మీడియా అంటే ఇంతే… షీనా బోరా అనే మహిళ హత్య, ఇంద్రాణి ముఖర్జీ పాత్ర అనే అంశాల మీద మన మీడియాలో బహుశా ఓ లక్ష వార్తలు వచ్చి ఉండవచ్చు… (పాపం శమించుగాక, గాంధీ హత్య మీద కూడా ఇన్ని వార్తలు రాలేదేమో…) ప్రాంతీయ భాషా మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇంగ్లిషు, హిందీ మీడియా హౌజులు షీనా బోరా హత్య అనగానే శివాలెత్తిపోతాయి… ఒక మహిళ హత్య గురించి ఎందుకింత రచ్చ జరిగిందీ అంటే జవాబు దొరకదు, అది అంతే… ఇదే హత్యకు సంబంధించి రెండు సినిమాలు కూడా వచ్చినట్టు గుర్తు…
కొన్నాళ్లుగా వివేకానందరెడ్డి హత్య కేసు మీద కూడా తెలుగు మీడియా ధోరణి ఇదే… ప్రత్యేకించి ఏపీ పాలిటిక్స్ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ ఉన్న మీడియా అయితే మరీనూ… ఇంతకీ ఆయన ఎవరు..? ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ… ఇంకా..? రాజారెడ్డి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ తమ్ముడు, ప్రస్తుత సీఎం జగన్ బాబాయ్… ఇంకా..? ప్రస్తుతం పొలిటికల్ క్యాంపెయిన్‌కు కేంద్రకం వంటి ఒక హత్య కేసులో హతుడు…
చంద్రబాబును నిందించాడు జగన్ మొదట్లో, సీబీఐ దర్యాప్తు కావాలన్నాడు… తరువాత తను సీఎం అయ్యాక సీబీఐ లేదు, సొంత దర్యాప్తు అన్నాడు,.. వివేకా బిడ్డ ప్రయత్నంతో సీబీఐ కూడా రంగంలోకి వచ్చింది… అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం, ఇన్నేళ్ల జగన్ ప్రభుత్వం, సీబీఐ… ఇప్పటివరకూ కేసును ఎటూ తేల్చలేదు… ఈలోపు రకరకాల ప్రచారాలు… టీడీపీ, వైసీపీ నడుమ బోలెడంత రాద్ధాంతం… ఒకవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ హత్య కేసును అలాగే పచ్చిపచ్చిగా ఉంచుతూ జగన్‌ను దోషిగా జనంలో నిలిపేందుకు బోలెడేన్ని రాతలు…
Ads
మరోవైపు సాక్షి కౌంటర్ క్యాంపెయిన్… ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కిలోమీటర్ పొడవైన వ్యాసం రాసుకొచ్చాడు దీని మీద… గత ఎన్నికల్లోకన్నా ఈ హత్య కేసు ఈ ఎన్నికల్లోనే పెద్ద ఇష్యూ అవుతోంది… సాక్షాత్తూ జగన్ చెల్లెలు షర్మిల దీన్ని కూడా ఓ ఎలక్షన్ ఇష్యూ చేసింది… వివేకా బిడ్డ కూడా షర్మిల పక్కన చేరి జగన్‌ను వేలెత్తిచూపుతోంది… దీని మీద ఆల్రెడీ ఓ సినిమా కూడా వచ్చింది, జగనే అంతా చేశాడు అనే కలర్ ఇస్తూ…
టీడీపీ, వైసీపీ రచ్చకుతోడు ఇప్పుడు కాంగ్రెస్‌కు షర్మిల దొరికింది… కడపలో నిలబెడుతోంది… అక్కడ వివేకా హత్య కేసు నిందితుడు, జగన్ కాపాడుకుంటూ వస్తున్న వైసీపీ తాజా అభ్యర్థి అవినాష్ రెడ్డిని ఓడిస్తే జగన్ ను రాజకీయంగా డీఫేమ్ చేయవచ్చునని ఓ సంకల్పం… నిజంగా కడప జనంలో వివేకా హత్యకు సంబంధించి జగన్‌ను తప్పుబట్టి, ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఓడించి, జగన్‌ను ‘శిక్షించేంత’ సీన్ ఫీల్డ్‌లో ఉందా..? మొన్నటిదాకా తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరిగీ తిరిగీ, కాళ్లరిగి, హఠాత్తుగా ఏపీ రాజకీయాల్లోకి ల్యాండయిన షర్మిల మాటల్ని కడప జనం నమ్ముతారా..?
ఇక్కడ ఆ కేసు మెరిట్స్‌లోకి పోవడం లేదు… ఈ కేసుకు సంబంధించి ఈరోజుకూ జగన్ వద్ద జనాన్ని కన్విన్స్ చేయగల సమాధానమూ లేదు… ఎటొచ్చీ ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని ఈ కేసు చుట్టూ మీడియా, పార్టీలు తిప్పుతున్న తీరే విషాదం… రాష్ట్రంలో ఇక వేరే సమస్యలే లేవా..? ఎన్నికల అంశాలు కాదగినవి, జనంలో చర్చ జరగాల్సినవీ వేరే లేవా..? పోలవరం ఫెయిల్యూర్, రాజధాని సంక్షోభం, రాష్ట్రానికి పెట్టుబడులు వంటి చాలా అంశాలున్నాయి కదా… పోనీ, జగన్ చేసిన ఏవో కొన్ని మంచి పనులైనా జనంలోకి పోవాలి కదా… సర్కారు బడి- ఇంగ్లిష్ మీడియం వంటివి…
అంతా ఆ హత్య కేసు చుట్టే తిప్పడానికి బాబుమీడియా ట్రై చేస్తోంది… కౌంటర్ కోసం ఆయన మీడియా తంటాలు పడుతోంది… ఏం చెప్పుకోవాలో తెలియక, అంతా దేవుడికే ఎరుక అని జగన్ మాట్లాడుతున్నాడు… చంద్రబాబు, షర్మిల విడివిడిగా జగన్ మీద తూటాలు పేలుస్తున్నారు… వీటికితోడు పొలిటికల్ క్యాంపుల నడుమ బూతుల కొట్లాట, బురద జల్లుకునే పోట్లాట సరేసరి… ఎప్పటిలాగే పార్టీల నడుమ జంపింగుల ఆట… ప్రజా సమస్యలు, ఆకాంక్షలు… ఒకటీ అరా ఉండి ఉంటే రాజకీయ సిద్ధాంతాలు గట్రా ఏమీ ఎన్నికల అంశాలు గాకుండా ఓ హత్య కేసు కేంద్రకంగా జరుగుతున్న ఎన్నికలు బహుశా తెలుగునాట ఇదే ప్రథమమేమో..!!
చివరగా… కడపలో చంద్రబాబు అభ్యర్థి పేరుకే బరిలో ఉండనున్నాడు… పరోక్షంగా షర్మిలకు, అనగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడని ఓ డౌట్… ఎందుకంటే… కాగల కార్యం షర్మిల తీరుస్తుంది కాబట్టి… పోనీ, అలా కోరుకుంటున్నాడు కాబట్టి..!!
Share this Article