చేయగలిగింది ఉక్రెయిన్ సరిహద్దులలో!
ఇజ్రాయేల్ కి మాత్రమే సాధ్యమా?
Yes! ఇజ్రాయేల్ స్వంతంగా అభివృద్ధి చేసుకున్న ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ ( EW ) ని తన F16 కి అమర్చింది కాబట్టి విజయవంతంగా S300 లని నిర్వీర్యం చేయగలిగింది!
అఫ్కోర్స్! మనం ఫ్రాన్స్ నుండి కొన్న రాఫెల్ F -3 లు కూడా శత్రు రాడార్లని జామ్ చేయగలవు. స్పెక్ట్రా (SPECTRA EW ) ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ తో. Thanks to THALES & MBDA!
********
ఇరాన్ బట్టలు విప్పిన ఇజ్రాయేల్!
షాహ్రౌద్ స్పేస్ సెంటర్ ( Shehroud Space Centre ).
ఇది నిజానికి స్పేస్ సెంటర్ కాదు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ స్పేస్.
షాహ్రౌద్ స్పేస్ సెంటర్ అంటూ రహస్యంగా ఉంచింది IRGC.
నిజానికి ఇరాన్ కి స్పేస్ ప్రోగ్రాం అంటూ ఏదీ లేదు. ఇక్కడ బాలిస్టిక్ మిసైల్ పరీక్షలని నిర్వహిస్తున్నది ఇరాన్.
షహ్రౌద్ స్పేస్ సెంటర్ లో ఏమేమి ఉన్నాయి?
బాలిస్టిక్ మిసైల్ లాంచ్ పాడ్.
బాలిస్టిక్ మిసైల్ రాకెట్ మోటార్ టెస్ట్ సైట్.
బాలిస్టిక్ మిసైల్ కి కావాల్సిన ఘన ఇంధన (Solid Fuel ) నిల్వ ఉంచిన డిపో.
అయితే IAF షహ్రౌద్ స్పేస్ సెంటర్ మీద దాడి చేసి మిసైల్ లాంచ్ పాడ్ తో పాటు ఘన ఇంధనం నిల్వ ఉంచిన డిపోని కూడా ధ్వంసం చేసింది.
ఘన ఇంధనం తయారు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక మిక్సర్ ప్లాంట్ ని భూగర్భంలో దూరంగా నిర్మించింది ఇరాన్. బంకర్ బస్టర్ బాంబుతో మిక్సర్ ప్లాంట్ ని కూడా ధ్వంసం చేసింది ఇజ్రాయేల్.
So! రాకెట్ ఫ్యూయల్ ని తయారు చేసే మిక్సర్ ని కొత్తగా ఆర్డర్ చేసి కొనుక్కొని మళ్ళీ సాలిడ్ ఫ్యూయల్ ని తయారు చేసుకోవడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది ఇరాన్ కి. మిక్సర్ ని చైనా మాత్రమే ఇవ్వగలదు. అదీ ఆరు నెలల తరువాత!
సాలిడ్ ఫ్యూయల్ ని తయారు చేసే ప్లాంట్ షాహ్రౌద్ కి దూరంగా టెహ్రాన్ కి దగ్గరగా ఉన్న పర్చిన్ ( Parchin ) మరియు ఖోజిర్ (Khojir ) అనే ప్రాంతంలో ఉన్నాయి. 2011 లో షహ్రౌద్ లో మిసైల్ లాంచ్ పాడ్ కి దగ్గరలోనే ఉండేది, అయితే దానిని ఇజ్రాయేల్ పేల్చివేసింది అప్పట్లో.
*********
జెనరల్ అమిర్ ముఖ్టార్, డిప్యూటీ కమాండర్, సౌత్ వెస్ట్రన్ HQ, ఇరాన్ ఆర్మీ ఒక ప్రకటన చేస్తూ మొత్తం 600 మిసైల్స్ ని ప్రయోగించింది ఇజ్రాయేల్ కానీ ఒక్క ఇరాన్ పౌరుడు కూడా మరణించలేదు అని అన్నాడు.
ఇరాన్ కి చెందిన IRGC హెడ్ క్వార్టర్ మీద కూడా ఇజ్రాయేల్ దాడి చేసింది కానీ ఎంత నష్టం జరిగింది అనేది తెలియరాలేదు.
ఒక్క జెట్ ఫైటర్స్ తోనే కాదు. ఇజ్రాయేల్ డ్రోన్లతో కూడా దాడి చేసింది!
*******
నిన్న అంటే మంగళవారం, 05-11-2024 రాత్రి వేళ షుమారుగా 400 బాలిస్టిక్ మిసైళ్ళ తో ఇరాన్ దాడికి సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజుకి వాయిదా వేసినట్లుగా తెలుస్తున్నది!
మరో వైపు హెజ్బొల్లా ఏకంగా 2,000 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయేల్ మీద దాడికి సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది.
So! ఇరాన్ 400 బాలిస్టిక్ మిసైళ్ళతో, హెజ్బొల్లా 2 వేల రాకెట్లతో ఒకేసారి దాడి చేయవచ్చు ఈ రోజు లేదా రేపు రాత్రి!
ఈసారి ఇజ్రాయేల్ ఎదుర్కొగలదా?
కష్టమే! ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రధానికి IDF లోని కొంత మంది అధికారులకి పొసగడం లేదు! ట్రంప్ గెలిచాడు కాబట్టి ఈక్వేషన్స్ లలో మార్పులు కూడా ఉంటాయి!
Share this Article