నానారకాల నిందలతో, వెటకారాలతో, ఉద్దేశపూర్వక దుష్ప్రచారాలతో, ‘అతి జ్ఞాన’ మీడియా ప్రసారాలతో, వక్రీకరణలతో ఆనందయ్య మందుకు అడ్డం పడటానికి సాగిన ప్రయత్నాలను కాసేపు పక్కన పెడదాం… పోనీ, అది పనిచేస్తుందా, ప్రభుత్వం అనుమతించడం కరెక్టేనా అనే డిబేట్‌ను ఇక పక్కన పెట్టేయొచ్చు… ఎందుకంటే.., హైకోర్టు చెప్పింది, ప్రభుత్వం అనుమతించింది… దీన్ని ఆనందయ్య ఎలా సద్వినియోగం చేస్తాడో వేచి చూడాల్సిందే… సోకాల్డ్ టీవీ మేధావులు, అకస్మాత్తుగా తెరమీదకు వచ్చిన మేధావులు, సంప్రదాయ వైద్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే సైన్స్ మేధావులు గట్రా పదే పదే ఆరోపించినట్టు కేవలం ‘ప్లేసిబో’ ఎఫెక్ట్ ద్వారా రోగులకు నయం అవుతుందనే వాదనే నిజం అనుకుందాం… మంచిదే కదా… వేల కోట్ల దోపిడీతో రోగుల ఒళ్లు, ఇళ్లు గుల్ల చేస్తూ, కొత్త రోగాల్ని సృష్టిస్తున్న ఆధునిక వైద్యం కనీసం ఆ ప్లేసిబో ప్రభావాన్ని కూడా చూపించలేకపోతోంది కదా… పైగా మొత్తం డిబేట్‌ను సంప్రదాయ, దేశీయ వైద్యానికి వ్యతిరేకంగా తీసుకుపోతున్నారు… అదీ అభ్యంతరకరం… ఇవన్నీ గాకుండా అసలు ఆనందయ్య మందు చట్టవ్యతిరేకం, దానికి జగన్ ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని కూడా కొందరు వాదిస్తున్నారు…
అదేమంటే..? 1) తను శిక్షణ పొందినవాడు కాదు… 2) అది అప్రూవ్డ్ మందు కాదు… 3) మ్యాజిక్, రెమెడీ చట్టం ప్రకారం శిక్షార్హం… 4) అనుమతి లేని మందును అమ్మడం నేరం… 5) డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం ప్రకారం కూడా నిందితుడే… 6) పోలీసులు ఆల్రెడీ కేసు బుక్ చేశారు… ఇన్నిరకాలు చెబుతున్నారు… ఓసారి ఆ కోణంలో చూద్దాం… పోలీసులు తనపై పెట్టిన కేసు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నందుకు… అంతేతప్ప మందు, వైద్యం మీద కాదు… మ్యాజిక్, రెమెడీ చట్టం డాక్టర్లు, మందుల వాణిజ్య ప్రకటనల్ని నిషేధిస్తుంది,.. ప్రచారాల్ని నేరం అంటుంది… (పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ హోర్డింగ్స్ ప్రతి సిటీలోనూ కనిపిస్తయ్… అవీ అసలు తప్పు)… కానీ ఆనందయ్య తన మందు గురించి ప్రచారం చేసుకోలేదు, నా మందు కోసం రండి అని ఎవరినీ కోరలేదు… అన్నింటికీ మించి ఆ చట్టంలో ఏయే రోగాలను తగ్గిస్తామని ప్రచారం చేయకూడదని ఓ జాబితా పొందుపరిచారో, ఆ రోగాల జాబితాలో కరోనా లేదు, రాలేదు, చేర్చలేదు… మరి ఆ చట్టం తనకు వర్తిస్తుంది…
Ads
డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంలోని సెక్షన్ 33 ఈఈసీ చెప్పేది ఇది… ఆయుర్వేద, సిద్ధ, యునాని వైద్య పద్ధతుల్లో తమ రోగులకు మందు తయారు చేసి పంపిణీ చేసుకునే వైద్యులకు, హకీంలకు ఈ చట్టం వర్తించబోదని మినహాయింపు ఇది… మరి ఆనందయ్య మందు చట్టవ్యతిరేకం ఎలా అవుతుంది… చట్టమే ఇలాంటి వైద్యులను గోఎహెడ్ అంటోంది… అది చట్నీ, అది ఆకు పసరు, అది నాటు మందు, అది సాంబార్, అది బిర్యానీ అని వెక్కిరిస్తున్న బుర్రలు మరొకటి మరిచిపోతున్నయ్… ఆకు పసరు తయారు చేసేవాడికి శిక్షణ ఏముంటుంది..? లైసెన్స్ ఏముంటుంది..? డిగ్రీలు ఏముంటాయ్..? ఆ మందులకు అనుమతులు ఎవరిస్తారు..? ఒక వారసత్వ పరంపరగానో, గురువు ద్వారానో ఓ మందు తయారీ నేర్చుకుని ప్రజలకు పంపిణీ చేసే వాళ్లకు వేల ఏళ్లుగా ఏ కట్టుబాటూ, ఏ ఆంక్ష అడ్డుపడలేదు… జనం నమ్మితే మందు నిలబడుతుంది, లేకపోతే కొట్టుకుపోతుంది, అంతే… ఆనందయ్య మందు కూడా అంతే… మంచి జరిగితే వోకే, లేకపోతే నాలుగు రోజులకు జనమే వదిలేస్తారు… అప్పుడిక మెడికల్ మాఫియా మరింత రెచ్చిపోయి…. మరికొన్ని వేల మంది ఆయుష్షును, ఆస్తుల్ని దోచుకోవచ్చు…!!
Share this Article