.
సినిమా ఇండస్ట్రీ చాలా పెడపోకడలకు నివారణ ఏమిటో, అనుసరించాల్సిన అసలు పంథా ఏమిటో ఇరుముడి సినిమా మరోసారి నిరూపించింది… అసలు వయస్సు మళ్లిన ముసలి హీరోలు ఇకనైనా ఏ బాట పట్టాలో కూడా ఇది ఓ పాజిటివ్ పాఠం నేర్పించింది…
సంక్షిప్తంగా చెప్పుకుందాం… ఇది మొదటి రోజే 17 కోట్ల పైచిలుకు వరల్డ్ వైడ్స్ కలెక్షన్స్ రాబట్టింది… మొదటి వారాంతానికే కనీసం 80 కోట్ల వరకూ చేరుతుందని, మొత్తంగా 150 కోట్ల దాకా రాబడుతుందని ఓ ప్రాథమిక అంచనా… రవితేజ వరుస పరాజయాల ప్రస్తుత మార్కెట్‌కు ఇది చాలా చాలా ఎక్కువ…
Ads
రెమ్యునరేషన్ బదులుగా నైజాం రైట్స్ తనే ఉంచుకున్నాడు కాబట్టి తనకే కనీసం 20 కోట్ల వరకూ వచ్చే చాన్స్ ఉంది తనకు… మంచి ప్రాఫిటే… అన్నింటికీ మించి ఇక తన మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, ఈ సినిమా కూడా ఫట్ అన్నట్టుంటే రవితేజ మార్కెట్ ఘోరంగా అడుగంటి ఉండేది… మొత్తానికి అయ్యప్ప దయతో మళ్లీ వెలుగొచ్చింది తన కెరీర్‌లో…
ఒక్కసారి గమనించండి… ఇదే మైత్రి మూవీస్ హీరోలకు అడ్డగోలు రెమ్యునరేషన్లు ఇచ్చి, నానా ఎలివేషన్లతో చెత్తను నింపి, అడ్డగోలు రేట్లకు సర్కారీ పర్మిషన్లు తెచ్చుకుని, నాన్ థియేటరికల్ డబ్బు కోసం నానా కాళ్లూ పట్టుకుని, నానా వేషాలూ వేసేవాళ్లు… కానీ ఇప్పుడు…?

పాన్ ఇండియా వేషాల్లేవు- అడ్డమైన కమర్షియల్ వాల్యూస్ పేరిట నానా చెత్తా నింపలేదు… హీరోయిజం ఎలివేషన్లు లేవు, అన్నింటికీ మించి కుర్ర హీరోయిన్లతో రోత రొమాన్స్ లేదు, జుగుప్సాకరమైన స్టెప్పులు లేవు… జస్ట్, కథకు తారాగణం అంతా లొంగిపోయింది, ఒదిగిపోయింది… దర్శకుడిని మెచ్చుకోవచ్చు…
ప్యూర్ ఎమోషన్, దానికి అవసరమైన సోషల్ మెసేజ్, పిల్లల పెంపకంలో జాగ్రత్తలు… ఎక్కడా కథ దారితప్పలేదు, పక్కదారి పట్టలేదు… పైగా అచ్చంగా తెలుగు సినిమా… డబ్ చేసి, ఇతర భాషల్లోకి వదిలి పాన్ ఇండియా ముసుగులు ఏమీ తొడగలేదు…

హిట్ కొట్టిన పాటలు, అవసరమైనంత వరకే బీజీఎం, చివరలో కన్నీళ్లు పెట్టించే బరువైన క్లైమాక్స్… అంతే… ఐతేనేం, ప్రస్తుతం మార్కెట్‌లో పెద్ద తెలుగు సినిమా ఏదీ లేదు, సరైన సమయంలో రిలీజ్ చేసుకున్నారు… థియేటర్లు ఊగిపోతున్నయ్ స్వామియే శరణం అయ్యప్పా అంటూ…. మల్లెపూల పల్లకీ అంటూ…
కథాకథనాలు బాగుంటే ఏ తలతిక్క కమర్షియల్ రోత పోకడలు అవసరం లేదు… అదనపు షోలు లేవు, అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు లేదు… ప్యూర్ విజయం ఇది… అంటే ఆర్గానిక్ సక్సెస్..!!
Share this Article